KU Distance Education : కేయూ దూరవిద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు - ముఖ్య తేదీలివే-admission notification for ku distance education courses released ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ku Distance Education : కేయూ దూరవిద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు - ముఖ్య తేదీలివే

KU Distance Education : కేయూ దూరవిద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు - ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 03, 2023 09:02 AM IST

Kakatiya University Latest News: దూర విద్యలో డిగ్రీ, పీజీ చేయాలనుకునేవారికి అలర్ట్ ఇచ్చింది కాకతీయ వర్శిటీ. ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్య తేదీలను ఇక్కడ చూడండి….

కేయూలో డిస్టెన్స్ కోర్సులు
కేయూలో డిస్టెన్స్ కోర్సులు (KU)

KU Distance Courses Admission 2023: వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్‌ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ నుంచి ప్రవేశాల ప్రకటన విడుదలైంది. 2023-24 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో యూజీ/ పీజీ/ డిప్లొమా/ సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అండర్ గ్రాడ్యుయేట్, పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు కావాల్సిన అర్హతలు, దరఖాస్తు వివరాలు, ముఖ్యమైన తేదీలను పేర్కొంది.

ముఖ్య వివరాలు:

యూజీ కోర్సులు: బీకాం(జనరల్)/ బీకాం (కంప్యూటర్స్)/ బీబీఏ/ బీఎస్సీ(మ్యాథ్స్/ స్టాటిస్టిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌)/ BLIsc (వ్యవధి: మూడేళ్లు.)

- PG కోర్సులు - ఎంఏ (ఇంగ్లిష్/ హిందీ/ సంస్కృతం/ చరిత్ర/ ఎకనామిక్స్/ పొలిటికల్ సైన్స్/ ఆర్‌డీ/ సోషియాలజీ), ఎంఏ హెచ్‌ఆర్‌ఎం/ ఎంకాం/ ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ జేఎంసీ/ ఎంఎస్సీ (బోటనీ/ కెమిస్ట్రీ/ ఫిజిక్స్). (వ్యవధి: )రెండేళ్లు.

-డిప్లొమా కోర్సులు: బిజినెస్ మేనేజ్‌మెంట్/ రిటైల్ మార్కెటింగ్/ ట్యాలీ/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్/ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్/ పీడీ అండ్‌ సి స్కిల్స్ (వ్యవధి: ఒక ఏడాది)

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11-09-2023.

రూ.200 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ:12 -09- 2023 నుంచి 21-09-2023.

రూ.300 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 07-10-2023.

ప్రవేశానికి చివరి తేదీ: 07-10-2023.

అధికారిక వెబ్ సైట్ - http://sdlceku.co.in/index.php

మెయిల్ - info@sdlceku.co.in

అడ్మిషన్ నోటిఫికేష్
అడ్మిషన్ నోటిఫికేష్

Prof. G. Ram Reddy Centre for Distance Education: ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ జి.రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ విభాగం. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనుంది.

ముఖ్య వివరాలు:

యూనివర్శిటీ - ప్రొఫెసర్‌ జి.రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, ఉస్మానియా వర్శిటీ

కోర్సుల వివరాలు: ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, బీఏ, బీకాం, బీబీఏ, పీజీ డిప్లొమా కోర్సులు.

కోర్సుల వ్యవధి: ఆయా కోర్సులను అనుసరించి ఏడాది నుంచి మూడేళ్ల వరకు ఉంటుంది.

మీడియం : కొన్ని కోర్సులు తెలుగు మీడియంలో, మరికొన్ని ఇంగ్లీష్ మీడియాలో ఉన్నాయి.

అర్హత: కోర్సులను అనుసరించి ఇంటర్మీడియట్‌ (10+2) / తత్సమాన, గ్రాడ్యుయేషన్, బీకాం, టీఎస్‌ ఐసెట్‌/ ఏపీఐసెట్‌ ఎంట్రెన్స్ లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.12.2023

అధికారిక వెబ్ సైట్ - http://www.oucde.net/

Whats_app_banner