తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Set Syllabus 2024 : తెలంగాణ 'సెట్'కు ప్రిపేర్ అవుతున్నారా..? మీ సబ్జెక్ట్ సిలబస్‌ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి

TS SET Syllabus 2024 : తెలంగాణ 'సెట్'కు ప్రిపేర్ అవుతున్నారా..? మీ సబ్జెక్ట్ సిలబస్‌ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి

08 May 2024, 12:34 IST

    • TS SET 2024 Updates : తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 14వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఈసారి విడుదలైన నోటిఫికేషన్ కు సంబంధించిన సిలబస్ వివరాలను ఇక్కడ చూడండి…
ఏపీ సెట్ నోటిఫికేషన్  -2024
ఏపీ సెట్ నోటిఫికేషన్ -2024

ఏపీ సెట్ నోటిఫికేషన్ -2024

Telangana SET Syllabus 2024 : తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TS SET-2024) నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. త్వరలోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్సిటీ  సెట్‌ పరీక్షను నిర్వహిస్తోంది. 

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

రాష్ట్రంలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్‌ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు  రాష్ట్ర ప్రభుత్వం సెట్‌ నిర్వహిస్తుంది. మే14వ తేదీ నుంచి అప్లికేషన్లు ప్రారంభం కానున్నాయి. ఆన్ లైన్ లోనే దరఖాస్తులను సమర్పించాలి. జూలై 2వ తేదీతో ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఆపరాధ రుసుంతో జూలై 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

How to Download TS SET 2024 Syllabus: సెట్ సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి…

  • తెలంగాణ సెట్ పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సిలబస్ ను అధికారిక వెబ్ సైట్ నుంచి పొందవచ్చు. 
  • అర్హత కలిగిన అభ్యర్థులు మొదటగా http://telanganaset.org/  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో కనిపించే Syllabus అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ PAPER – I(General Paper) అని కనిపిస్తోంది. దాని పక్కనే  Download అని ఉంటుంది.  దానిపై నొక్కితే పేపర్  -1 సిలబస్ ను పొందవచ్చు.
  • ఇక పేపేర్ - 2 రాసే అభ్యర్థులు కూడా ఇదే వెబ్ సైట్ నుంచి పొందవచ్చు. 
  • మొత్తం 29 సబ్జెక్టుల పేర్లు కనిపిస్తాయి. ఇందులో మీరు దేనికైతే అప్లయ్ చేశారో ఆ సబ్జెక్ట్ పక్కన ఉంటే డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కితే…. మీ సిలబస్ కాపీని పొందవచ్చు.
  • డౌన్లోడ్ లేదా  ప్రింట్ కూడా తీసుకోవచ్చు.

How to Apply TS SET 2024 : ఇలా దరఖాస్తు చేసుకోండి….

  • అభ్యర్థులు ముందుగా http://telanganaset.org/index.htm  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • TS SET Apply Online అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • ఇక్కడ మీకు దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది.
  • మీ వివరాలతో పాటు విద్యార్హతలను ఎంటర్ చేయాలి. ఇందులోనే మీరు ఎగ్జామ్ సెంటర్ ను కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • నిర్ణయించిన అప్లికేషన్ రుసుం చెల్లించాలి. ఆన్ లైన్ పేమెంట్ అందుబాటులో ఉంటుంది.
  • ఫైనల్ గా సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.
  • ప్రింట్ ఆప్షన్ పై నొక్కి రిజిస్ట్రేషన్ కాపీని పొందవచ్చు.

ముఖ్య వివరాలు:

  • జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ -పేపర్ 1 గా ఉంటుంది.
  • పేపర్ - 2 అనేది అభ్యర్థి పీజీ పూర్తి చేసిన సబ్జెక్టుపై రాసుకోవాల్సి ఉంటుంది. ఇందులో జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా , మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్ సబ్జెక్టులు ఉంటాయి.
  • వయోపరిమితి: గరిష్ఠ వయోపరిమితి లేదు.
  • కంప్యూటర్‌ ఆధారిత టెస్టు (సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి.
  • పేపర్‌-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు.
  • పరీక్ష వ్యవధి మూడు గంటలు.
  • ఆబ్జెక్టివ్‌ తరహాలో 50 ప్రశ్నలకు పేపర్‌–1 ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు కేటాయిస్తారు. ఇందులో అభ్యర్థుల బోధన/పరిశోధన ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. అలాగే తార్కిక సామర్థ్యం, గ్రహణశక్తి, భిన్నమైన ఆలోచనల దృక్పథాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.
  • ఈ పేపర్‌ 2 లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్‌ తరహాలో ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలను అడుగుతారు.
  • ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం, తిరుపతి, మహబూబ్ నగర్, మెదక్, వైజాగ్, నల్గొండ, రంగారెడ్డి కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
  • తెలంగాణ సెట్ అధికారిక వెబ్‌సైట్‌ : http://www.telanganaset.org/ 

 

 

తదుపరి వ్యాసం