KU Distance Education 2024 : కాకతీయ యూనివ‌ర్సిటీ దూర విద్యా కోర్సులకు నోటిఫికేషన్ - దరఖాస్తులకు ఆగస్టు 31 వరకు గడువు-kakatiya university distance courses admission notification 2024 released key dates check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ku Distance Education 2024 : కాకతీయ యూనివ‌ర్సిటీ దూర విద్యా కోర్సులకు నోటిఫికేషన్ - దరఖాస్తులకు ఆగస్టు 31 వరకు గడువు

KU Distance Education 2024 : కాకతీయ యూనివ‌ర్సిటీ దూర విద్యా కోర్సులకు నోటిఫికేషన్ - దరఖాస్తులకు ఆగస్టు 31 వరకు గడువు

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 11, 2024 12:41 PM IST

Kakatiya University Distance Admissions : దూర విద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాల కోసం కాకతీయ యూనివర్శిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్ అప్లికేషన్లకు ఆగస్టు 31వ తేదీని తుది గడువుగా పేర్కొన్నారు. http://sdlceku.co.in/ వెబ్ సైట్ లోకి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.

కేయూ దూరవిద్యలో ప్రవేశాలు 2024
కేయూ దూరవిద్యలో ప్రవేశాలు 2024

KU Distance Courses Admission 2024: వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్‌ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ నుంచి ప్రవేశాల ప్రకటన విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో యూజీ/ పీజీ/ డిప్లొమా/ సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. యూజీ, పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు కావాల్సిన అర్హతలు, దరఖాస్తు వివరాలు, ముఖ్యమైన తేదీలను పేర్కొంది. ఆన్ లైన్ దరఖాస్తులకు ఆగస్టు 31వ తేదీని తుది గడువుగా ఉంది.

ముఖ్య వివరాలు:

  • ప్రవేశాల ప్రకటన - స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్‌ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, కాకతీయ వర్శిటీ.
  • యూజీ కోర్సులు: బీకాం(జనరల్)/ బీకాం (కంప్యూటర్స్)/ బీబీఏ/ బీఎస్సీ(మ్యాథ్స్/ స్టాటిస్టిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌)/ BLIsc (వ్యవధి: మూడేళ్లు.)
  • పీజీ కోర్సులు - ఎంఏ (ఇంగ్లిష్/ హిందీ/ సంస్కృతం/ చరిత్ర/ ఎకనామిక్స్/ పొలిటికల్ సైన్స్/ ఆర్‌డీ/ సోషియాలజీ), ఎంఏ హెచ్‌ఆర్‌ఎం/ ఎంకాం/ ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ జేఎంసీ/ ఎంఎస్సీ (బోటనీ/ కెమిస్ట్రీ/ ఫిజిక్స్). (వ్యవధి: )రెండేళ్లు.
  • డిప్లొమా కోర్సులు: బిజినెస్ మేనేజ్‌మెంట్/ రిటైల్ మార్కెటింగ్/ ట్యాలీ/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్/ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్/ పీడీ అండ్‌ సి స్కిల్స్ (వ్యవధి: ఒక ఏడాది)
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-08-2024.
  • యూజీ, పీజీ కోర్సుల్లో సెమిస్టర్ విధానం ఉంటుంది. 
  • అధికారిక వెబ్ సైట్ - http://sdlceku.co.in/index.php 
  • మెయిల్ - info@sdlceku.co.in

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీ నుంచి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. దూర విద్యా ద్వారా డిగ్రీ, పీజీ, లైబ్రరీ సైన్స్‌, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. ఆగస్టు 18, 2024 వరకు గడువు విధించారు. 

డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు ఉన్నాయి. ఇక పీజీలో ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సులను పేర్కొంది. ఇందులో అడ్మిషన్లు పొందేందుకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ .. ఆగస్టు 18,2024 తేదీతో ముగియనుంది. ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాలని నోటిఫికేషన్ లో అధికారులు పేర్కొన్నారు. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్ ల ద్వారా చెల్లించవచ్చు.

ఆయా కోర్సులను బట్టి ఫీజులను ఖరారు చేశారు. అధికారిక సైట్ లో ఆ వివరాలను కూడా పొందుపరిచారు. జిల్లాల్లోనూ స్టడీ సెంటర్లలో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం వర్సిటీ హెల్ప్​లైన్ నెంబర్లు 7382929570, 7382929580, 7382929590 & 7382929600 సంప్రదించవచ్చు.

అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ (డిగ్రీ) కు 10+2 / ఇంటర్మీడియట్ / ఐటీఐలో ఉత్తీర్ణత సాధించాలి. బీఏ, బీకాం, బీఎస్సీ - తెలుగు / ఇంగ్లిష్ మీడియం, బీఏ, బీఎస్సీ - ఉర్దూ మీడియంలలో ఉన్నాయి. ఇక పీజీ కోర్సులైన ఎంఏ / ఎంఎస్సీ / ఎంకాంలకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతను అర్హతగా పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో ఉన్నాయి.

Whats_app_banner