Telangana Rain Alert : తెలంగాణకు బిగ్ అలర్ట్.. 5 రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో ఈదురుగాలులు-heavy rains are likely in telangana for the next 5 days ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Rain Alert : తెలంగాణకు బిగ్ అలర్ట్.. 5 రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో ఈదురుగాలులు

Telangana Rain Alert : తెలంగాణకు బిగ్ అలర్ట్.. 5 రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో ఈదురుగాలులు

Basani Shiva Kumar HT Telugu
Sep 22, 2024 05:44 PM IST

Telangana Rain Alert : తెలంగాణలో ఆదివారం రాత్రి నుంచి 5 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

5 రోజుల పాటు భారీ వర్షాలు
5 రోజుల పాటు భారీ వర్షాలు (HT)

తెలంగాణలోని పలు జిల్లాల్లో 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఐఎండీ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. అటు హైదరాబాద్‌లో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

22వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ్‌పేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వర్షాలు కురిసే సమయంలో.. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.

23వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ్‌పేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ స్పష్టం చేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.

24వ తేదీ.. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ్‌పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

25వ తేదీన.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే సమయంలో.. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.

26వ తేదీన.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.