AP Heavy Rains : అల్పపీడనం ఎఫెక్ట్, రానున్న మూడ్రోజులు ఏపీలో భారీ వర్షాలు
AP Heavy Rains : రేపు పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ఆదివారం సాయంత్రం నుంచి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొంది. రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
AP Heavy Rains : సెప్టెంబరు 23 నాటికి పశ్చిమ రాజస్థాన్, కచ్ లోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి ఇప్పుడు బికనీర్, గుణ, సాగర్, బిలాస్ పూర్, చంద్బాలి ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుందని పేర్కొంది. తూర్పు పశ్చిమ ద్రోణి ఏపీ తీరం నుంచి దక్షిణ కోస్తా మాయన్మార్ వరకు ఎగువ ఉపరితల ఆవర్తనాలు ఒకటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా, మరొకటి దక్షిణ తీరప్రాంత మయన్మార్ పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉపరితల ఆవర్తనము పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో సెప్టెంబర్ 23, 2024 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడిందని పేర్కొంది. థాయ్ లాండ్ కు ఉత్తరం వైపున మరో సర్క్యులేషన్ ఏర్పడిందని....ఈ రెండు సర్క్యులేషన్లు అల్పపీడనానికి దారితీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావతంతో ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, యానాంలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
23వ తేదీ నుంచి వర్షాలు
ఈ నెల 23న ఆంధ్రప్రదేశ్, యానాంలో, 23 నుంచి 25వ తేదీ వరకు తెలంగాణలో, 24, 25 తేదీల్లో రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం మధ్యాహ్నం నుంచి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మారే అవకాశం ఉందని చెప్పింది. సాయంత్రం 5 గంటల తర్వాత రెండు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
దక్షిణ కోస్తా ఆంధ్రలో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. సోమవారం, మంగళవారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. వీటిలో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన గాలివానలు ఉండవచ్చు. రాయలసీమలో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఈదురు గాలులతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, ఈదురు గాలులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో పరిస్థితులు ఇలాగే ఉంటాయని అంచనా. ఈ ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.
సంబంధిత కథనం