OU Phd : ఉస్మానియా యూనివర్శిటీలో పిహెచ్‌డి అడ్మిషన్లకు నోటిఫికేషన్-osmania university phd entrance test notification released ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Osmania University Phd Entrance Test Notification Released

OU Phd : ఉస్మానియా యూనివర్శిటీలో పిహెచ్‌డి అడ్మిషన్లకు నోటిఫికేషన్

HT Telugu Desk HT Telugu
Aug 02, 2022 07:07 AM IST

ఉస్మానియా యూనివర్శిటీలో పిహెచ్‌డి ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రవేశపరీక్ష ద్వారా అర్హులకు సంబంధిత కోర్సుల్లో పిహెచ్‌డి అడ్మిషన్లను కల్పిస్తారు.

ఉస్మానియాలో పిహెచ్‌డి ప్రవేశాలకు ఎంట్రన్స్‌
ఉస్మానియాలో పిహెచ్‌డి ప్రవేశాలకు ఎంట్రన్స్‌

OU Phd Entrance : ఉస్మానియా యూనివర్శిటీలో పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. పిహెచ్‌ ఎంట్రన్స్‌ టెస్‌ 2022 ద్వారా ప్రవేశాలను కల్పిస్తారు. ఆర్ట్స్‌, కామర్స్‌, ఎడ్యుకేషన్‌, ఇంజనీరింగ్‌, ఇన్ఫర్మాటిక్స్‌, లా, ఒరియంటల్ లాంగ్వేజెస్‌, సోషల్ సైన్సెస్‌, టెక్నాలజీ విభాగాల్లోని పలు కోర్సుల్లో పిహెచ్‌డి కోర్సులకు ప్రవేశపరీక్ష ద్వారా అడ్మిషన్లను కల్పిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తి చేసి ఉండాలని, ఎస్సీ,ఎస్టీ, బీసీ, వికలాంగులకు 50శాతం, మిగిలిన వారికి కనీసం 55శాతం మార్కులు వచ్చి ఉండాలని సూచించారు.

జాతీయ స్థాయిలో జూనియర్‌ రిసెర్చ్ ఫెలోషిప్‌కు అర్హత సాధించిన వారు, యూజీసీ, సిఎస్‌ఐఆర్‌, ఐసిఎంఆర్‌, డిబిటి, ఇన్స్పైర్‌ ఫెలోషిప్‌ల ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తీర్ణులైన వారికి ఎంట్రన్స్‌ నుంచి మినహాయింపు లభిస్తుంది. పిహెచ్‌డి అడ్మిషన్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్‌ పరీక్ష ద్వారా జరుపుతారు. ఎంట్రన్స్‌ పరీక్ష ఇంగ్లీష్‌ భాషలోనే నిర్వహిస్తారు.

రిజిస్ట్రేషన్‌ ఫీజుగా రూ.1500చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ,బీసీ, వికలాంగులకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎంట్రన్స్‌ పరీక్షకు సంబంధించిన చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లో యూనివర్శిటీ వెబ్‌సైట్‌ www.ouadmissions.com ద్వారా చేయాల్సి ఉంటుంది. సబ్జెక్టుల వారీగా సిలబస్‌ను యూనివర్శిటీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అర్హత పరీక్షలో కనీసం 50శాతం మార్కులు సాధించిన వారిని క్వాలిఫైడ్‌గా గుర్తిస్తారు. ఓసీ అభ్యర్ధులకు కనీసం 35మార్కులు రావాల్సి ఉంటుంది. రిజర్వేషన్‌ క్యాటగిరీలలో 32 మార్కులు రావాల్సి ఉంటుంది. ఇంకా డిగ్రీ ఫలితాలు వెలువడని వారు, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు పిహెచ్‌డి ప్రవేశాలకు అనర్హులుగా ప్రకటించారు.

ఆర్ట్స్‌ విభాగంలో హిస్టరీ-ఆర్కియాలజీ, ఇంగ్లీష్, లింగ్విస్టిక్స్‌, పర్సి‍యన్, ఫిలాసఫీ, సంస్కృతం, ఒరియంటల్ లాంగ్వేజెస్‌లో అరబిక్, తెలుగు, సోషల్‌ సైన్సెస్‌లో ఎకనామిక్స్‌, పొలిటికల్ సైన్సెస్‌, సోషల్ వర్క్‌, సోషియాలజీ, కామర్స్, ఎడ్యుకేషన్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్‌, ఎడ్యుకేషన్‌, లా, సైన్స్‌లో అప్లైడ్‌ జియో కెమిస్ట్రీ, అస్ట్రానమీ, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్‌, జెనిటిక్స్‌, జియాలజీ జియో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, మైక్రో బయాలజీ, ఫిజిక్స్‌, స్టాటస్టిక్స్‌, జువాలజీ, కంప్యూటర్ సైన్స్‌ కోర్సులున్నాయి. ఇంజినీరింగ్‌లో బయో మెడికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్‌ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఈసీఈ, మెకానికల్ విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. టెక్నాలజీ విభాగంలో కెమికల్ టెక్నాలజీ-కెమికల్ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో పిహెచ్‌డి కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తారు.

WhatsApp channel

టాపిక్