BSF recruitment drive: బీఎస్ఎఫ్ లో భారీ రిక్రూట్ మెంట్; టెన్త్ పాసైతే చాలు..-bsf to recruit 1410 constable tradesman posts details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Bsf To Recruit 1410 Constable (Tradesman) Posts, Details Here

BSF recruitment drive: బీఎస్ఎఫ్ లో భారీ రిక్రూట్ మెంట్; టెన్త్ పాసైతే చాలు..

HT Telugu Desk HT Telugu
Feb 03, 2023 10:13 PM IST

సరిహద్దు రక్షక దళం (Border Security Force BSF) లో భారీ రిక్రూట్ మెంట్ కు తెరలేచింది. BSF లో మొత్తం 1410 కానిస్టేబుల్ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

BSF recruitment drive: కానిస్టేబుల్ (ట్రేడ్స్ మ్యాన్) (Constable (Tradesman)) పోస్ట్ ల భర్తీకి BSF నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు గానూ, వారు బీఎస్ఎఫ్ (BSF) అధికారిక వెబ్ సైట్ rectt.bsf.gov.in. లో లాగిన్ కావాల్సి ఉంటుంది. వెబ్ సైట్ లో నోటిఫికేషన్ పబ్లిష్ అయిన నాటి నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వయో పరిమితి, విద్యార్హత తదితర రిక్రూట్ మెంట్ (BSF recruitment drive) కు సంబంధించిన పూర్తి వివరాలకు బీఎస్ఎఫ్ (BSF) అధికారిక వెబ్ సైట్ rectt.bsf.gov.in. ను సందర్శించండి.

ట్రెండింగ్ వార్తలు

BSF recruitment drive: కావాల్సిన అర్హతలివే..

ఈ రిక్రూట్ మెంట్ (BSF recruitment drive) ద్వారా మొత్తం 1410 కానిస్టేబుల్ (ట్రేడ్స్ మ్యాన్) (Constable (Tradesman)) పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. వాటిలో పురుషుల కోసం 1343 పోస్ట్ లు, మహిళల కోసం 67 పోస్ట్ లను రిజర్వ్ చేశారు. ఈ ఉద్యోగాలకు (BSF recruitment drive) దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం మెట్రిక్యులేషన్ (10వ తరగతి) పాస్ అయి ఉండాలి. వారి వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

BSF recruitment drive: అప్లై చేసుకోవడం ఎలా?

  • బీఎస్ఎఫ్ (BSF) అధికారిక వెబ్ సైట్ rectt.bsf.gov.in. ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీపై కనిపించే Constable Tradesman post లింక్ పై క్లిక్ చేయాలి.
  • కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు తమ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి.
  • ఆ తరువాత ఓపెన్ అయ్యే అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేసి, ఫీజును చెల్లించాలి.
  • అనంతరం సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్ ను విజయవంతంగా సబ్మిట్ చేసిన తరువాత ఆ పేజీని డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • అనంతరం, ఆ అప్లికేషన్ ను భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసి పెట్టుకోవాలి.

Detailed Notification Here

IPL_Entry_Point