Ponguleti Son: పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి ఆస్తులు ఎంతో తెలుసా.. షాక్ అవుతారు..
Ponguleti Son: హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షారెడ్డి చోటు దక్కించుకున్నారు. హైదరాబాద్‌లోని అత్యంత సంపన్నుల్లో ఒకరిగా నిలిచారు. ఇటు హైదరాబాద్‌లో బిలియనీర్లు పెరిగినట్టు హురున్ ఇండియా వెల్లడించింది.
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో.. హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. రాష్ట్రాల్లో తెలంగాణ ఐదవ స్థానంలో ఉంది. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు ఉన్న నగరంగా హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. 104 మంది వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు. 386 మంది వ్యక్తులతో ముంబై ముందంజలో ఉంది. 217 మందితో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. ఈసారి బెంగళూరు నగరాన్ని హైదరాబాద్ దాటేసింది.
30 సంవత్సరాల వయస్సులోనే..
హురున్ ఇండియా ప్రకారం.. కేవలం 30 సంవత్సరాల వయస్సులోనే.. కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పొంగులేటి హర్ష రెడ్డి రూ.1,300 కోట్ల సంపదతో.. హైదరాబాద్‌కు చెందిన అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరిగా నిలిచారు. దివీస్ లాబొరేటరీస్ వ్యవస్థాపకులు మురళీ దివి, వారి కుటుంబం రూ.76,100 కోట్ల సంపదతో హైదరాబాద్‌లో నంబర్‌వన్‌గా నిలిచారు.
నిర్మాణ, ఇంజినీరింగ్ రంగంలో..
సి. అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన వెంకటేశ్వర్ రెడ్డి.. 2024లో దేశ వ్యాప్తంగా సంపద వృద్ధి శాతంలో అత్యధికంగా లాభపడిన పది మందిలో ఒకరుగా నిలిచారు. గత ఐదేళ్లలో సంపద వృద్ధి శాతంలో అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన సుబ్రమణ్యం రెడ్డి మొదటి పది మందిలో ఉన్నారు. నిర్మాణ, ఇంజినీరింగ్ రంగంలో.. మేఘా ఇంజనీరింగ్‌కి చెందిన పి. పిచ్చి రెడ్డి రూ. 54800 కోట్లతో అత్యంత సంపన్నుడిగా గుర్తింపు పొందారు.