Ponguleti vs KTR : పొంగులేటి సవాల్.. స్వీకరించిన కేటీఆర్.. అసలు మ్యాటర్ ఇదే!-brs working president ktr accepts minister ponguleti srinivas reddy challenge ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ponguleti Vs Ktr : పొంగులేటి సవాల్.. స్వీకరించిన కేటీఆర్.. అసలు మ్యాటర్ ఇదే!

Ponguleti vs KTR : పొంగులేటి సవాల్.. స్వీకరించిన కేటీఆర్.. అసలు మ్యాటర్ ఇదే!

Basani Shiva Kumar HT Telugu
Sep 22, 2024 05:23 PM IST

Ponguleti vs KTR : తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ఛాలెంజ్‌ను కేటీఆర్ స్వీకరించారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిద్దామని స్పష్టం చేశారు. తాను చేసిన ఆరోపణలు తప్పు అయితే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు.

పొంగులేటి సవాల్.. స్వీకరించిన కేటీఆర్
పొంగులేటి సవాల్.. స్వీకరించిన కేటీఆర్

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ఓపెన్ ఛాలెంజ్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు అవాస్తవం అయితే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఈ కామెంట్స్ చేశారు. దీంతో తెలంగాణలో సవాళ్ల రాజకీయం వేరే లెవల్‌కు వెళ్లింది.

'నేను ఆరోపించిన దాంట్లో తప్పు జరగలేదని.. సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. నిన్న ఒక మంత్రి తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని బిల్డప్ ఇచ్చారు. మంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రండి. మీరు, నేను హైకోర్టు సీజే దగ్గరకి పోదాం. వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వయిరీ చేయిద్దాం. సిట్టింగ్ జడ్జి గనుక ఇందులో తప్పులు ఎం జరగలేదు అంటే.. నేను రాజకీయ సన్యాసం చేస్తా. హైకోర్టు సీజే దగ్గరికి రాడానికి మంత్రికి ఇబ్బంది ఉంది అంటే.. డేట్, టైం ఫిక్స్ చేయండి. ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ దగ్గరికి పోదాం. సీవీసీకి ఇద్దాం. ఒకటే చెప్తున్న మంత్రికి, ముఖ్యమంత్రికి.. ఇప్పటికైనా టెండర్లు రద్దు చేయండి' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

'కేటీఆర్‌కు నేను ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా. మేం పిలిచిన టెండర్ల విలువ రూ. 8,888 కోట్లు కాదు. ఒకవేళ రూ. 8,888 కోట్లయితే, నేను రాజీనామా చేస్తా. ఆ టెండర్లు రూ.3516 కోట్లు మాత్రమే అయితే.. నువ్వు రాజీనామా చేస్తావా కేటీఆర్? మీ ఎమ్మెల్యేలంతా కాదు.. మీరు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తారా? శోధ కంపెనీకి చెందిన సుజన్ రెడ్డి.. నాపై పోటీ చేసిన ఉపేందర్ రెడ్డి అల్లుడు. బీఆర్ఎస్ హయాంలో సుజన్ రెడ్డికి పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టులో పనులిచ్చారు. ట్యాక్సులతో కలుపుకుని టెండర్ల విలువ రూ. 8,888 కోట్లున్నా నేను రాజీనామా చేస్తా. లేదంటే.. కేటీఆర్ రాజీనామా చేయాలి' అని మంత్రి పొంగులేటి ఇటీవల వ్యాఖ్యానించారు.

'ట్విట్టర్‌లో షో చేస్తే కాదు కేటీఆర్.. విమర్శ చేయడానికి ముందు కనీస ఆధారాలు చూపండి. నా ఛాలెంజ్‌ను స్వీకరిస్తే ఏ సమయానికి రావాలో వస్తా. మీరు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపండి. మీరు చెప్పింది నిజమైతే కరెక్ట్ ఫార్మాట్‌లో నేను రాజీనామా చేస్తా. మీరు చెప్పింది తప్పయితే.. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేయాలి' అని మంత్రి పొంగులేటి ఛాలెంజ్ చేశారు. దానిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా స్పందించారు.