iQOO 13 launch: స్నాప్ డ్రాగన్ 8 ఎలీట్ చిప్ తో బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్మార్ట్ ఫోన్ ‘ఐక్యూ 13’ లాంచ్-iqoo 13 with snapdragon 8 elite chip 6 000mah battery launched in india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iqoo 13 Launch: స్నాప్ డ్రాగన్ 8 ఎలీట్ చిప్ తో బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్మార్ట్ ఫోన్ ‘ఐక్యూ 13’ లాంచ్

iQOO 13 launch: స్నాప్ డ్రాగన్ 8 ఎలీట్ చిప్ తో బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్మార్ట్ ఫోన్ ‘ఐక్యూ 13’ లాంచ్

Sudarshan V HT Telugu
Dec 03, 2024 03:13 PM IST

iQOO 13 launch: స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్, 6.82 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో ఐక్యూ 13 భారత్ లో లాంచ్ అయింది. 120వాట్ ఛార్జర్ ను ఉపయోగించి 30 నిమిషాల్లో ఇందులోని 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని 100% ఛార్జ్ చేయొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.54,999 నుంచి ప్రారంభమౌతోంది.

iQOO 13 comes powered by the Qualcomm 8 Elite processor.
iQOO 13 comes powered by the Qualcomm 8 Elite processor.

iQOO 13 launch: ఐక్యూ తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ఐక్యూ 13 ను మంగళవారం, డిసెంబర్ 3వ తేదీన భారత్ లో లాంచ్ చేసింది. రియల్ మీ జీటీ 7 ప్రో తర్వాత క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ పై పనిచేసే రెండో ఫోన్ ఈ ఐక్యూ 13.

ఐక్యూ 13 ధర

ఐక్యూ 13 12/16 జీబీ LPDDR5X ర్యామ్, 256/512 జీబీ యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. లెజెండ్ (వైట్), నార్డో గ్రే అనే రెండు కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.12 జీబీ/256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.54,999గానూ, 16 జీబీ/512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.59,999గానూ నిర్ణయించారు. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ కార్డులపై రూ.3,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ (discounts) పొందవచ్చు.

ఐక్యూ 13 స్పెసిఫికేషన్లు

8.13 ఎంఎం మందం, 213 గ్రాముల బరువుతో ఐక్యూ 13 (iqoo) స్మార్ట్ ఫోన్ వస్తుంది. కెమెరా ఐలాండ్ అంచుల చుట్టూ ఆర్జిబి హాలో లైట్ ఉంది. దీనిని ఛార్జింగ్, నోటిఫికేషన్లు, కాల్స్, సంగీతం వినడంతో సహా వివిధ సందర్భాలకు పర్సనలైజ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ (smartphones) లో 6.82-అంగుళాల 8 టి ఎల్టిపిఓ 2.0 అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇంతకు ముందు చెప్పినట్లుగా, ఐక్యూ 13 లేటెస్ట్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ఎస్ఓసితో పనిచేస్తుంది. ఇది అడ్రినో 830 జిపియుతో జతచేయబడి ఉంది. 144 ఎఫ్ పీఎస్ గేమ్ ఫ్రేమ్ ఇంటర్ పోలేషన్, 2కే సూపర్ రిజల్యూషన్ కలిగిన ఈ ఫ్లాగ్ షిప్ డివైజ్ ను ఐక్యూ తన సొంత సూపర్ కంప్యూటర్ చిప్ క్యూ2 చిప్ సెట్ తో రూపొందించింది.

50 ఎంపీ ట్రిపుల్ కెమెరా

ఆప్టిక్స్ విషయానికొస్తే, ఐక్యూ 13లో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 921 ప్రైమరీ సెన్సార్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 816 టెలిఫోటో లెన్స్ తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాలింగ్ అవసరాలను తీర్చే 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఐక్యూ 13లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్ తో కేవలం 30 నిమిషాల్లో 1-100 శాతం వరకు వెళ్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత లేటెస్ట్ ఫన్ టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్ లో 4 ఏళ్ల ఓఎస్ అప్ డేట్స్, 5 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్ లను ఐక్యూ అందిస్తోంది.

Whats_app_banner