IOB Apprentice 2024 : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 550 అప్రెంటిస్ ఖాళీలు - ఏపీ, తెలంగాణలో ఎన్ని ఉన్నాయంటే..!
దేశవ్యాప్తంగా 550 అప్రెంటస్ ఖాళీల భర్తీకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇటీవలే ప్రకటన జారీ చేసింది. ఇందులో చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో నుంచి 22, తెలంగాణలో 29 ఖాళీలు ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 10వ తేదీతో పూర్తి కానుంది.
550 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా… మరో రెండు రోజుల్లో గడువు పూర్తి అవుతుంది. అంటే అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీ లోపు అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. https://www.iob.in/Careers లింక్ పై క్లిక్ చేసి డైరెక్ట్ గా అప్లయ్ చేసుకోవచ్చు.
ఏపీ, తెలంగాణలో ఖాళీల వివరాలు:
దేశవ్యాప్తంగా 550 ఖాళీలు ఉండగా… తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 51 పోస్టులు ఉన్నాయి. ఇందులోనూ తెలంగాణ నుంచి 29, ఆంధ్రప్రదేశ్ నుంచి 22 ఖాళీలను భర్తీ చేస్తారు. ఓపెన్ కేటగిరితో పాటు రిజర్వేషన్ల ఆధారంగా పోస్టులను వర్గీకరించారు.
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ గడువు సెప్టెంబర్ 10వ తేదీతో పూర్తి అవుతుంది. అయితే అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి సెప్టెంబర్ 15వ తేదీని గడువుగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన రాత పరీక్షలు సెప్టెంబర్ 22వ తేదీన నిర్వహించనున్నారు. 550 ఖాళీల్లో ఆన్ రిజర్వ్ డ్ 284 ఉండగా… ఎస్సీ 78, ఓబీసీ 118, ఎస్టీ 26, ఈడబ్యూఎస్ - 44గా ఉన్నాయి.జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.800 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు రూ.600 పేమెంట్ చేయాలి, ఇక దివ్యాంగులకు రూ.400గా నిర్ణయించారు.
అర్హతలు:
గుర్తింపు పొందిన వర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తత్సమాన విద్యార్హతలు కలిగి ఉండాలి. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థుల వయసు 01.08.2024 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ తో పాటు వర్తించే చోట స్థానిక భాషను పరీక్షిస్తారు. అలాగే, బ్యాంక్ నిర్ణయించిన విధంగా వ్యక్తిగత ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్షా విధానం:
ఆన్ లైన్ ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం 100 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్ ఉండదు. తమ రాష్ట్రాల్లో ట్రైనింగ్ సీట్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆ రాష్ట్రంలోని ఏదైనా ఒక స్థానిక భాషలో ప్రావీణ్యం (చదవడం, రాయడం, మాట్లాడటం, అవగాహన) కలిగి ఉండాలి.
ఎంపికైన అభ్యర్థుల అప్రెంటిస్ కాలం ఏడాదిగా ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు మెట్రో ప్రాంతానికి రూ.15,000 చెల్లిస్తారు. ఇక అర్బన్ ప్రాంతంలో అయితే రూ.12,000, సెమీ-అర్బన్/ రూరల్ ప్రాంతానికి రూ.10,000 చెల్లిస్తారు. https://www.iob.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
బీహెచ్ఈఎల్ లో 100 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ :
హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో 100 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రామచంద్రపురం భెల్ లో అప్రెంటిస్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ట్రేడ్ అప్రెంటిస్‌లుగా శిక్షణ ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు :
• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం, ముగింపు- 04.09.2024 నుంచి 13.09.2024 వరకు
• HR-రిక్రూట్‌మెంట్ విభాగానికి ఫారమ్- I సమర్పించడానికి చివరి తేదీ- 14.09.2024 (సాయంత్రం 4.30 గంటలు)
• తాత్కాలిక పరీక్ష తేదీ- 24.09.2024