AP Gurukulam Jobs : ఏపీ గురుకుల విద్యాలయాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ, జులై 18న వాక్ ఇన్ ఇంటర్వ్యూలు
AP Gurukulam Jobs : ఏపీలోని గురుకుల విద్యాలయాల్లో పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 18న గురుకుల విద్యా సంస్థల్లో డెమో కమ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
AP Gurukulam Jobs : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గురుకుల విద్యాలయాల్లో పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి గురుకుల విద్యాలయాల్లో పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల చేశారు. ఆయా జిల్లాల్లో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ జిల్లాల సమన్వయ కర్తలు ప్రకటనలు విడుదల చేశారు.
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న 13 బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాలలో పార్ట్ టైం ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేయటానికి తెలుగు, ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్, గణితం, జుయాలజీ, హిందీ, ఎకనమిక్స్, ఫిజికల్ డైరెక్టర్‌తో పాటు స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ నెల 18న గురువారం నెల్లిమర్లలోని బీఆర్ అంబేడ్కర్ గురుకులం డెమో కమ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. కేవలం పురుషులు మాత్రమే అర్హులు.
ఈ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు బీఈడీ, టెట్ అర్హత కలిగి ఉండాలి. అదే విధంగా స్టాఫ్ నర్స్ పోస్ట్‌కు జీఎన్ఎం, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు బీపీఈడీతో పాటు ఏదైనా పీజీ లేదా ఎంపీఈడీ అర్హతలు కలిగి ఉండాలి. పాఠశాలలు, కళాశాలల వారీగా ఖాళీల వివరాలు కోసం విజయనగరంలోని ఆర్ అండ్ బి జంక్షన్ వద్ద ఉన్న జిల్లా సమన్వయకర్త కార్యాలయంలో లేదా విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలలో ఉన్న బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాలలో సంప్రదించాలి. ఆయా ప్రాంతాల్లో నోటీస్ బోర్డులో వివరాలు ఉంచారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికేట్స్ తో పాటు ఉదయం 9.30 గంటలకు డెమో కమ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ నకు హాజరు కావొచ్చని విజయనగరం ఉమ్మడి జిల్లాల గురుకులం సమన్వయాధికారిణి టీఎం ఫ్లోరెన్స్ ప్రకటనలో పేర్కొన్నారు.
శ్రీకాకుళంలోని వివిధ గురుకులాల్లో పోస్టుల భర్తీ చేయనున్నారు. జిల్లాలోని కొల్లివలసలో మాథ్యమేటిక్స్ జూనియర్ లెక్చరర్ పోస్టు (పురుషులు మాత్రమే), కంచిలిలో కెమిస్ట్రీ జూనియర్ లెక్చరర్ పోస్టు (పురుషులు మాత్రమే), పాతపట్నం బాలికల గురుకుల పాఠశాలలో టీజీటీ బయోలాజికల్ సైన్స్, పీజీటీ సోషల్ స్టడీస్ (మహిళలు మాత్రమే), ఎచ్చెర్లలో జూనియర్ లెక్చరర్ జూవాలజీ పోస్టు (మహిళలు మాత్రమే) భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను డెమో కమ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు. ఆసక్తి గల పురుష, మహిళ అభ్యర్థులు పీజీ, బీఈడీ, టెట్ ఒరిజినల్ సర్టిఫికేట్లతో సహా బయోడేటాను పట్టుకుని ఈనెల 18న ఉదయం 10 గంటలకు శ్రీకాకుళంలోని ఆదివారంపేటలో జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయంలో హాజరుకావాలి. ఇతర వివరాల కోసం 08942-279926, 9000314209, 9701736862 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ ఎన్.బాలాజీ నాయక్ కోరారు.
ఉమ్మడి తూర్పుగోదావరిలో బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలల్లో (బాలురు) తెలుగు-4, హిందీ-1, ఇంగ్లీష్-4, గణితం-5, కెమిస్ట్రీ, ఫిజిక్స్, సివిక్స్, ఫిజికల్ డైరెక్టర్ ఒక్కొక్క పోస్టు, సోషల్ రెండు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తారు. కేవలం పురుషులు మాత్రమే అర్హులు. అలాగే బాలికల గురుకులాల్లో కెమిస్ట్రీ, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్, బోటనీ, జువాలజీ, సివిక్స్, హిందీ సబ్జెట్‌ల్లో ఒక్కో పోస్టు, గణితం-2, సోషల్-2, ఫిజిక్స్-3 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక్కడ మహిళ అభ్యర్థులు మాత్రమే అర్హులు. వీరికి గతంలో గురుకులాల్లో పని చేసిన వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున, గరిష్టంగా ఐదు మార్కులు ఇస్తారు. పురుష, మహిళా అభ్యర్థులు తమ సర్టిఫికేట్లను బయోడేటాతో సహా జులై 18 లోపు కాకినాడలోని ఏపీఎస్‌డబ్ల్యూఆర్ఈఐ సొసైటీ, కలెక్టరేట్ ప్రాంగణంలో అప్‌స్టేర్ వికాస ఆఫీస్‌లోని సమర్పించాలని గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా సమన్వయ అధికారి జి. వెంకటరమణ ప్రకటనలో తెలిపారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గురుకుల విద్యాలయంల్లో ఖాళీలగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గణితం-5, సోషల్, ఇంగ్లీష్, హిందీ, బోటనీ, హెల్త్ సూపర్ వైజర్ ఒక్కో పోస్టు, పీఈటీ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోగరలు. ఇంగ్లీష్ రెండు, జువాలజీ, బోటనీ, హిందీ ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు మహిళాలు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు. ఆసక్తి ఉన్నవారు ఒరిజినల్ సర్టిఫికేట్లతో దరఖాస్తును ఈనెల 18న లోగా ఏలూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ జిల్లా సమన్వయ అధికారి కార్యాలయం సమర్పించాలని జిల్లా కో ఆర్డినేటర్ ఎన్.భారతి కోరారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం