IRCTC Vijayawada - Shirdi Tour: తగ్గిన 'షిర్డీ' టూర్ ధర - విజయవాడ నుంచి కొత్త ప్యాకేజీ వచ్చేసింది-irctc tourism shirdi tour package from vijayawada 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Vijayawada - Shirdi Tour: తగ్గిన 'షిర్డీ' టూర్ ధర - విజయవాడ నుంచి కొత్త ప్యాకేజీ వచ్చేసింది

IRCTC Vijayawada - Shirdi Tour: తగ్గిన 'షిర్డీ' టూర్ ధర - విజయవాడ నుంచి కొత్త ప్యాకేజీ వచ్చేసింది

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 15, 2024 08:33 PM IST

IRCTC Vijayawada Shirdi Tour 2024: విజయవాడ నుంచి షిర్డీకి కొత్త టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. 4 రోజుల ఈ టూర్ ప్యాకేజీలో షిర్డీతో పాటు శనిశిగ్నాపూర్ కు కూడా వెళ్లి రావొచ్చు.

షిర్డీ టూర్
షిర్డీ టూర్ (IRCTC)

IRCTC Shirdi Tour From Vijayawada 2024: కొత్త ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఈ కొత్త ఏడాదిలో షిరిడీ సాయిబాబా భక్తుల కోసం గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ నుంచి షిర్డీకి వెళ్లేందుకు రైల్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 'SAI SANNIDHI EX - VIJAYAWADA' పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది.

3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ. ప్రతీ మంగళవారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ జనవరి 23వ తేదీన అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీలో సాయిబాబా దర్శనంతో పాటు శనిశిగ్నాపూర్ కూడా కవర్ అవుతుంది.

టూర్ షెడ్యూల్ :

Day - 1: తొలి రోజు విజయవాడలో స్టార్ట్ అవుతుంది. రాత్రి 10.15 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్ రైలు(17208- Sainagar Shirdi Express) ఎక్కాలి. రాత్రంతా జర్నీ ఉంటుంది.

Day - 2: రెండో రోజు ఉదయం 6.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. ఆ తర్వాత షిర్డీకి బయల్దేరుతారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత షిరిడీ ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం షాపింగ్ కోసం ఫ్రీ టైమ్ ఉంటుంది. రాత్రికి షిరిడీలో బస చేయాల్సి ఉంటుంది.

Day - 3 : ఇక 3వ రోజు ఉదయం శనిశిగ్నాపూర్ సందర్శన ఉంటుంది. అక్కడ్నుంచి మళ్లీ షిరిడీ చేరుకోవాలి. రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో తిరుగు ప్రయాణం మొదలవుతుంది.

Day 4 Friday: తెల్లవారుజామున 2.50 విజయవాడ కు చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టికెట్ ధరలు :

విజయవాడ - షిర్డీ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…. కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 14930 ధర ఉండగా... డబుల్ ఆక్యుపెన్సీకి రూ.9430, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 8030చెల్లించాలి. ఐదు నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. గతడాది డిసెంబర్ లో చూస్తే కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 15670 ధర ఉండగా… డబుల్ ఆక్యుపెన్సీకి రూ.10050గా ఉండేది. ఈ కొత్త ఏడాదిలో కొంచెం ధరలు తగ్గాయి. ఈ టూర్ ను బుకింగ్ చేసుకోవటంతో పాటు పూర్తి వివరాలను https://www.irctctourism.com వెబ్ సైట్ లో చూడవచ్చు.

టీ20 వరల్డ్ కప్ 2024