BSF Recruitment 2022: బీఎస్ఎఫ్‌లో 1312 పోస్టులు.. పూర్తి వివరాలివే!
BSF Head Constable Recruitment 2022: హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం BSF అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను కొరుతుంది. BSF అధికారిక సైట్ ద్వారా సెప్టెంబర్ 19, 2022లోపు ఈ పోస్లులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు BSF అధికారిక సైట్ rectt.bsf.gov.in ద్వారా ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 19, 2022. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 1312 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాల కోసం దిగువన చూడండి.
ఖాళీ వివరాలు
హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్): 982 పోస్టులు
హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్): 330 పోస్టులు
అర్హత
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి రెండేళ్ల పారిశ్రామిక శిక్షణా సంస్థ (ITI)లో శిక్షణ పొందాలి. రేడియో టెలివిజన్ లేదా ఎలక్ట్రానిక్స్‌లో సర్టిఫికేట్ లేదా, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ చేసి ఉండాలి. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, జనరల్ ఎలక్ట్రానిక్స్ లేదా, డేటా ఎంట్రీ నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన డిగ్రీని కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ నుండి ఆపరేటర్‌గా అనుభం ఉండాలి.
వయో పరిమితి:
సెప్టెంబర్ 19, 2022 నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి
ఇతర వివరాలు
దరఖాస్తులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే ఆమోదించబడతాయి. ఖాళీలు మారవచ్చు. ఆగస్టు 20, 2022 ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే లింక్ యీక్టీవ్ అవుతుంది, మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు BSF అధికారిక సైట్‌ని తనిఖీ చేయవచ్చు.
సంబంధిత కథనం