Nalgonda BRS Office: పార్టీ ఆఫీస్ కూల్చొద్దు, ప్రజావసరాలకు ఉపయోగించుకోండి.. నల్గొండ బీఆర్ఎస్ నేతలు
Nalgonda BRS Office: " కోర్ట్ తీర్పును గౌరవిస్తాం. సుప్రీంకోర్టు లో అప్పీల్ చేస్తాం. అప్పటి వరకు ఆఫీసు కూల్చొద్దు. నల్గొండ లోని ఏ పార్టీ కార్యాలయానికి అనుమతులు లేవని, ప్రజా అవసరాల కోసం బీఆర్ఎస్ ఆఫీసు ను ఉపయోగించాలని నల్గొండ బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
Nalgonda BRS Office: " కోర్ట్ తీర్పును గౌరవిస్తాం. సుప్రీంకోర్టు లో అప్పీల్ చేస్తాం. అప్పటి వరకు బీఆర్‌ఎస్ ఆఫీసు కూల్చొద్దు. నల్గొండ లోని ఏ పార్టీ కార్యాలయానికి అనుమతులు లేవు. ఈ విషయంలో అన్ని పార్టీలు కలిసి రావాలి.. మంత్రి కోమటిరెడ్డి మాటలకు, అధికారులు మోసపోవద్దు. ప్రజా అవసరాల కోసం బీఆర్ఎస్ ఆఫీసు ను ఉపయోగించండి.." అని నల్గొండ బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా నల్గొండ జిల్లా కేంద్రం లో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చాలని 15 రోజుల గడువు ఇస్తూ హై కోర్టు బుధవారం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
మంత్రివర్గ ఆమోదంతోనే..
నిబంధనల మేరకు నాటి మంత్రివర్గ ఆమోదంతో.. ఆగ్రో సంస్థకు చెందిన, ఎకరం భూమిని ప్రభుత్వ నిబంధనల మేరకు డబ్బులు చెల్లించి, తీసుకొని పార్టీ కార్యాలయాన్ని నిర్మించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కార్యాలయంలో గత మూడు సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే జిల్లాకు చెందిన
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..బీఆర్ఎస్ పై కక్షపూని అనేక సమావేశాలలో, పార్టీ కార్యాలయాన్ని కూలగొట్టాలని.. అధికారులను ఆదేశించారన్నదే వీరి అభియోగం. నాటి మున్సిపల్ కమిషనర్ కు నిర్మాణ అనుమతి కోరుతూ దాఖలు చేసినా ఏ పార్టీ కార్యాలయానికి అనుమతులు లేవంటూ తాత్సారం చేశారని గుర్తు చేస్తున్నారు. మున్సిపాలిటీ నుంచి తమకు నోటీసులు ఇచ్చినప్పుడు.. తాము ఫైన్ తో డబ్బులు చెల్లిస్తామని నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరినా .. మంత్రి ఆదేశంతో తిరస్కరించారన్నారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వివరించారు.
గత్యంతరం లేకనే బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించంగా, . కోర్టు తీర్పు బీఆర్ఎస్ కు ప్రతికూలంగా వచ్చింది. ' కోర్టు తీర్పును ఆసరా చేసుకున్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు.. జడ్జిమెంట్ కాపీ రాకముందే.. జెసిబి లు బుల్డోజర్లతో.. కార్యాలయాన్ని కులగొట్టాలని చూస్తున్నారు..' అని జిల్లాపరిషత్ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జడ్జిమెంట్ కాపీ అందిన వెంటనే కోర్టులో అప్పీల్ చేస్తామని, అప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చవద్దని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
ఏ పార్టీ ఆఫీసుకు అనుమతుల్లేవా.?
జిల్లాలో ఏ పార్టీ కార్యాలయానికి అనుమతులు లేవని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అన్ని పార్టీల కార్యాలయాలకు కూడా ఇలాంటి నిబంధనలు వర్తింప చేస్తారా అన్న ప్రశ్నలు కూడా ఆ వర్గాల నుంచి వస్తున్నాయి. దశాబ్దాల కిందటే జిల్లా కేంద్రం లో సీపీఐ, సీపీఎం, టీడీపీ, బీజేపీ లకు విలువైన ప్రాంతాల్లో ఆఫీసులు ఉన్నాయి. కాంగ్రెస్ కార్యాలయం కూడా నిర్మాణంలో ఉంది. బీఆర్ఎస్ ఆఫీసు వ్యవహారం తో ఇపుడు అన్ని ఆఫీసుల విషయం చర్చకు వస్తోంది.
( రిపోర్టింగ్: క్రాంతిపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ ప్రతినిధి )