Vande Bharat Express : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో అతి త్వరలోనే వందేభారత్ పరుగులు-vande bharat express from nagpur to secunderabad to start from 15th september ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vande Bharat Express : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో అతి త్వరలోనే వందేభారత్ పరుగులు

Vande Bharat Express : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో అతి త్వరలోనే వందేభారత్ పరుగులు

Basani Shiva Kumar HT Telugu
Sep 09, 2024 12:29 PM IST

Vande Bharat Express : సికింద్రాబాద్ నుంచి మరో వందేభారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ అతి త్వరలో ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నడవనుంది. సాధారణ ప్రయాణం కంటే 45 నిమిషాల తక్కువ సమయంలో గమ్యస్థానం చేరుకోవచ్చు.

వందేభారత్ ఎక్స్‌ప్రెస్
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (@RailMinIndia)

నాగ్‌పూర్- సికింద్రాబాద్ మధ్య నడవనున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య 578 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్ చేరుకోవడానికి 8 గంటల సమయం పడుతుంది. ఈ వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తే.. 7.15 గంటల్లోనే నాగ్‌పూర్ చేరుకోవచ్చు.

ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం.. ఈ రైలు నాగ్‌పూర్‌లో ఉదయం 5 గంటలకు బయల్దేరుతుంది. మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం ఒంటిగంటకు సికింద్రాబాద్‌లో బయల్దేరి.. రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్‌కు చేరుకోనుంది. కాజీపేట్, రామగుండం, బల్లార్ష, చంద్రాపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది.

మంగళవారం సెలవు..

విశాఖపట్నం - సికింద్రాబాద్ (20833) మధ్య నడిచే వందే భారత్ ట్రైన్ వారంలో ఆరు రోజులు సర్వీసు అందిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. గతంలో ఉన్న షెడ్యూల్ ప్రకారం.. ఆదివారం సెలవు ఉండగా, ప్రస్తుతం దీన్ని మంగళవారానికి మారుస్తున్నట్లు వివరించింది. ఈ నిర్ణయం డిసెంబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

ఇక సికింద్రాబాద్ - విశాఖపట్నం( 20834) మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ షెడ్యూల్ లో కూడా మార్పులు చేశారు. ఈ ట్రైన్ కూడా మంగళవారం అందుబాటులో ఉండదని అధికారులు వివరించారు. ఈ నిర్ణయం కూడా డిసెంబర్ 10 నుంచే అమల్లోకి వస్తుందని చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు షెడ్యూల్ ప్రకారం ఈ రైలు ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు సేవ‌లందించేది.

విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్.. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతుంది. ఇటీవలే ఏలూరు స్టేషన్‌నూ ఆపాలని అధికారులు నిర్ణయించారు.