LIVE UPDATES
Medak Sports Festival : ఈనెల 28న మెదక్ లో జిల్లా స్థాయి క్రీడోత్సవాలు, దరఖాస్తులకు సెప్టెంబర్ 25 లాస్ట్ డేట్
Telangana News Live September 22, 2024: Medak Sports Festival : ఈనెల 28న మెదక్ లో జిల్లా స్థాయి క్రీడోత్సవాలు, దరఖాస్తులకు సెప్టెంబర్ 25 లాస్ట్ డేట్
22 September 2024, 21:33 IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Telangana News Live: Medak Sports Festival : ఈనెల 28న మెదక్ లో జిల్లా స్థాయి క్రీడోత్సవాలు, దరఖాస్తులకు సెప్టెంబర్ 25 లాస్ట్ డేట్
- Medak Sports Festival : మెదక్ జిల్లాలో ఈ నెల 28న జిల్లా స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే ఆసక్తి ఉన్న యువతీయువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. కళాకారులు సెప్టెంబర్ 25వ తేదీ లోపు దరఖాస్తు ఫారంను కలెక్టర్ ఆఫీస్ లోని జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో సమర్పించాలి.
Telangana News Live: Kukatpally Hydra Demolitions : కూకట్ పల్లి నల్లచెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు, కన్నీరు పెట్టిస్తున్న బాధితుల వీడియోలు
- Kukatpally Hydra Demolitions : హైడ్రా కూకట్ పల్లి నల్లచెరువు ఆక్రమణలను ఆదివారం తొలగించింది. అయితే నల్లచెరువు పరిధిలో వాణిజ్య షెడ్లు నిర్మించి క్యాటరింగ్ సర్వీసులు నడుపుకుంటున్నారు కొందరు. వీటిని హైడ్రా కూల్చివేయడంతో... షెడ్లు అద్దెకు తీసుకున్నవారు ఆవేదన చెందారు. తమకు కొంత సమయం ఇవ్వాలని కోరుతున్నారు.
Telangana News Live: Greater Karimnagar : గ్రేటర్ కరీంనగర్ దిశగా అడుగులు, కొత్తపల్లి మున్సిపాలిటీతో సహా ఆరు పంచాయతీల విలీనానికి ప్రతిపాదనలు
- Greater Karimnagar : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ కార్పొరేషన్ గా మారనుంది. కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు మరో ఆరు పంచాయతీలను కార్పొరేషన్ లో విలీనం చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. విలీనానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్ ను ఆదేశించారు.
Telangana News Live: Railway Alert : రైల్వే అలర్ట్.. పది రైళ్ల రద్దు.. 18 రైళ్లకు వరంగల్‌లో స్టాప్ తొలగింపు
- Railway Alert : వివిధ కారణాలతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. 18 రైళ్లకు వరంగల్‌లో స్టాప్ తొలగించింది. రైల్వే ప్రయాణికులు గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించింది. రెండు రైళ్లు రీషెడ్యూల్ చేసి.. నాలుగు రైళ్లు షార్ట్ టెర్మినేషన్ చేశారు రైల్వే అధికారులు.
Telangana News Live: Hydra Demolitions : హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు, 8 ఎకరాల భూమి స్వాధీనం
- Hydra Demolitions : హైదరాబాద్ లోని అమీన్ పూర్, పటేల్ గూడ, కూకట్ పల్లి పరిధిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేసింది. ఈ కూల్చివేతలతో సుమారు 8 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ప్రకటించింది.
Telangana News Live: Telangana Rain Alert : తెలంగాణకు బిగ్ అలర్ట్.. 5 రోజుల పాటు భారీ వర్షాలు..
- Telangana Rain Alert : తెలంగాణలో ఆదివారం రాత్రి నుంచి 5 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Telangana News Live: Hyderabad : రన్నింగ్ బస్సులో మహిళపై లైంగిక దాడి.. 4 రోజుల తర్వాత..
- Hyderabad : యువతులు, మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అలా భయపడుతూనే.. ఊరెళ్దామనుకున్న ఓ మహిళపై లైంగిక దాడి జరిగింది. అది కూడా రన్నింగ్ బస్సులో. ఈనెల 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధిత మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Telangana News Live: Ponuleti vs KTR : పొంగులేటి సవాల్.. స్వీకరించిన కేటీఆర్.. అసలు మ్యాటర్ ఇదే!
