TG CPGET 2024 Updates : టీజీ సీపీగెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు..! మీ అలాట్​మెంట్​ ఇలా చెక్ చేసుకోండి-tg cpget 2024 counselling first phase seat allotment start from today check at httpscpgettscheacin ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Cpget 2024 Updates : టీజీ సీపీగెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు..! మీ అలాట్​మెంట్​ ఇలా చెక్ చేసుకోండి

TG CPGET 2024 Updates : టీజీ సీపీగెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు..! మీ అలాట్​మెంట్​ ఇలా చెక్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Sep 08, 2024 09:10 AM IST

TG CPGET 2024 Counselling : టీజీ సీపీగెట్ -2024 ప్రవేశాలకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ సీట్లను ఇవాళ కేటాయించనున్నారు. సీట్లు పొందే విద్యార్థులు సెప్టెంబర్ 13వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. ఇక సెప్టెంబర్ 18వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందని అధికారులు ప్రకటించారు.

టీజీ సీపీగెట్ కౌన్సెలింగ్ - ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు
టీజీ సీపీగెట్ కౌన్సెలింగ్ - ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు

తెలంగాణలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీపీగెట్ -2024 ఫస్ట్ ఫేజ్ సీట్లను ఇవాళ(సెప్టెంబర్ 08) కేటాయించనున్నారు. వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న అభ్యర్థులు https://cpget.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అలాట్ మెంట్ అర్డన్ ను పొందవచ్చు. ఈ ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందిన విద్యార్థులు… సెప్టెంబర్ 13వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

అలాట్ మెంట్ ఇలా చెక్ చేసుకోండి:

  • టీజీ సీపీగెట్ 2024 అభ్యర్థులు https://cpget.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • TG CPGET -2024 First Phase Seat Allotment ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ అలాట్ మెంట్ అర్డర్ కాపీ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
  • మీరు సీటు పొందిన కాలేజీలో అలాట్ మెంట్ కాపీని ఇవ్వాల్సి ఉంటుంది.

18 నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్…

రెండో విడత కౌన్సెలింగ్‌ సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందని విద్యార్థులతో పాటు కొత్తగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. https://cpget.tsche.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి… రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

తెలంగాణ సీపీగెట్ - 2024 (కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. మొత్తం 73,342 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా… ఇందులో 64,765 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 61,246 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 2024-25 విద్యా సంవత్సరానికి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు.

రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో ఉన్న 297 పీజీ కాలేజీల్లో( ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంపీఈడీ కోర్సు) 45 కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్‌ నిర్వహించారు.సీపీగెట్ పరీక్షలను జూలై 6వ తేదీ నుంచి కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహించారు.జులై 17వ తేదీతో అన్ని పరీక్షలు పూర్తి అయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా 44వేలకు పైగా పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీపీగెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీలో ఏ సబ్జెక్టు చేసినా, పీజీలో ఇష్టమొచ్చిన సామాజిక కోర్సుల్లో చేరేందుకు వీలు కల్పిస్తున్నారు. ఎంబీబీఎస్, బీటెక్‌ విద్యార్థులు కూడా ఎంఏ, ఎంకామ్‌ వంటి కోర్సుల్లో చేరే వీలుంది. ఈ ఏడాది కూడా ఉస్మానియా వర్శిటే ఈ పరీక్ష నిర్వహించింది.

TG CPGET 2024 ర్యాంక్ ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి :

Step 1: పరీక్ష రాసిన అభ్యర్థులు https://cpget.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

Step 2: సీపీగెట్ - 2024 ఫలితాల లింక్ పై క్లిక్ చేయాలి.

Step 3: ఓపెన్ అయ్యే విండోలో హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ తో పాటు పుట్టిన తేదీని ఎంట్రీ చేయాలి.

Step 4: మీ ర్యాంక్ కార్డ్ డిస్ ప్లే అవుతుంది.

Step 5: ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

Whats_app_banner