Secunderabad Loksabha: సికింద్రాబాద్‌ లోక్‌సభపై కాంగ్రెస్‌ పార్టీ గురి… రంగంలోకి దిగిన కోమటిరెడ్డి-congresss efforts are aimed at securing secunderabad lok sabha seat ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Secunderabad Loksabha: సికింద్రాబాద్‌ లోక్‌సభపై కాంగ్రెస్‌ పార్టీ గురి… రంగంలోకి దిగిన కోమటిరెడ్డి

Secunderabad Loksabha: సికింద్రాబాద్‌ లోక్‌సభపై కాంగ్రెస్‌ పార్టీ గురి… రంగంలోకి దిగిన కోమటిరెడ్డి

HT Telugu Desk HT Telugu
Apr 08, 2024 07:40 AM IST

Secunderabad Loksabha: సికింద్రాబాద్ లోక్ సభ స్థానంపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. సికింద్రాబాద్‌ ఇంచార్జిగా మంత్రి కోమటిరెడ్డి రంగంలోకి దిగారు.

సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానంపైనే కాంగ్రెస్ నేతల గురి...
సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానంపైనే కాంగ్రెస్ నేతల గురి...

Secunderabad Loksabha: సికింద్రాబాద్ లోక్ సభ Loksabha స్థానంపై అధికార కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. గతంలో చేజార్చుకున్న ఈ స్థానాన్ని ఈసారి ఎలాగైనా దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ Danam Nagenderను పార్టీలో చేర్చుకుని, సికింద్రాబాద్ Secunderabad MP ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

మరోవైపు లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జి లతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు.

Elections లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కాంగ్రెస్‌ నేతలకు రేవంత్‌ సూచించారు. ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి  Komatireddy Venkatreddyవెంకటరెడ్డి కూడా తన నివాసంలో అసెంబ్లీ ఇన్చార్జిలతో, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు.మరోవైపు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్థాయి సమావేశాలకు సిద్ధమవుతుంది. ఈరోజు నాంపల్లిలో తొలి అసెంబ్లీ స్థాయికి సన్నాహక సమావేశం జరుగనుంది.

సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి కనీస ప్రాతినిధ్యం లేకున్నా, పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టింది.ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ విజయం సాధించినా.....గ్రేటర్ లో ఒకటైన సికింద్రాబాద్ లో సభ పరిధిలోనీ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క సీటు కూడా దక్కించుకోలేక పోయింది.

ఏడు స్థానాలకు గాను బిఆర్ఎస్ పార్టీ 6 స్థానాలు కైవసం చేసుకోగా....ఒక స్థానంలో మజ్లిస్ పార్టీ గెలుపొందింది. కొన్ని స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా కోల్పోయింది. దీంతో గ్రేటర్‌లో ఓటమిని తీవ్రంగా పరగణించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.....గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల పై ప్రత్యేక దృష్టి సారించింది.

అందులో భాగంగానే బిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్,మేయర్ విజయలక్ష్మి, మాజీ మేయర్ రామ్మోహన్,మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫాసియుద్దిన్ మరియు కొందరు కార్పొరేటర్లును కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని....పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతుంది.అయితే సికింద్రాబాద్ లోక్ సభ సీటును పలువురు నేతలు ఆశించినా..... చివరికి ఆ సీటు దానం నాగేందర్ కే దక్కింది.

ఇంఛార్జిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి…

ఇదిలా ఉంటే సికింద్రాబాద్ స్థానంలో గెలుపే లక్ష్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగాల్లో దిగారు. ఇన్‌ఛార్జిగా నియామకం కాగానే తన నివాసం లోక్సభ అభ్యర్థి దానం నాగేందర్ తో పాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో మంత్రి సమావేశమయ్యారు.

సికింద్రబాద్ లోక్ సభ పరిధిలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మంత్రి కోమటిరెడ్డి తెలుసుకున్నారు. పార్టీలో కొత్తగా చేరిన వారితో పాటు అధికారంలో ఉన్న కారణంగా పరిస్థితులు తమకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.

ఇటు బిఆర్ఎస్ పార్టీ సైతం సికింద్రాబాద్ లోక్ సభ్ స్థానంపై గెలుపే లక్ష్యంగా సమావేశాలు నిర్వహిస్తుంది.ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన....పద్మ రావు అధ్యక్షతన సమావేశాలు జరుగుతున్నాయి. సనత్ నగర్ ఎమ్మెల్యే,మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ నివాసంలో శనివారం పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్పొరేటర్లు,పార్టీ సీనియర్లు మరియు పార్టీ కార్యకర్తలతో అయన సమావేశం నిర్వహించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అయన సమావేశం నిర్వహించారు.ఇటు సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి సైతం మరోసారి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈసారి గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

( రిపోర్టింగ్ కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్)

Whats_app_banner

సంబంధిత కథనం