(1 / 6)
. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ్టి నుంచి తెలంగాణలో మూడు రోజులపాటు భారీ వానలు పడే అవకాశం ఉంది.
(2 / 6)
ఏపీలో ఇవాళ(సెప్టెంబర్ 21) అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
(3 / 6)
సోమ, మంగళవారాల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇక అమరావతి వాతవరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం… ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాాశం ఉందని తెలిపింది.
(4 / 6)
ఇవాళ (సెప్టెంబర్ 21) తెలంగాణలోని ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది
(5 / 6)
సెప్టెంబర్ 22వ తేదీన పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఆ తర్వాత తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
(6 / 6)
హైదరాబాద్ నగరంలో శుక్రవారం భారీ వర్షం కురుసింది. సాయంత్రం తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉప్పల్, రామంతపూర్, హబ్సిగూడ, తార్నాక, నాగోల్, బోడుప్పల్, బాలానగర్, జీడిమెట్ల, నాంపల్లి, హయత్‌నగర్‌తో పాటు పలు శివారు ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. దీంతో చాలా చోట్ల రహదారులన్నీ జలమయమయ్యాయి.
ఇతర గ్యాలరీలు