తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana News Live September 8, 2024: Bsf Constable Suicide : గుజరాత్ లో తెలంగాణ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ సూసైడ్, 15 రోజుల క్రితమే ఎంగేజ్మెంట్, ఇంతలోనే!
BSF Constable Suicide : గుజరాత్ లో తెలంగాణ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ సూసైడ్, 15 రోజుల క్రితమే ఎంగేజ్మెంట్, ఇంతలోనే!
BSF Constable Suicide : గుజరాత్ లో తెలంగాణ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ సూసైడ్, 15 రోజుల క్రితమే ఎంగేజ్మెంట్, ఇంతలోనే!

Telangana News Live September 8, 2024: BSF Constable Suicide : గుజరాత్ లో తెలంగాణ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ సూసైడ్, 15 రోజుల క్రితమే ఎంగేజ్మెంట్, ఇంతలోనే!

08 September 2024, 21:48 IST

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

08 September 2024, 21:48 IST

Telangana News Live: BSF Constable Suicide : గుజరాత్ లో తెలంగాణ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ సూసైడ్, 15 రోజుల క్రితమే ఎంగేజ్మెంట్, ఇంతలోనే!

  • BSF Constable Suicide : గుజరాత్ లో విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణకు చెందిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. గత నెలలో ఆమె ఎంగేజ్మెంట్ కాగా ఇంతలోనే దారుణానికి పాల్పడింది. శనివారం విధుల్లోంచి మధ్యలోనే వచ్చిన యువతి తన క్వార్టర్స్ లో ఉరివేసుకుంది.
పూర్తి స్టోరీ చదవండి

08 September 2024, 17:42 IST

Telangana News Live: Revanth Reddy : జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు.. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

  • Revanth Reddy : రవీంద్ర భారతిలో జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మాక్ హౌసింగ్ సొసైటీకి భూపంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

08 September 2024, 16:03 IST

Telangana News Live: AV Ranganath : అక్కడ ఇళ్లు, ప్లాట్లు కొనుగోలు చేయొద్దు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన.. 8 ముఖ్యాంశాలు

  • AV Ranganath : హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని ప్రకటించింది. ఎఫ్టీఎల్‌, బఫర్‌జోన్‌లో అనుమతి లేకుండా నిర్మిస్తున్నారు.. కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నామని స్పష్టం చేసింది. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయొద్దని కమిషనర్ రంగనాథ్ సూచించారు.
పూర్తి స్టోరీ చదవండి

08 September 2024, 15:32 IST

Telangana News Live: Tribal Unity : ఐకమత్యానికి కేరాఫ్ అడ్రస్ ఆదివాసులు, పోరాట స్ఫూర్తికి నిదర్శనం

  • Tribal Unity : ఆదివాసీలు పోరాటానికి వెనుకాడరు. అనుకుంటే సాధించే వరకు పోరాటం ఆపరు. ఐకమత్యానికి కేరాఫ్ అడ్రస్ ఆదివాసీలు. అందుకు నిదర్శనం ఇంద్రవెల్లి ఘటన. ఇప్పటీ ప్రభుత్వంతో అనేక విషయాల్లో ఆదివాసీలు పోరాటాలు చేస్తూనే ఉన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

08 September 2024, 15:11 IST

Telangana News Live: Hydra Demolish : వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు హైడ్రా ఝలక్.. అక్రమ కట్టడాలు కూల్చివేత.. లిస్టులో మరికొందరు!

  • Hydra Demolish : హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ప్రముఖులకు చెందిన అక్రమ కట్టడాలను వదలడం లేదు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు చెందిన అక్రమ కట్టడాలను హైడ్రా నేలమట్టం చేసింది. దీనిపై అటు ఏపీలోనూ చర్చ జరుగుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

08 September 2024, 14:26 IST

Telangana News Live: ganesh chaturthi 2024 : ఇదేం పాడుబుద్ధి.. వినాయకుడి చేతిలో లడ్డూను ఎత్తుకెళ్లిన దొంగ!

  • ganesh chaturthi 2024 : హైదరాబాద్‌లో ఓ దొంగ తన పాడు బుద్ధిని ప్రదర్శించాడు. ఎవరైనా డబ్బులు, బంగారం, ఇతర వస్తువులు ఎత్తుకెళ్తారు గానీ.. ఈ దొంగ మాత్రం ఏకంగా వినాయకుడి చేతిలో పెట్టిన లడ్డూను ఎత్తుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
పూర్తి స్టోరీ చదవండి

08 September 2024, 13:16 IST

Telangana News Live: Khammam Floods : ఖమ్మం - వైరా హైవే మీద వరద బాధితుల ధర్నా.. కారణం ఏంటో తెలుసా?

