Telangana Tourism Goa Tour Package 2024: ఈ మండే వేసవిలో గోవాకు(Goa Tour Package 2024) వెళ్లే ప్లాన్ ఉందా..? అక్కడ ఉండే బీచ్ ల్లో ఆహ్లాదకరంగా గడపాలని అనుకుంటున్నారా..? అయితే మీలాంటి వారికోసం తెలంగాణ టూరిజం(Telangana Tourism) స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది. అతి తక్కువ ధరోలనే 4 రోజులు అక్కడే గడిపేయవచ్చు. GOA PACKAGE TOUR – ITINERARY అనే పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. రోడ్డు మార్గానే వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఇక్కడ చూడండి…..
హైదరాబాద్ - గోవా టికెట్ ధరలు చూస్తే పెద్దలకు రూ. 11999గా నిర్ణయించారు. చిన్నారులకు 9599గా ఉంది. సింగిల్ అక్యుపెన్సీకి రూ. 14900గా ఉంది. వొల్వో కోచ్ ఏసీ కండిషన్ బస్సులో జర్నీ ఉంటుంది. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 నెంబర్ కు కాల్ చేయవచ్చు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లో వివరాలను చూడొచ్చు.
మరోవైపు సోమశిల ప్రకృతి అందాలను చూసి అస్వాదించాలనుకుంటున్నారా..? అయితే తక్కువ బడ్జెట్ లోనే రెండు రోజుల ప్యాకేజీని ప్రకటించింది.ప్రతి వీకెండ్ శనివారం తేదీల్లో ఈ ట్రిప్ అందుబాటులో ఉంటుంది.