Warangal Murder: వరంగల్‌లో కారులో రిటైర్డ్‌ బ్యాంక్ ఉద్యోగి డెడ్‌బాడీ.. కాళ్లు, చేతులు కట్టేసి కిరాతకం-bank employee found dead in car in warangal brutal murder with legs and hands tied ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Murder: వరంగల్‌లో కారులో రిటైర్డ్‌ బ్యాంక్ ఉద్యోగి డెడ్‌బాడీ.. కాళ్లు, చేతులు కట్టేసి కిరాతకం

Warangal Murder: వరంగల్‌లో కారులో రిటైర్డ్‌ బ్యాంక్ ఉద్యోగి డెడ్‌బాడీ.. కాళ్లు, చేతులు కట్టేసి కిరాతకం

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 03, 2024 02:26 PM IST

Warangal Murder: వరంగల్ నగరంలో దారుణ హత్య జరిగింది. ఓ బ్యాంక్ ఉద్యోగిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హతమార్చారు. కాళ్లు, చేతులను తాళ్లు, ఇనుప గొలుసులతో కట్టేసి ఆయన కారులోనే ఆయనను హత్య చేశారు. అనంతరం కారును వరంగల్ భద్రకాళి గుడి సమీపంలో ఉన్న రంగంపేట ఏరియాలో వదిలిపెట్టి వెళ్లారు.

వరంగల్‌లో కారులోనే దారుణ హత్యకు గురైన బ్యాంకు ఉద్యోగి
వరంగల్‌లో కారులోనే దారుణ హత్యకు గురైన బ్యాంకు ఉద్యోగి

Warangal Murder: వరంగల్‌లో కారులో  డెడ్‌బాడీ కాలకలం రేపింది. సోమవారం రాత్రి సొంత కారులోనే బ్యాంకు ఉద్యోగి హత్యకు గురయ్యాడు.  మంగళవారం మధ్యాహ్నం సమయంలో అటుగా వెళ్లిన కొందరు స్థానికులు కారులో డెడ్ బాడీని గుర్తించి మట్వాడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా కారులో డెడ్ బాడీ లభ్యమైన విషయం వరంగల్ నగరంలో కలకలం రేపుతుండగా.. ఆయన కాళ్లు, చేతులు కట్టేసి హతమార్చిన తీరు గగుర్పాటును కలిగిస్తోంది. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా మృతుడు బ్యాంక్ ఉద్యోగి కావడంతో ఎవరైనా సుపారీ ఇచ్చి మర్డర్ చేయించి అంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తెల్లవారుజామునే హత్య..?

రాజామోహన్ ను కాళ్లు, చేతులను కట్టేసి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. తాళ్లు, ఇనుప గొలుసులతో బంధించి మరీ కిరాతకంగా హతమార్చారు. రాజా మోహన్ తలపై మూడు చోట్లా, గొంతు సమీపంలో కూడా కత్తి గాట్లు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా రాజా మోహన్‌ను తన కారులోనే హత్య చేసి, మంగళవారం తెల్లవారుజామున 3.49 గంటల ప్రాంతంలో ఆ కారును రంగంపేటలో పార్క్ చేసి ఓ వ్యక్తి వెళ్లిపోయాడు. 

ఈ దృశ్యాలన్నీ పక్కనే ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డు కాగా.. పోలీసులు ఆ రికార్డును స్వాధీనం చేసుకున్నారు. అందులో ఓ వ్యక్తి బ్లాక్ స్వెట్టర్ ధరించి కారు వద్ద నుంచి వెళ్తున్నట్టు గుర్తించారు. అతడే హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు

కారులో డెడ్ బాడీ ఉన్న విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్, మట్వాడా సీఐ గోపి, ఇతర పోలీస్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికుల ద్వారా వివరాలు సేకరించారు. ఏపీ 36 క్యూ 1546 అనే నెంబర్ గల శాంట్రో కారులో ఉన్న డెడ్ బాడీ ఉన్నట్టు గుర్తించి, మృతుడిని హనుమకొండ శ్రీనగర్ కాలనీకి చెందిన వెలిగేటి రాజా మోహన్ గా నిర్ధారణకు వచ్చారు. 

రాజా మోహన్ బ్యాంక్ ఉద్యోగి పని చేస్తుండగా.. హత్య ఎవరు చేసి ఉంటారనే విషయం దర్యాప్తు జరుపుతున్నారు. తెల్లవారుజామున 3.49 గంటల సమయంలో కారు పార్కింగ్ చేసినట్టుగా గుర్తించిన పోలీసులు ఆ సమయంలో అక్కడ రాకపోకలు సాగించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఆయన హత్య విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారి నుంచి కూడా వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని వరంగల్ పోలీసులు చెబుతున్నారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner