తెలుగు న్యూస్ / ఫోటో /
Hyderabad To Kerala : ఈ వేసవిలో కేరళ చూసొద్దామా? హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే!
- Hyderabad To Kerala IRCTC Package : హైదరాబాద్ నుంచి ఏడు రోజుల కల్చరల్ కేరళ ఎయిర్ ట్రిప్ ను అందిస్తోంది ఐఆర్సీటీసీ. ఈ టూర్ లో కొచ్చి, మున్నార్, అలెప్పీ, త్రివేండ్రం చూడవచ్చు.
- Hyderabad To Kerala IRCTC Package : హైదరాబాద్ నుంచి ఏడు రోజుల కల్చరల్ కేరళ ఎయిర్ ట్రిప్ ను అందిస్తోంది ఐఆర్సీటీసీ. ఈ టూర్ లో కొచ్చి, మున్నార్, అలెప్పీ, త్రివేండ్రం చూడవచ్చు.
(1 / 10)
సమ్మర్ హాలీ డేస్ కేరళలో(Kerala) ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే కల్చరల్ కేరళ పేరుతో ఐఆర్సీటీసీ(IRCTC) హైదరాబాద్ నుంచి 6 రాత్రులు/7 రోజుల ఫ్లైట్ టూర్ ప్యాకేజీ అందుబాటులో తెచ్చింది. ఈ టూర్ లో కొచ్చి, మున్నార్, అలెప్పీ, త్రివేండ్రం చూడవచ్చు. (pexels)
(2 / 10)
హైదరాబాద్(Hyderabad) శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఏప్రిల్ 24వ తేదీన 6E 6707 ఫ్లైట్ లో ఉదయం 09:55 గంటలకు బయలుదేరి 11:35 గంటలకు కొచ్చి చేరతారు. మళ్లీ తిరిగి మే 4వ తేదీన ఫ్లైట్ నెం. 6E 335 లో త్రివేండ్రం నుంచి రాత్రి 10.10 గంటలకు బయలుదేరి రాత్రి 11.50కి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ ఫ్లైట్ లో మొత్తం 29 సీట్లు అందుబాటులో ఉంటాయి. (pexels)
(3 / 10)
ఒక్కో వ్యక్తికి ఖర్చు- కంఫర్ట్ -రూ 53100(సింగిల్ ఆక్యుపెన్సీ), రూ 35700(డబుల్ ఆక్యుపెన్సీ), రూ. 33750(ట్రిపుల్ ఆక్యుపెన్సీ), రూ 29900(చైల్డ్ విత్ బెడ్ 5-11 ఏళ్లు), రూ 23300(చైల్డ్ విత్ అవుట్ బెడ్ 5-11 ఇయర్స్), రూ 15400(చైల్డ్ విత్ అవుట్ బెట్,2-4 ఏళ్లు)(pexels)
(4 / 10)
డే 1- ఉదయం హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఫ్లైట్ లో బయలుదేరుతారు. కొచ్చి చేరుకుంటారు. ఎయిర్ పోర్టు నుంచి పికప్ చేసుకుని హోటల్‌కు తీసుకెళ్తారు. భోజనం చేసి, యూదుల ప్రార్థనా మందిరం, డచ్ ప్యాలెస్, చైనీస్ ఫిషింగ్ నెట్‌లను కవర్ చేసే కొచ్చి ఫోర్టును సందర్శించవచ్చు. హోటల్‌లో చెక్ ఇన్ చేయాలి. సాయంత్రం మెరైన్ డ్రైవ్ ఉంటుంది. డిన్నర్, రాత్రిపూట బస కొచ్చిలో చేస్తారు. (pexels)
(5 / 10)
డే 2: ఉదయం హోటల్‌లో అల్పాహారం చేశాక, హోటల్ చెక్ అవుట్ చేయాలి. అక్కడి నుంచి 130 కి.మీ దూరంలో ఉన్న మున్నార్ కు బయలుదేరాలి. మార్గమధ్యలో చీయపారా జలపాతాన్ని చూడవచ్చు. హోటల్‌లో చెక్ ఇన్, ఆ తర్వాత టీ మ్యూజియం సందర్శించవచ్చు. రాత్రి భోజనం, బస మున్నార్‌లో ఉంటుంది. (pexels)
(6 / 10)
డే 3 : హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత మెట్టుపెట్టి డ్యామ్, ఎకో పాయింట్, కుండ్లా డ్యామ్ సరస్సు కవర్ చేసేలా మున్నార్‌లో టూర్ ఉంటుంది. రాత్రి డిన్నర్, బస మున్నార్‌లోనే ఉంటుంది. (pexels)
(7 / 10)
డే 4 : హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ అయ్యాక...90 కి.మీ దూరంలో ఉన్న తేక్కడికి బయలుదేరతారు. అక్కడ స్పైస్ ప్లాంటేషన్లను సందర్శించవచ్చు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. రాత్రి డిన్నర్, బస తేక్కడిలో ఉంటుంది. (pexels)
(8 / 10)
డే 5 : బ్రేక్ ఫాస్ట్ తర్వాత... 130 కి.మీ దూరంలోని అలెప్పి/కుమారకోమ్ కు బయలుదేరి వెళ్లాలి. హోటల్‌లో చెక్ ఇన్ చేశాక...సొంత ఖర్చుతో బ్యాక్ వాటర్స్ రైడ్ కు వెళ్లవచ్చు. అలెప్పి/కుమారకోమ్‌లో రాత్రి డిన్నర్, బస ఉంటుంది. (pexels)
(9 / 10)
డే 6 : హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ అయ్యాక, 115 కి.మీ దూరంలోని చడియమంగళం బయలుదేరతారు. అక్కడ జటాయు ఎర్త్ సెంటర్‌ని సందర్శించవచ్చు. అక్కడి నుంచి త్రివేండ్రం చేరుకుంటారు. హోటల్‌లో చెక్ అయ్యాక డిన్నర్, రాత్రిపూట త్రివేండ్రంలో బస చేస్తారు.(Pexels)
(10 / 10)
డే 7 : ఉదయాన్నే పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు. మధ్యాహ్నానికి హోటల్ లో చెక్ అవుట్ చేయాలి. నేపియర్ మ్యూజియం, అజిమల శివుని విగ్రహాన్ని సందర్శించవచ్చు. సాయంత్రం హైదరాబాద్‌కు ఫ్లైట్ ఎక్కేందుకు త్రివేండ్రం ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తారు. మరిన్ని వివరాలకు https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHA35 ను సందర్శించండి.(pexels)
ఇతర గ్యాలరీలు