BSF Constable Suicide : గుజరాత్ లో తెలంగాణ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ సూసైడ్, 15 రోజుల క్రితమే ఎంగేజ్మెంట్, ఇంతలోనే!-peddapalli ntpc bsf constable committed suicide in gujarat security force quarters ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bsf Constable Suicide : గుజరాత్ లో తెలంగాణ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ సూసైడ్, 15 రోజుల క్రితమే ఎంగేజ్మెంట్, ఇంతలోనే!

BSF Constable Suicide : గుజరాత్ లో తెలంగాణ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ సూసైడ్, 15 రోజుల క్రితమే ఎంగేజ్మెంట్, ఇంతలోనే!

Bandaru Satyaprasad HT Telugu
Sep 08, 2024 09:50 PM IST

BSF Constable Suicide : గుజరాత్ లో విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణకు చెందిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. గత నెలలో ఆమె ఎంగేజ్మెంట్ కాగా ఇంతలోనే దారుణానికి పాల్పడింది. శనివారం విధుల్లోంచి మధ్యలోనే వచ్చిన యువతి తన క్వార్టర్స్ లో ఉరివేసుకుంది.

గుజరాత్ లో తెలంగాణ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ సూసైడ్, 15 రోజుల క్రితమే ఎంగేజ్మెంట్, ఇంతలోనే!
గుజరాత్ లో తెలంగాణ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ సూసైడ్, 15 రోజుల క్రితమే ఎంగేజ్మెంట్, ఇంతలోనే!

BSF Constable Suicide : గుజరాత్ లోని గాంధీనగర్ లో తెలంగాణకు చెందిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ బల్ల గంగా భవానీ బలవన్మరణానికి పాల్పడింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన గంగా భవానీ గుజరాత్ సెక్యూరిటీ ఫోర్స్ లో విధులు నిర్వహిస్తున్నారు. డ్యూటీలో నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన యువతి, తన క్వార్టర్స్‌లో ఆత్మహత్య చేసుకుంది. 15 రోజుల క్రితమే యువతి నిశ్చితార్థం కాగా, ఇంతనే బలవన్మరణానికి పాల్పడటం ఆ కుటుంబంలో విషాదం నింపింది. గంగా భవానీ హెడ్‌ క్వార్టర్స్‌లో శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు సెంట్రింగ్‌ డ్యూటీ చేసింది. అనంతరం తన క్వార్టర్స్‌కు వెళ్లింది. రాత్రి 9 గంటలు అయినా యువతి డ్యూటీకి రాకపోవడంతో అధికారులు ఆమె క్వార్టర్స్ కు వెళ్లారు. తలుపు లోపలి నుంచి గడియపెట్టి ఉండటంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులను తొలగించి లోపలి వెళ్లగా... ఆమె కిటికీకి ఉరేసుకుని ఉండటం గమనించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గత నెలలోనే నిశ్చితార్థం

ఆదివారం సాయంత్రం గంగా భవానీ మృతదేహం ఎన్టీపీసీ సుభాష్ నగర్ లో నివాసం ఉంటున్న ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. యువతి మృతదేహం చూసి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. గంగాభవానీకి ఇటీవల పెళ్లి కుదిరింది. గత నెల 22న ఎంగేజ్మెంట్‌ కూడా జరిగింది. డిసెంబర్‌ 5న పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. ఎంగేజ్మెంట్ కోసం ఇటీవల పెద్దపల్లికి వచ్చిన గంగా భవానీ ఈ నెల 1న గుజరాత్‌ కు తిరిగి వెళ్లి విధుల్లో చేరింది. ఇంతలోనే యువతి ఆత్మహత్య చేసుకోవడంతో అసలు ఏం జరిగిందో కుటుంబ సభ్యులకు పాలుపోవడం లేదు.

సంబంధిత కథనం