- Ponuleti vs KTR : తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ఛాలెంజ్‌ను కేటీఆర్ స్వీకరించారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిద్దామని స్పష్టం చేశారు. తాను చేసిన ఆరోపణలు తప్పు అయితే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు.
Telangana News Live: Siddipet : తల్లి అనుకోని మరో మహిళతో వెళ్లిన బాలుడు.. గంటల వ్యవధిలోనే పట్టుకున్న పోలీసులు
- Siddipet : తల్లితండ్రులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ బాలుడు.. మార్గమధ్యలో వేరొక మహిళను తన తల్లి అనుకోని ఆమెతో దిగిపోయాడు. ఆ బాలుడిని ఆటో డ్రైవర్ సహాయంతో.. పోలీసులు గుర్తించి గంటల వ్యవధిలోనే తల్లితండ్రుల వద్దకు చేర్చారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది.
Telangana News Live: Telangana Tourism : హైదరాబాద్ సిటీని చుట్టేద్దాం..! రూ.380కే టూర్ ప్యాకేజీ - ఈ 9 టూరిస్ట్ స్పాట్స్ చూడొచ్చు!
- Hyderabad City Tour Package : హైదరాబాద్ నగరాన్ని చుట్టేయాలనుకుంటున్నారా..? అయితే ఫేమస్ టూరిస్ట్ ప్లేసులను చూసేందుకు తెలంగాణ టూరిజం అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది. కేవలం రూ. 380కే ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. వన్ డేలోనే పూర్తి అవుతుంది. టూరిజం వెబ్ సైట్లోకి వెళ్లి టికెట్లను బుకించ్ చేసుకోవచ్చు.
Telangana News Live: Hyderabad Musi River : ఆపరేషన్ మూసీ...! రంగంలోకి దిగనున్న హైడ్రా, నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు...?
- మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వాటిని తొలగించేందుకు రంగం సిద్ధమైంది. హైడ్రానే ఈ బాధ్యతలను చూడనుంది. ఇక్కడ ఉంటున్నవారికి పునరావాసం కల్పించే దిశగా కసరత్తు కూడా ప్రారంభమైంది.
Telangana News Live: Hydra Demolition : అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా.. కూకట్‌పల్లి నల్లచెరువు ఏరియాలో భారీగా కూల్చివేతలు
- Hydra Demolition : హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. కూకట్‌పల్లి నల్లచెరువు ప్రాంతంలో భారీగా కూల్చివేతలు ప్రారంభించింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచే కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. భారీగా పోలీసులు మోహరించారు.
Telangana News Live: Karimnagar : కలకలం సృష్టిస్తున్న శిశు మరణాలు.. రెండేళ్లలో 519 మంది మృతి
- Karimnagar : తొలిసారి తల్లి కాబోతున్న మహిళలకు మాతృత్వం ఓ వరం. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం.. ఎదుగుదల గురించే ఆలోచిస్తారు. అయితే.. సరైన వైద్యం లేక నెలలు నిండక ముందే ప్రసవం కావడం, తక్కువ బరువుతో జన్మించడం, జన్యులోపాలు, గుండెలో రంధ్రాలు వంటి కారణాలతో శిశువులు చనిపోతున్నారు. ఇది ఆందోళన కలిగిసస్తోంది.
Telangana News Live: TG Govt AYUSH Jobs : 842 ఉద్యోగాల భర్తీకి ప్రకటన - కేవలం ఇంటర్వూనే, ముఖ్య వివరాలు
- తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 842 యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టులను రిక్రూట్ చేయనుంది. పార్ట్ టైం విధానంలో వీటిని భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది.
Telangana News Live: Telangana Rains : తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు...! ఈ జిల్లాలకు హెచ్చరికలు
- Telangana Rain Updates : బంగాళాఖాతంలో 23వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో తెలంగాణలోని మూడు నాలుగు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. శనివారం రాత్రి హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురిసింది.
Telangana News Live: IGNOU Admissions 2024 : ఇగ్నోలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు - మరోసారి దరఖాస్తుల గడువు పొడిగింపు
- IGNOU Admissions 2024 Updates : ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)లో జూలై సెషన్ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన నేపథ్యంలో అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. అప్లికేషన్లకు సెప్టెంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.