AP Rain Alert : రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఏపీకి భారీ వర్ష సూచన
- AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి. శనివారం రాత్రి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుసింది. మరోవైపు రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి. శనివారం రాత్రి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుసింది. మరోవైపు రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 7)
సెప్టెంబర్ 23 నుంచి పశ్చిమ రాజస్థాన్, కచ్ ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని ఐఎండీ పేర్కొంది. సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి బికనీర్, గుణ, మాండ్లా, రాజ్ నంద్ గావ్, గోపాల్పూర్ ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది.
(2 / 7)
ఉపరితల ఆవర్తనం ఉత్తర థాయ్ లాండ్, పరిసర ప్రాంతాలపై ఏర్పడి మధ్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించి ఉంటుంది. ఈ ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఈ రెండు ఉపరితల ఆవర్తనాలు ప్రభావంతో, సెప్టెంబర్ 23 నాటికి వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.
(3 / 7)
ఈ ప్రభావంతో ఏపీలో రేపు(సెప్టెంబర్ 23) మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇవాళ ఉత్తర, దక్షిణ కోస్తాలోని కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్ని చోట్ల బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది.
(4 / 7)
ఇవాళ చూస్తే(సెప్టెంబర్ 22) మన్యం,అల్లూరి,ఏలూరు,ఎన్టీఆర్, పల్నాడు,ప్రకాశం,కర్నూలు,నంద్యాల, అనంతపురం,శ్రీసత్యసాయి, వైయస్ఆర్,అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(5 / 7)
మరోవైపు శ్రీకాకుళం,విజయనగరం,విశాఖ, అనకాపల్లి,కాకినాడ,కోనసీమ, తూగో,పగో,కృష్ణా,గుంటూరు, బాపట్ల,నెల్లూరుజిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అమరావతి
(6 / 7)
ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్ని తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రేపట్నుంచి మరో నాలుగైదు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది.
(7 / 7)
హైదరాబాద్ నగరంలో శనివారం రాత్రి పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది.ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ఐటీ కారిడార్‌తోపాటు సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. గోల్కొండలో అత్యధికంగా 9.1 సెం. మీ వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్ 8.6 సెం. మీ, ఆసిఫ్ నగర్ 8.0 సెం. మీ,నాంపల్లి 6.7 సెం. మీ వర్షపాతం రికార్డైంది.
ఇతర గ్యాలరీలు