BRAOU Admissions : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, PG అడ్మిషన్లు - సింపుల్ గా మీరే అప్లయ్ చేసుకోవచ్చు, ప్రాసెస్ ఇలా-how to apply for braou degree and pg courses 2024 through online check this steps ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Braou Admissions : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, Pg అడ్మిషన్లు - సింపుల్ గా మీరే అప్లయ్ చేసుకోవచ్చు, ప్రాసెస్ ఇలా

BRAOU Admissions : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, PG అడ్మిషన్లు - సింపుల్ గా మీరే అప్లయ్ చేసుకోవచ్చు, ప్రాసెస్ ఇలా

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 06, 2024 02:57 PM IST

Ambedkar Open University Admissions 2024: డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 30వ తేదీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ చూడండి…!

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో ప్రవేశాలు 2024
అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో ప్రవేశాలు 2024

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే తుది గడువును కూడా పొడిగించారు. దీంతో అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగా అభ్యర్థులు డిగ్రీ, పీజీతో పాటు డిప్లోమా కోర్సుల్లో చేరవచ్చు.

అర్హత కలిగిన అభ్యర్థులు https://online.braou.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి నేరుగా అప్లయ్ చేసుకోవచ్చు. కోర్సుల వివరాలు, ట్యూషన్ ఫీజు వివరాలు కూడా వెబ్ సైట్ లో పొందుపరిచారు. మీ విద్యా అర్హతలు బట్టి కోర్సులను ఎంచుకోవచ్చు.

డిగ్రీలో అడ్మిషన్ - ఇలా అప్లయ్ చేసుకోండి:

  • ఇంటర్ పూర్తి చేసి డిస్టెన్స్(దూర విద్య) లో డిగ్రీ చేయాలనుకునే అభ్యర్థులు అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో చేరవచ్చు.
  • ఇలాంటి విద్యార్థులు https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే Admissions for UG (BA/B.Sc/B.Com) ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ యూజీ ఫస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని పక్కన ఉండే Registration Linkపై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ కొన్ని ఆప్షన్లు డిస్ ప్లే అవుతాయి. ఇంటర్ విద్యను ఏ మోడ్ లో పూర్తి చేశారనేది. రెగ్యూలర్ లో చూస్తే రెగ్యూలర్ ఇంటర్మీడియట్ లేదా ఓపెన్ లో చేస్తే సంబంధిత ఆప్షన్ ను ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.
  • ముందుగా రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అభ్యర్థి పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, చదవాల్సిన కోర్సును ఎంచుకోవాలి.
  • సబ్మిట్ చేసిన తర్వాత ఆన్ లైన్ దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది.
  • ఇక్కడ మీ పూర్తి వివరాలను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.
  • ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాలి.
  • కోర్సు ఫీజును ఆన్ లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
  • చివరల్లో సబ్మిట్ చేసిన తర్వాత ప్రాథమికంగా రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.
  • ఆ తర్వాత అడ్మిషన్ ఖరారుకు సంబంధించి యూనివర్శిటీ నుంచి సమాచారం అందుతుంది. మీరు ఎంచుకున్న స్టడీ సెంటర్ కు వెళ్లి మీ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీని అందజేయాల్సి ఉంటుంది.

పీజీ అడ్మిషన్ - ప్రాసెస్ ఇదే:

  • డిగ్రీ పూర్తి చేసి డిస్టెన్స్(దూర విద్య) లో పీజీ చేయాలనుకునే అభ్యర్థులు అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో చేరవచ్చు.
  • ఇలాంటి విద్యార్థులు https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే Admissions for PG(MSc/MA/M.Com) ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ యూజీ ఫస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని పక్కన ఉండే Registration Linkపై క్లిక్ చేయాలి.
  • ముందుగా రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అభ్యర్థి పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, చదవాల్సిన కోర్సును ఎంచుకోవాలి.
  • సబ్మిట్ చేసిన తర్వాత ఆన్ లైన్ దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది.
  • ఇక్కడ మీ పూర్తి వివరాలను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.
  • ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాలి.
  • కోర్సు ఫీజును ఆన్ లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
  • చివరల్లో సబ్మిట్ చేసిన తర్వాత ప్రాథమికంగా రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.
  • ఆ తర్వాత అడ్మిషన్ ఖరారుకు సంబంధించి యూనివర్శిటీ నుంచి సమాచారం అందుతుంది. మీరు ఎంచుకున్న స్టడీ సెంటర్ కు వెళ్లి మీ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీని అందజేయాల్సి ఉంటుంది.

ముఖ్యమైన డైరెక్ట్ లింక్స్:

సంబంధిత కథనం