Telangana News Live December 3, 2024: Pushpa 2 Release : పుష్ప2 విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, రిలీజ్ నిలివేయాలన్న పిటిషన్ కొట్టివేత
03 December 2024, 22:46 IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Pushpa 2 Release : పుష్ప2 సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పుష్ప 2 విడుదల నిలివేయాలని దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది. కోర్టు సమయం వృథా చేశారని పిటిషన్ కు జరిమానా విధించింది.
CM Revanth Reddy : న్యూయార్క్, టోక్యో వంటి అంతర్జాతీయ నగరాలతో పోటీ పడేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరమే మన ఆదాయం, ఆత్మగౌరవం అన్నారు. నగరంలో రూ.7 వేల కోట్లతో మౌలిక సదుపాయల కల్పనకు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
Jagtial Crime : జగిత్యాల జిల్లా కుమ్మరిపల్లిలో దారుణ హత్య జరిగింది. ఆస్తి వివాదంలో సొంత అన్నను తమ్ముడు దారుణంగా హత్య చేశాడు. ఒంటరిగా ఉన్న అన్న పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు.
Sabarimala Devotees : తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తుంటారు. రైళ్లలో వెళ్లే భక్తులకు రైల్వే శాఖ కీలక సూచనలు చేసింది. రైళ్లలో పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని, కర్ఫూరం వెలిగించవద్దని సూచించింది.
- Warangal : వసతిగృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు.. బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమాన్ని చేపట్టింది. మంగళవారం వరంగల్ జిల్లాలో చేపట్టిన గురుకుల బాట కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు.
- Harish Rao : బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావుపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసుపై ఆయన స్పందించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేక సీఎం రేవంత్ తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటానని హరీష్ రావు స్పష్టం చేశారు.
- Hydra : హైడ్రాకు రేవంత్ సర్కారు సపోర్ట్ పెంచింది. ఇన్నాళ్లు విశేష అధికారాలు ఇచ్చిన ప్రభుత్వం.. తాజాగా భారీగా నిధులు కేటాయించింది. దీనిపై హైడ్రా అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు హైదరాబాద్ నగరంలో హైడ్రా ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. హైడ్రా చీఫ్ రంగనాథ్ చిత్రపటానికి ప్రజలు పాలాభిషేకం చేశారు.
- Mulugu Encounter : ములుగు ఎన్‌కౌంటర్ తెలంగాణలో సంచలనంగా మారింది. ఈ ఇష్యూ హైకోర్టు వరకు వెళ్లింది. తాజాగా.. ములుగు ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. అటు ఈ ఎన్‌కౌంటర్‌పై మాజీమంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
- Telangana Tourism : కిన్నెరసాని.. తెలంగాణలో అద్భుత పర్యాటక కేంద్రం. కిన్నెరసాని ప్రకృతి అందాలను మాటల్లో వర్ణించలేం.. అక్షరాల్లో రాయలేం. ఇక్కడికెళ్లే అహ్లాదం, ఆనందం లభిస్తాయని పర్యాటకులు చెబుతారు. అలాంటి టూరిజం స్పాట్‌పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది.
- Warangal Murder: వరంగల్ నగరంలో దారుణ హత్య జరిగింది. ఓ బ్యాంక్ ఉద్యోగిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హతమార్చారు. కాళ్లు, చేతులను తాళ్లు, ఇనుప గొలుసులతో కట్టేసి ఆయన కారులోనే ఆయనను హత్య చేశారు. అనంతరం కారును వరంగల్ భద్రకాళి గుడి సమీపంలో ఉన్న రంగంపేట ఏరియాలో వదిలిపెట్టి వెళ్లారు.
- TG Phone Tapping Case : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. తాజాగా మాజీమంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదైంది. ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చక్రధర్ గౌడ్ హరీష్ రావుపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
- Rental Cars Fraud: అధిక రాబడి ఆశతో కొత్త కార్లు, ఖరీదైన వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులకు అద్దెకు ఇస్తే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ఈఎంఐలపై వాహనాలను కొనుగోలు చేసి వాటిని రెంటల్ ఏజెన్సీలు, లాంగ్ డ్రైవ్‌లకు అద్దెకు ఇస్తే ఏమి జరుగుతుందో తెలుసుకోండి..
- TG Sadaram Camp : దివ్యాంగులకు పింఛన్ రావాలంటే సదరం సర్టిఫికెట్ తప్పనిసరి. దీంతో ప్రభుత్వం తరుచూ ఈ క్యాంపులు నిర్వహిస్తోంది. అర్హులైన వారికి ధ్రువపత్రాలు జారీ చేస్తోంది. అయితే.. కొందరు దళారులు సదరం సర్టిఫికెట్ల పేరుతో మోసాలు చేస్తున్నారు. వారిని నమ్మొద్దని అధికారులు సూచిస్తున్నారు.
- Hyd Shocking Murder: హైదరాబాద్‌లో దారుణ సంఘటన జరిగింది. పాన్ షాప్ వద్ద గట్టిగా అరవొద్దన్నందుకు ఓ వ్యక్తికి హత్యకు గురయ్యాడు. మద్యం దుకాణం సమీపంలో ఉన్న దుకాణం వద్ద చిన్నపాటి వివాదానికి నిందితుడు పిడిగుద్దులు కురిపించడంతో ప్రాణాలు కోల్పోయాడు.
- Mahabubabad Murder: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెకు ఉరేసి చంపేశాడు. అనంతరం ఆమె సూసైడ్ చేసుకున్నట్టుగా చిత్రీకరించి అక్కడి నుంచి పరారయ్యాడు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకోగా, కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం నిందితుడిని అరెస్టు చేశారు.