తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Araku Tour Package : అరకును చుట్టేద్దామా..! అతి తక్కువ ధరలోనే 4 రోజుల టూర్ ప్యాకేజీ - ఈ ప్రాంతాలన్నీ చూడొచ్చు

Araku Tour Package : అరకును చుట్టేద్దామా..! అతి తక్కువ ధరలోనే 4 రోజుల టూర్ ప్యాకేజీ - ఈ ప్రాంతాలన్నీ చూడొచ్చు

17 April 2024, 12:56 IST

    • Telangana Tourism Araku Tour : ఈ సమ్మర్ లో అరకు వెళ్లే ప్లాన్ ఉందా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం మంచి ప్యాకేజీని తీసుకొచ్చింది. తక్కువ ధరలోనే 4 రోజుల పాటు అరకు అందాలను వీక్షించేయవచ్చు. ఆ వివరాలను ఇక్కడ చూడండి…..
అరకు టూర్ ప్యాకేజీ
అరకు టూర్ ప్యాకేజీ (photo source from unsplash.com)

అరకు టూర్ ప్యాకేజీ

Telangana Tourism Hyderabad Araku Tour : మండుతున్న ఈ వేసవిలో ప్రకృతి అందాలకు కేరాఫ్ గా ఉండే ప్రాంతాలను చూడాలనుకుంటున్నారా..? అందుకోసం తక్కువ ధరలో ఉండే టూర్ ప్యాకేజీల కోసం చూస్తున్నారా..? అయితే మీలాంటి వారికోసం తెలంగాణ టూరిజం(Telangana Tourism) వేర్వురు రకాల ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో అరకు టూర్(Araku Tour) ప్యాకేజీ కూడా ఉంది. కేవలం 7వేల లోపు టికెట్ ధరతోనే నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాలను చూపించనుంది. ఈ టూర్ ప్యాకేజీని హైదరాబాద్ నగరం నుంచి ఆపరేట్ చేస్తుంది. ఆ వివరాలను ఇక్కడ చూడండి…

ట్రెండింగ్ వార్తలు

Current Bill : షాక్ కొట్టిన కరెంట్ బిల్లు, 14 యూనిట్లకు రూ.60 వేల బిల్లు

TS SET Syllabus 2024 : తెలంగాణ 'సెట్'కు ప్రిపేర్ అవుతున్నారా..? మీ సబ్జెక్ట్ సిలబస్‌ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి

HCU Admissions 2024 : హైదరాబాద్ సెంట్రల్‌ వర్సిటీలో పీజీ ప్రవేశాలు - ముఖ్య తేదీలివే

Medak Deaths: మెదక్ జిల్లాలో నీటి వనరుల్లో మునిగి నలుగురు మృతి.. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా మారని యువత

హైదరాబాద్ - అరకు టూర్ షెడ్యూల్

  • అరకు అందాలను చూసేందుకు తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.
  • Araku Tour - Telangana Tourism పేరుతో ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తుంది.
  • నాలుగు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రతి బుధవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
  • పెద్దలకు రూ. 6,999గా టికెట్ ధర ఉంటే… పిల్లలకు 5.599గా ఉంది.
  • ఈ టూర్ ప్యాకేజీలో అన్నవరం, సింహాచలం, వైజాగ్, ఆర్కే బీచ్, కైలాసగిరి, బొర్రా గుహలు, అనంతగిరి ప్రాంతాలను చూడొచ్చు,
  • Day 1: సాయంత్రం హైదరాబాద్ లోని పర్యాటక భవన్ నుంచి మొదలవుతారు.
  • Day 2: ఉదయం 6 గంటలకు వైజాగ్ చేరుకుంటారు. హోటల్ కి వెళ్లి ఫ్రెషప్ అవుతారు. Kailasagiri, Simhachalam, Rushikondaతో పాటు సబ్ మైరైన్ మ్యూజియంను చూస్తారు. సాయంత్రం వైజాగ్ బీచ్ ను చూస్తారు. రాత్రి వైజాగ్ లోనే బస చేస్తారు.
  • Day 3: ఉదయం 6 గంటలకు అరకు చేరుకుంటారు. ఇక్కడ Tribal Museum, Ananthagiri Coffee plantation, Borracaves, Dhisma Danceను చూస్తారు. రాత్రి అరకులోనే బస చేస్తారు.
  • Day 4: అరకు నుంచి అన్నవరం చేరుకుంటారు. దర్శనం తర్వాత… హైదరాబాద్ బయల్దేరుతారు.
  • Day 5: ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ చేరుకుంటారు.
  • నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది.

అరుణాచలం టూర్ ప్యాకేజీ…

Telangana Tourism Arunachalam Tour: ఇక ఈ సమ్మర్ లో అరుణాచలం వెళ్లాలని అనుకుంటున్నారా..? మీలాంటి వారికోసం తెలంగాణ టూరిజం సరికొత్త టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం తీసుకెళ్తోంది. 4 రోజుల పాటు ఈ పర్యటన సాగుతోంది. ప్రస్తుతం ఏప్రిల్ 21వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.

  • HYDERABAD - ARUNACHALAM - Telangana Tourism టూరిజం పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించారు.
  • హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు.
  • ప్రస్తుతం ఏప్రిల్ 21వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఆ తర్వాత మేలో 20వ తేదీ, జూన్ లో 19వ తేదీన అందుబాటులో ఉంది.
  • పెద్దలకు రూ. 7500, పిల్లలకు రూ. 6వేల టికెట్ ధరగా నిర్ణయించారు.
  • ఫస్డ్ డే సాయంత్రం 6:30 నుంచి బషీర్ బాగ్ నుంచి బయల్దేరుతారు.
  • మరునాడు ఉదయం కాణిపాకం చేరుకుంటారు. 9 గంటల లోపు దర్శనం పూర్తి అవుతుంది. ఆ తర్వాత Thiruvanamalaiకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే ఉంటారు.
  • మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…వేలూరుకు వెళ్తారు. Sripuram Golden Temple Darshan ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ బయల్దేరుతారు.
  • నాలుగో రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేేజీ ముగుస్తుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. info@tstdc.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.