IRCTC Shirdi Tour 2024 : 4 రోజుల 'షిర్డీ' ట్రిప్ - అతి తక్కువ ధరలోనే IRCTC టూర్ ప్యాకేజీ, పూర్తి వివరాలివే-irctc tourism 4 days sai shivam shirdi tour package from hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Shirdi Tour 2024 : 4 రోజుల 'షిర్డీ' ట్రిప్ - అతి తక్కువ ధరలోనే Irctc టూర్ ప్యాకేజీ, పూర్తి వివరాలివే

IRCTC Shirdi Tour 2024 : 4 రోజుల 'షిర్డీ' ట్రిప్ - అతి తక్కువ ధరలోనే IRCTC టూర్ ప్యాకేజీ, పూర్తి వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 09, 2024 10:08 AM IST

IRCTC Hyderabad Shirdi Tour 2024: షిర్డీకి కొత్త టూర్ ప్యాకేజీ వచ్చేసింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. 4 రోజుల పాటు టూర్ ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి…..

షిర్డీ టూర్ ప్యాకేజీ
షిర్డీ టూర్ ప్యాకేజీ (unsplash.com)

IRCTC Hyderabad Shirdi Tour 2024 Package : ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు.. సామాన్యులకు అందుబాటు ధరలో ఉంటున్నాయి. కొన్ని ప్రదేశాలకు వెళ్లాలనుకునేవారికి.. ఈ ప్యాకేజీలు ఉపయోగపడతాయి. కుటుంబంతో కలిసి వెళ్లి చూసి రావొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐఆర్‌సీటీసీ తీసుకెళ్లి.. తీసుకొస్తుంది. షిరిడీకి ‘సాయి శివమ్’ (SAI SHIVAM) పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. నాసిక్, షిరిడీ చూసి రావొచ్చు. హైదరాబాద్ నుంచి ప్రయణం మెుదలవుతుంది. మూడు రాత్రులు, నాలుగు రోజులతో ఈ ప్యాకేజీ ఉంటుంది.మార్చి 15, 2024న ప్యాకేజీ అందుబాటులో ఉంది.

హైదరాబాద్ - షిర్డీ టూర్ షెడ్యూల్ 2024:

Day 1 : కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి 06:40 గంటలకు ట్రైన్ ఉంటుంది. రైలు నెం. 17064, అజంతా ఎక్స్‌ప్రెస్ లో ఎక్కాలి. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.

Day 2 : ఉదయం 7:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. పికప్ చేసుకుని షిరిడీకి తీసుకెళ్తారు. ఆ తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. అనంతరం షిరిడీ ఆలయం సందర్శన ఉంటుంది. సాయంత్రం షిరిడీలో తిరగొచ్చు. రాత్రికి అక్కడే చేస్తారు.

Day 3 : షిరిడీలో హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. త్రయంబకేశ్వర్, పంచవటి దర్శనం ఉంటుంది. నాగర్‌సోల్ స్టేషన్‌లో రాత్రి 08:30 గంటలకు రైలు ఉంటుంది. 09:20 గంటలకు బయల్దేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.

Day 4 :  ఉదయం 09.45 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

షిర్డీ టూర్ టికెట్ ధరలు:

Hyderabad Shirdi Tour Prices 2024: హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ షిర్డీ టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే…. సింగిల్ షేరింగ్ కు రూ. 9530గా ఉండగా… డబుల్ షేరింగ్ కు రూ. 7680ధరగా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7490ఉంది. కంఫర్ట్ క్లాస్ లోఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. ఇక Standard క్లాస్ లో చూస్తే సింగిల్ షేరింగ్ కు రూ. 7850గా ఉండగా… డబుల్ షేరింగ్ కు రూ. 5990ధరగా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 5800ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కవర్ అవుతాయి. నిబంధనలు కూడా వర్తిస్తాయి.  https://www.irctctourism.com/  క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. 9701360701 / 8287932229 / 9281495843 ఈ మొబైల్ నెంబర్లను కూడా సంప్రదించవచ్చు

Whats_app_banner