TG Govt AYUSH Jobs : 842 ఉద్యోగాల భర్తీకి ప్రకటన - కేవలం ఇంటర్వ్యూనే, ముఖ్య వివరాలు-telangana government has released a notification for the recruitment of yoga instructor posts in hospitals ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Govt Ayush Jobs : 842 ఉద్యోగాల భర్తీకి ప్రకటన - కేవలం ఇంటర్వ్యూనే, ముఖ్య వివరాలు

TG Govt AYUSH Jobs : 842 ఉద్యోగాల భర్తీకి ప్రకటన - కేవలం ఇంటర్వ్యూనే, ముఖ్య వివరాలు

తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 842 యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టులను రిక్రూట్ చేయనుంది. పార్ట్ టైం విధానంలో వీటిని భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది.

842 యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఆయూష్ శాఖ నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో 842 యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను పార్ట్ టైం పద్ధతిలో రిక్రూట్ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తం 842 ఉద్యోగాలు ఉండగా… ఇందులో 421 పోస్టులను పురుష అభ్యర్థులతో భర్తీ చేస్తారు. మరో 421 పోస్టులకు ఫీమేల్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సెషన్ల వారీగా విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రతి సెషన్ కూడా గంటసేపు ఉంటుంది. ఒక్కో సెషన్‌కు రూ.250 చొప్పున రెమ్యునరేషన్ చెలిస్తారు. అంటే పురుష యోగా ఇన్‌స్ట్రక్టర్లుకు నెలకు రూ. 8వేల వరకు, ఫీమేల్ యోగా ఇన్‌స్ట్రక్టర్లు నెలకు రూ. 5వేల వరకు పొందవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను https://ayush.telangana.gov.in/ వెబ్ సైట్ లో చూడొచ్చు.

యోగా ఇన్‌స్ట్రక్టర్లు(పురుష) నెలకు కనీసం 32 యోగా సెషన్లకు అటెండ్ కావాల్సి ఉంటంది. ఇక ఫీమేల్ యోగా ఇన్‌స్ట్రక్టర్లు నెలకు కనీసం 20 యోగా సెషన్లకు హాజరుకావాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఈ పోస్టులను కేవలం విద్యా అర్హతలు, ఇంటర్వూ ఆధారంగా భర్తీ చేస్తారు. వరంగల్ జోన్ లోఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో ఇంటర్వూలు ఉంటాయి. ఇక హైదరాబాద్ జోన్ లో చూస్తే హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాల్లో ఇంటర్వూలను నిర్వహిస్తారు. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 తేదీల మధ్య వీటిని చేపడుతారు.