  • Khammam Floods : ఖమ్మం ప్రజలను వర్షాలు, వరదలు వెంటాడుతున్నాయి. అయితే.. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలోకి నీరు వస్తున్నా.. అధికారులు ఇటువైపు రావడం లేదని ఖమ్మం - వైరా హైవేపై ఆందోళన చేశారు. అటు కేంద్రమంత్రిని అడ్డుకున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

08 September 2024, 12:27 IST

Telangana News Live: Murali Mohan : నేనే కూలుస్తా.. హైడ్రా నోటీసులపై నటుడు మురళీమోహన్ స్పందన..!

  • Murali Mohan : హైదరాబాద్‌లోని జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌కు హైడ్రా నోటీసులు ఇచ్చింది. దీనిపై సినీ నటుడు మురళీ మోహన్ స్పందించారు. బఫర్ జోన్‌లో ఉన్న కట్టడాలను తానే కూల్చేస్తానని ప్రకటించారు. అటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

08 September 2024, 11:17 IST

Telangana News Live: HYDRA : ఆక్రమణలపై 'హైడ్రా' దూకుడు.. దుండిగల్ పరిధిలో విల్లాల కూల్చివేత

  •  హైదరాబాద్ పరిధిలో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. ఇవాళ మేడ్చల్‌ జిల్లాలోని దుండిగల్‌ మున్సిపాలిటీల పరిధిలో ఆక్రమణలను కూల్చివేస్తోంది. ఇందులో విల్లాలు ఉన్నాయి. మరోవైపు ఇంటి యాజమానులు ఆందోళనకు దిగారు.
పూర్తి స్టోరీ చదవండి

08 September 2024, 10:56 IST

Telangana News Live: IOB Apprentice 2024 : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 550 అప్రెంటిస్ ఖాళీలు - ఏపీ, తెలంగాణలో ఎన్ని ఉన్నాయంటే..!

  • దేశవ్యాప్తంగా 550 అప్రెంటస్ ఖాళీల భర్తీకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇటీవలే ప్రకటన జారీ చేసింది. ఇందులో చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో నుంచి 22, తెలంగాణలో 29 ఖాళీలు ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 10వ తేదీతో పూర్తి కానుంది.
పూర్తి స్టోరీ చదవండి

08 September 2024, 9:54 IST

Telangana News Live: Hydra : జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌కు హైడ్రా నోటీసులు.. ఆ నిర్మాణాలు ఎవరివో తెలుసా?

  • Summary: హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా కాస్త గ్యాప్ ఇచ్చిన హైడ్రా.. మళ్లీ స్పీడ్ పెంచింది. గతంలో కొందరు తమ పలుకుబడితో అక్రమంగా నిర్మించుకున్న భవనాలపై ఫోకస్ పెట్టింది. తాజాగా ఓ సినీ ప్రముఖుడికి చెందిన కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీకి కూల్చివేత నోటీసులు ఇచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

08 September 2024, 9:10 IST

Telangana News Live: TG CPGET 2024 Updates : టీజీ సీపీగెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు..! మీ అలాట్​మెంట్​ ఇలా చెక్ చేసుకోండి

  • TG CPGET 2024 Counselling : టీజీ సీపీగెట్ -2024 ప్రవేశాలకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ సీట్లను ఇవాళ కేటాయించనున్నారు. సీట్లు పొందే విద్యార్థులు సెప్టెంబర్ 13వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. ఇక సెప్టెంబర్ 18వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందని అధికారులు ప్రకటించారు.
పూర్తి స్టోరీ చదవండి

08 September 2024, 7:34 IST

Telangana News Live: Karimnagar : ఆ ముగ్గురు నేతలు కలిశారు..! కరీంనగర్ పాలిటిక్స్ లో ఆసక్తికర సన్నివేశం

  • కరీంనగర్ నగర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది. శనివారం గణపతి మండపంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం, ఎమ్మెల్యే గంగుల కలిశారు. ఈ సందర్భంగా ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

08 September 2024, 6:52 IST

Telangana News Live: Basara IIIT Students : 'రెగ్యూలర్ వీసీని నియమించండి' - బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థుల ఆందోళన

  • బాసర ఐఐఐటీ విద్యార్థులు మరోసారి ఆందోళనబాట పట్టారు. ఇంఛార్జ్ వీసీని తొలగించి… రెగ్యూలర్ వీసీని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. క్యాంపస్ లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నారు. నాలుగు రోజులుగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు అధికారులు క్యాంపస్ లో ఆంక్షలు విధించారు.
పూర్తి స్టోరీ చదవండి

08 September 2024, 6:25 IST

Telangana News Live: IMD Weather Updates : తెలంగాణలో ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు! ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త, ఐఎండీ హెచ్చరికలు!

  •  తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివార ఖమ్మం, మహబూబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా.. మరో నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండనుంది. ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి