IGNOU Admissions 2024 : ఇగ్నోలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు - మరోసారి దరఖాస్తుల గడువు పొడిగింపు
IGNOU Admissions 2024 Updates : ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)లో జూలై సెషన్ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన నేపథ్యంలో అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. అప్లికేషన్లకు సెప్టెంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జులై 2024 సెషన్ కోసం నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 20వ తేదీతో గడువుగా ముగిసిన నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆన్ లైన్ దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు మాత్రం గడువు పొడిగించలేదు.
అర్హులైన అభ్యర్థులు www.ignou.ac.in, www.ignouadmission వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి. ఏపీ, తెలంగాణలోనూ సంబంధింత ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు వారిని సంప్రదించవచ్చు. లేదా ఆన్‌లైన్‌లోనే నేరుగా చేసుకోవచ్చు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే స్టడీ సెంటర్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG), డిగ్రీ ఆనర్స్, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం మొత్తం 17 రకాల డిగ్రీ ప్రోగ్రామ్స్‌ను ఆఫర్ చేస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ప్రాంతీయ కేంద్ర పరిధిలోనూ ప్రవేశాలు కల్పించనున్నారు. కోర్సుల వివరాలు, ఫీజులు, పరీక్షల విధానం వంటి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి తెలుసుకోవచ్చు.
ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు...
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ ignouadmission.samarth.edu.in ను సందర్శించాలి.
- ‘Click here for new registration’ అనే లింక్‌పై క్లిక్ చెయ్యాలి
- అవసరమైన వివరాలతో ఇగ్నో జూలై రిజిస్ట్రేషన్ ఫామ్‌ను పూర్తి చేసి, సబ్‌మిట్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వస్తుంది.
- వీటితో లాగిన్ అయ్యి, అడ్మిషన్ ఫామ్‌ను పూర్తిచెసి, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
- అడ్మిషన్ ఫామ్‌ను సేవ్ చేసుకుని, డౌన్‌లోడ్ చేసుకోవాలి.
కావాల్సిన పత్రాలు:
- ముందుగా ప్రాథమిక వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- విద్యార్హతకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను స్కాన్ చేయాలి.
- స్కాన్ చేసిన పాస్ పోర్ట్ సైజ్ ఫోటో.
- స్కాన్ చేసిన సంతకం.
- అప్లోడ్ చేయడానికి అభ్యర్థి ఫొటో, సంతకం డాక్యుమెంట్ పరిమాణం 100 కేబీ కంటే ఎక్కువ ఉండకూడదు.
- ఇది కాకుండా పైన పేర్కొన్న ఇతర డాక్యుమెంట్ల పరిమాణం 200 కేబీకి మించకూడదు.
- అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు ఇగ్నో వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారం చూడొచ్చు.
మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. మరోసారి దరఖాస్తుల గడువును పొడిగించారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
అర్హులైన అభ్యర్థులు డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలను పొందవచ్చు. www.braouonline.in లేదా www.braou.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కోర్సుల వివరాలు, ట్యూషన్ ఫీజు వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచారు.
ముఖ్యమైన లింక్స్ ఇవే:
- అధికారిక వెబ్ సైట్ - https://www.braouonline.in/
- పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ లింక్ - https://online.braou.ac.in/PG/PGFirstHome
- డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ లింక్ - https://online.braou.ac.in/UG/UGFirstHome
- డిప్లోమా కోర్సుల్లో చేరేందుకు రిజిస్ట్రేషన్ లింక్ - https://online.braou.ac.in/PG/PGFirstHome