Nandi Junction Pics : సరికొత్త అధ్యాత్మిక శోభ.. ప్రత్యేక ఆకర్షణగా వేములాడ 'నంది జంక్షన్'-new look nandi junction at rajarajeshwara swamy temple in vemulawada ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Nandi Junction Pics : సరికొత్త అధ్యాత్మిక శోభ.. ప్రత్యేక ఆకర్షణగా వేములాడ 'నంది జంక్షన్'

Nandi Junction Pics : సరికొత్త అధ్యాత్మిక శోభ.. ప్రత్యేక ఆకర్షణగా వేములాడ 'నంది జంక్షన్'

Jun 04, 2023, 02:33 PM IST Maheshwaram Mahendra Chary
Jun 04, 2023, 02:33 PM , IST

  • Vemulawada Latest News: దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులు సాక్షాత్తు నందీశ్వరుడే స్వాగతం పలుకుతున్న విధంగా ప్రత్యేక ఆకర్షణగా నంది జంక్షన్ ను అభివృద్ధి చేశారు. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

 వేములవాడ కు సరికొత్త అధ్యాత్మిక శోభ చేకూరింది. నంది కమాన్ కూడళి, కొండగట్టు జంక్షన్ ను అధికారులు సుందరంగా ముస్తాబు చేశారు.

(1 / 5)

 వేములవాడ కు సరికొత్త అధ్యాత్మిక శోభ చేకూరింది. నంది కమాన్ కూడళి, కొండగట్టు జంక్షన్ ను అధికారులు సుందరంగా ముస్తాబు చేశారు.(twitter)

ఈ నంది కమాన్ కూడలి ఫోటోలను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సరికొత్త అధ్యాత్మిక శోభ నంది జంక్షన్ మీకు స్వాగతం పలుకుతోంది అంటూ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ను అభినందించారు.

(2 / 5)

ఈ నంది కమాన్ కూడలి ఫోటోలను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సరికొత్త అధ్యాత్మిక శోభ నంది జంక్షన్ మీకు స్వాగతం పలుకుతోంది అంటూ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ను అభినందించారు.(twitter)

వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, మంత్రి కేటీఆర్ విధులు కేటాయించడం ద్వారా పట్టణంలోని ప్రధాన కూడళ్ళతో పాటు పట్టణ శివారులోని నంది జంక్షన్ అభివృద్ధి పనులు దాదాపు పూర్తయ్యాయి.

(3 / 5)

వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, మంత్రి కేటీఆర్ విధులు కేటాయించడం ద్వారా పట్టణంలోని ప్రధాన కూడళ్ళతో పాటు పట్టణ శివారులోని నంది జంక్షన్ అభివృద్ధి పనులు దాదాపు పూర్తయ్యాయి.

నంది జంక్షన్ ప్రాంతం రాత్రి సమయంలో రంగురంగుల విద్యుత్ దీపాలు దానికి తోడు వాటర్ ఫౌంటెన్ తో ప్రత్యేక ఆకర్షణగా ఉంది.

(4 / 5)

నంది జంక్షన్ ప్రాంతం రాత్రి సమయంలో రంగురంగుల విద్యుత్ దీపాలు దానికి తోడు వాటర్ ఫౌంటెన్ తో ప్రత్యేక ఆకర్షణగా ఉంది.

వేములవాడకు వచ్చే భక్తులతో పాటు స్థానికులు… ఇక్కడ ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. అధిక సంఖ్యలో రావడంతో ఈ ప్రాంతమంతా సందడిగా మారిపోయింది. నందికి చుట్టుపక్కల నాట్య భంగిమలో ప్రతిమలు, ముందు రెండు నెమలి విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి.

(5 / 5)

వేములవాడకు వచ్చే భక్తులతో పాటు స్థానికులు… ఇక్కడ ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. అధిక సంఖ్యలో రావడంతో ఈ ప్రాంతమంతా సందడిగా మారిపోయింది. నందికి చుట్టుపక్కల నాట్య భంగిమలో ప్రతిమలు, ముందు రెండు నెమలి విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి.(twitter)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు