తెలుగు న్యూస్ / ఫోటో /
Allergy Protection: చలికాలంలో వేధించే అలర్జీల నుంచి రక్షణ పొందడం ఎలా.. శ్వాసకోశ సమస్యల నుంచి బయట పడండి ఇలా
- Allergy Protection: శీతాకాలంలో ప్రధానంగా వేధించే సమస్యలు అలర్జీలు ఒకటి. సాధారణ సమయంలో వేధించే అలర్జీల ప్రభావం శీతాకాలంలో కాస్త ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధానంగా పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.గాలిలో ధూళి కణాలు, శ్వాసకోశ వ్యవస్థకు సరిపడని దుమ్ము,ధూళి, జంతువుల వెంట్రుకలు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
- Allergy Protection: శీతాకాలంలో ప్రధానంగా వేధించే సమస్యలు అలర్జీలు ఒకటి. సాధారణ సమయంలో వేధించే అలర్జీల ప్రభావం శీతాకాలంలో కాస్త ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధానంగా పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.గాలిలో ధూళి కణాలు, శ్వాసకోశ వ్యవస్థకు సరిపడని దుమ్ము,ధూళి, జంతువుల వెంట్రుకలు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
(1 / 11)
ఇళ్లలో తిరిగే ఎలుకల వల్ల కూడా అలర్జీలు తీవ్రం కావొచ్చు. ఎలుకల శరీరంపై ఉండే సన్నటి నూగువంటి వెంట్రుకలు గాల్లో కలిసి శ్వాస సమస్యలకు దారి తీస్తాయి.
(2 / 11)
ప్రతి ఇంట్లో కనిపించే బొద్దింకలు చీకటిపడగానే బయటకు వచ్చేస్తాయి. బొద్దింకల మలం చాలా రకాల అలర్జీలకు కారణం అవుతుంది. ఇంట్లో బొద్దింకల జాడ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
(3 / 11)
పుప్పొడి, చెట్లు, కలుపు, పూల మొక్కలు, పువ్వుల నుంచి వచ్చే పుప్పొడి వల్ల అలర్జీలు వస్తాయి. గాలిలో పుప్పొడి చాలా దూరం ప్రయాణిస్తుంది.
(4 / 11)
గాలిలో పుప్పొడి రేణువులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. గాలి వేగం ఎక్కువగా ఉంటే ఇది అలర్జీలను త్వరగా వ్యాపింప చేస్తుంది.
(5 / 11)
వాతావరణంలో రెండు రకాల దుమ్ము పదార్ధాలు ఉంటాయి. ఇంట్లో దుమ్ము కంటే బయట నుంచి వచ్చే దుమ్ము ధూళి ప్రమాదకరమైనది. బయటి దుమ్ములో రసాయినాలు కూడా ఉండొచ్చు. 70శాతం అస్థమా రోగుల ఇంట్లో దుమ్ము అలర్జీ ఉంటుంది. పాతఇళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఇళ్లలో ఉండే వారికి ఏడాది పొడవున ఎప్పుడైనా శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయి.
(6 / 11)
బయటి వాతావరణంలో ఉండే దుమ్ములో రసాయినాలు, పుప్పొడి కలగలిసి ఉంటాయి. ఇవి శ్వాస వ్యవస్థలోకి ప్రవేశిస్తే తీవ్రమైన అనారోగ్యాలు కలగొచ్చు.
(7 / 11)
ఇంట్లో ఉండే దుమ్ములో ప్రధానంగా కాటన్ ఫైబర్, జంతువుల బొచ్చు, చనిపోయిన కీటకాల భాగాలతో పాటు రకరకాల సూక్ష్మ కణాలు ఉంటాయి.
(8 / 11)
అలర్జీల సమస్యను ఎదుర్కొనే వారు పడక గదుల్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ వినియోగించడం ఉత్తమం. ఏసీలలో ఎయిర్ పిల్టర్లను తరచూ శుభ్రం చేయడం వల్ల డస్ట్ మైట్ సమస్యను అధిగమించవచ్చు.
(9 / 11)
పడక గదిలోనే పిల్లలు 80శాతం సమయం గడుపుతారు. పడక గదిని వీలైనంత సులువుగా శుభ్రం చేసుకునేలా ఉంచుకోవాలి. తివాచీలు, సోఫాలను బెడ్‌రూమ్‌లలో ఉంచకూడదు. వాటి వల్ల అలర్జీలు వ్యాపిస్తాయి.
(10 / 11)
ఇళ్లలో దళసరి వస్త్రాలపై ఉండే డస్ట్‌మైట్స్ అలర్జీలకు కారణం అవుతాయి. తరచుగా ఉతక్కపోతే వీటి వల్ల మంచం మీదకు చేరగానే అలర్జీమొదలవుతుంది. వాక్యూమ్ క్లీనర్‌లతో వీటిని పూర్తిగా తొలగించలేరు. ఉదయం లేవగానే తుమ్ములు, ఆయాసంతో లేవాల్సి వస్తుంది.
ఇతర గ్యాలరీలు