IRCTC Ooty Tour 2024 : 6 రోజుల ఊటీ ట్రిప్ - తిరుపతి నుంచి బడ్జెట్ ధరలోనే టూర్ ప్యాకేజీ - వివరాలివే-irctc tourism 6 days ooty tour package from tirupati check full details are here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Ooty Tour 2024 : 6 రోజుల ఊటీ ట్రిప్ - తిరుపతి నుంచి బడ్జెట్ ధరలోనే టూర్ ప్యాకేజీ - వివరాలివే

IRCTC Ooty Tour 2024 : 6 రోజుల ఊటీ ట్రిప్ - తిరుపతి నుంచి బడ్జెట్ ధరలోనే టూర్ ప్యాకేజీ - వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 08, 2024 04:23 PM IST

IRCTC Ooty Tour Package 2024: ఈ సమ్మర్ లో ఊటీ ట్రిప్ ప్లాన్ ఉందా..? అయితే మీకు IRCTC టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలోని తిరుపతి నుంచి ఊటీకి సరికొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి……

ఊటీ టూర్ ప్యాకేజీ
ఊటీ టూర్ ప్యాకేజీ (/unsplash.com/)

IRCTC Tirupati - Ooty Package 2024: సమ్మర్ వచ్చేసింది… ఎండులు దంచికొడుతున్నాయి. ఏదైనా చల్లగా ఉండే ప్లేస్ కు వెళ్లాలని.. సేదా తీరాలని భావిస్తున్నారా..? అయితే తక్కువ ధరలోనే పలు టూర్ ప్యాకేజీలను తీసుకువస్తుంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా.....ఊటీకి టూర్ ప్యాకేజీ(IRCTC Ooty Package)ని ప్రకటించింది. ఈ టూర్ ను ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి సిటీ నుంచి ఆపరేట్ చేస్తోంది. ‘ULTIMATE OOTY EX TIRUPATI ‘ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుండగా... ఊటీ, కున్నూర్ వంటి టూరిస్ట్ ప్లేస్ లు కవర్ అవుతాయి. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ మార్చి, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నట్లు IRCTC టూరిజం తెలిపింది.

తిరుపతి ఊటీ టూర్ షెడ్యూల్ 2024:

Day - 01 : తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 11.50 గంటలకు ట్రైన్(Train No.17230, శబరి ఎక్స్ ప్రెస్) బయల్దేరుతుంది. రాత్రి అంత జర్నీ ఉంటుంది.

Day - 02 : ఉదయం 08.02 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఊటీకి వెళ్తారు. హోటల్ కి చెకిన్ అవుతారు. ఆ తర్వాత... మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్ ను సందర్శిస్తారు. ఊటీ లేక్ చూస్తారు. రాత్రి ఊటీలోనే బస చేస్తారు.

Day - 03 :బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత దొడబెట్ట, టీ మ్యూజియం, Pykara వాటర్ పాల్స్ కు వెళ్తారు. రాత్రి కూడా ఊటీలోనే ఉంటారు.

Day - 04 :బ్రేక్ ఫాస్ట్ తర్వాత కున్నూరుకు వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి ఊటీకి చేరుకుంటారు. రాత్రి ఊటీలోనే ఉంటారు.

Day - 05 : హోటల్ నుంచి కోయంబత్తూరు వెళ్తారు. సాయంత్రం 04.35 నిమిషాలకు రైలు(17229 - Sabari Express) ప్రయాణం మొదలవుతుంది.

Day - 06 : రాత్రి 12.05 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.

తిరుపతి - ఊటీ టికెట్ ధరలు:

Tirupati Ooty Tour Ticket Price 2024: తిరుపతి - ఊటీ ప్యాకేజీ చూస్తే… కంఫర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ.26,770ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 14,460 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.11,470గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. గతంతో పోల్చితే స్వల్పంగా ధరలు తగ్గాయి. ఏప్రిల్, మే మాసంలో ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. తిరుపతి రైల్వే స్టేషన్ లో IRCTC టూరిజం ఓ కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేసింది. 8287932317 నెంబర్ కు కాల్ చేసి సందేహాలు ఉంటే తీర్చుకోవచ్చు.

Whats_app_banner