IRCTC Shirdi Tour : 4 రోజుల 'షిర్డీ' ట్రిప్ - తక్కువ ధరలోనే విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ, శనిశిగ్నాపూర్ కూడా చూడొచ్చు-irctc tourism 4 days shirdi tour and shani shingnapur package from vijayawada city 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Shirdi Tour : 4 రోజుల 'షిర్డీ' ట్రిప్ - తక్కువ ధరలోనే విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ, శనిశిగ్నాపూర్ కూడా చూడొచ్చు

IRCTC Shirdi Tour : 4 రోజుల 'షిర్డీ' ట్రిప్ - తక్కువ ధరలోనే విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ, శనిశిగ్నాపూర్ కూడా చూడొచ్చు

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 10, 2024 01:35 PM IST

IRCTC Vijayawada Shirdi Tour 2024: విజయవాడ నుంచి షిర్డీకి కొత్త టూర్ ప్యాకేజీ ప్రకటించింది IRCTC టూరిజం. 4 రోజుల ఈ టూర్ ప్యాకేజీలో షిర్డీతో(Shirdi Tour) పాటు శనిశిగ్నాపూర్ కు కూడా వెళ్లి రావొచ్చు. టూర్ షెడ్యూల్ తో పాటు బుకింగ్ వివరాలను ఇక్కడ చూడండి……

విజయవాడ - షిర్డీ టూర్ ప్యాకేజీ
విజయవాడ - షిర్డీ టూర్ ప్యాకేజీ (Photo Source From https://unsplash.com/)

IRCTC Shirdi  Vijayawada 2024 Tour : ఈ హాట్ సమ్మర్ లో అధ్యాత్మిక ప్రాంతాలను దర్శించుకోవాలని అనుకుంటున్నారా….? తక్కువ ధరలోనే మీ సొంత ప్రాంతాల నుంచి వెళ్లి… కొత్త ప్రదేశాలను చూసి రావొచ్చు. ఇందులో బ్రేక్ ఫాస్ట్ తో పాటు భోజన సౌకర్యం కల్పిస్తారు. అయితే ఈ తరహా ప్యాకేజీలను ఐఆర్‌సీటీసీ టూరిజం(IRCTC Tourism) ప్రకటిస్తోంది. తక్కువ ధరలోనే ఈ ప్యాకేజీలు ఉంటున్నాయి. తాజాగా విజయవాడ నుంచి షిర్డీ(Shirdi Tour) వెళ్లేందుకు టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఆ వివరాలను ఇక్కడ చూడండి….

షిర్డీ టూర్ ప్యాకేజీ వివరాలు:

  • “SAI SANNIDHI EX VIJAYAWADA” పేరుతో విజయవాడ నుంచి షిర్డీ టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం.
  • ఇది నాలుగు రోజుల టూర్ ప్యాకేజీ.
  • ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 16వ తేదీన అందుబాటులో ఉంది. 
  • రైల్వే మార్గం ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
  • విజయవాడలోనే కాకుండా.. ఖమ్మం, సికింద్రాబాద్, విజయవాడ, వరంగల్ రైల్వే స్టేషన్లల్లో కూడా ట్రైన్ ఎక్కొచ్చు.
  • ఫస్ట్ డే  విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రి 10.15 గంటలకు షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలు(17208- Sainagar Shirdi Express) ఎక్కాలి. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
  • సెకండ్ డే మార్నింగ్ 06.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. ఆ తర్వాత షిర్డీకి వెళ్తారు.  ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం షాపింగ్ కోసం ఫ్రీ టైమ్ ఉంటుంది. రాత్రి షిర్డీలోనే బస చేస్తారు.
  • థర్డ్ డే మార్నింగ్ శనిశిగ్నాపూర్ కు వెళ్తారు.  అక్కడ్నుంచి మళ్లీ షిర్టీ చేరుకుంటారు.  రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో తిరుగు ప్రయాణం మొదలవుతుంది. తెల్లవారుజామున మూడు గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్  చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

విజయవాడ - షిర్డీ టికెట్ ధరల వివరాలు

IRCTC Shirdi Vijayawada Tour Prices 2024: ప్యాకేజీ ధరలు చూస్తే…. కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 16165ధర ఉండగా... డబుల్ ఆక్యుపెన్సీకి రూ.10045, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 8440 చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు 5985గా ధర ఉంది. సింగిల్ షేరింగ్ కు రూ. 13705గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 7590గా ఉంది. విజయవాడ - షిర్డీ టూర్ ప్యాకేజీని https://www.irctctourism.com వెబ్ సైట్ లో కి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు. 040-27702407, 9701360701 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

అధ్యాత్మిక ప్రాంతాలతో పాటు మంచి సేద తీరే ప్రాంతాలకు కూడా ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది IRCTC టూరిజం. ఇందులో భాగంగా…. హైదరాబాద్ నుంచి థాయ్ లాండ్ కు సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇక్కడ చూడండి….

  • హైదరాబాద్ నుంచి థాయ్ లాండ్ కు టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది ఐఆర్‌సీటీసీ టూరిజం.
  • ‘TREASURES OF THAILAND EX HYDERABAD’ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
  • ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకుంటే 4 రోజుల పాటు థాయ్ లాండ్ లో పర్యటిస్తారు.
  • ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం మే 09, 2024 తేదీన అందుబాటులో ఉంది.

 

Whats_app_banner