Arunachalam Tour : 'అరుణాచలం' వెళ్లొద్దామా..! తక్కువ ధరలోనే 4 రోజుల టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు
Telangana Tourism Arunachalam Tour : అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లాలనుకునేవారి కోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. 4 రోజుల పాటు ఈ టూర్ సాగుతుంది. రోడ్డు మార్గం ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ముఖ్య వివరాలను ఇక్కడ చూడండి….
Telangana Tourism Hyderabad Arunachalam Tour: ప్రతీ నెల పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ కోసం చాలా మంది భక్తులు అరుణాచలం(Arunachalam Tour) వెళ్తుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే మీరు కూడా ఈ సమ్మర్ లో అరుణాచలం వెళ్లాలని అనుకుంటున్నారా..? మీలాంటి వారికోసం తెలంగాణ టూరిజం సరికొత్త టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం తీసుకెళ్తోంది. 4 రోజుల పాటు ఈ పర్యటన సాగుతోంది. ప్రస్తుతం ఏప్రిల్ 21వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
హైదరాబాద్ - అరుణాచలం టూర్ ప్యాకేజీ వివరాలు
- HYDERABAD - ARUNACHALAM - Telangana Tourism టూరిజం పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించారు.
- హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు.
- ప్రస్తుతం ఏప్రిల్ 21వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఆ తర్వాత మేలో 20వ తేదీ, జూన్ లో 19వ తేదీన అందుబాటులో ఉంది.
- పెద్దలకు రూ. 7500, పిల్లలకు రూ. 6వేల టికెట్ ధరగా నిర్ణయించారు.
- ఫస్డ్ డే సాయంత్రం 6:30 నుంచి బషీర్ బాగ్ నుంచి బయల్దేరుతారు.
- మరునాడు ఉదయం కాణిపాకం చేరుకుంటారు. 9 గంటల లోపు దర్శనం పూర్తి అవుతుంది. ఆ తర్వాత Thiruvanamalaiకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే ఉంటారు.
- మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…వేలూరుకు వెళ్తారు. Sripuram Golden Temple Darshan ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ బయల్దేరుతారు.
- నాలుగో రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేేజీ ముగుస్తుంది.
- ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. info@tstdc.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
టెంపుల్ టూర్ ప్యాకేజీ
Telangana Tourism Temple Tour Package 2024: మరోవైపు ప్రముఖ అధ్యాత్మిక ప్రాంతాలను చూడాలనుకుంటున్నారా..? బడ్జెట్ ధరలోనే వెళ్లాలని అనుకునే వారికోసం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది తెలంగాణ టూరిజం(Telangana Tourism). Temple Tour (Kakatiya Region) పేరుతో హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తోంది. బస్సులో రోడ్డు మార్గాన ఈ ట్రిప్ సాగుతుంది. ప్రతి శనివారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఇందుకు సంంబధించి వివరాలను ఇక్కడ చూడండి…
- టెంపుల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం. Temple Tour (Kakatiya Region) - Telangana Tourism పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
- హైదరాబాద్ నుంచి ప్రతి శనివారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
- ఇందులో భాగంగా కాళేశ్వరం, రామప్ప, వేయ్యి స్తంభాల ఆలయం, యాదాద్రి, కీసరగుట్టను సందర్శిస్తారు.
- DAY-1 - 9:30 PM గంటలకు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి బయల్దేరుతారు.
- -రాత్రి 10 గంటలకు యాత్రినివాస్ కు చేరుకుంటారు.
- -05.00 AM - కాళేశ్వరం బయల్దేరుతారు.
- DAY-2
- -ఉదయం 7 గంటలలోపు కాళేశ్వరం దర్శనం చేసుకుంటారు.
- -ఉదయం 7 తర్వాత…. రామప్పకు బయల్దేరుతారు.
- -11 గంటల వరకు రామప్పుకు చేరుకుంటారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత దర్శనం ఉంటుంది.
- -11 గంటల తర్వాత….. రామప్ప నుంచి వరంగల్ కు బయల్దేరుతారు.
- -02.30 గంటలకు వరంగల్ చేరుకుంటారు. హారిత హోటల్ లో భోజనం ఉంటుంది.
- -02.30 PM - హన్మకొండ నుంచి యాదాద్రికి చేరుకుంటారు.
- -04.30 PM to 06.00 PM - యాదాద్రి దర్శనం పూర్తి అవుతుంది.
- -06.00 PM - యాదాద్రి నుంచి కీసరకు బయల్దేరుతారు.
- -07.15 PM to 08.00 PM - కీసరగుట్టకు చేరుకుంటారు.
- -08.00 PM - హైదరాబాద్ కు బయల్దేరుతారు.
- -09.00 PM - హైదరాబాద్ కు చేరుకుంటారు.
తెలంగాణ టూరిజం ప్రకటించిన ఈ టెంపుల్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…. పెద్దలకు 2999గా నిర్ణయించారు. పిల్లలకు రూ. 2399గా ఉంది. నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది. https://tourism.telangana.gov.in/p వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.