IRCTC Ooty Tour : ఈ కొత్త ఏడాదిలో 'ఊటీ' ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? బడ్జెట్ ధరలో 6 రోజుల టూర్ ప్యాకేజీ-irctc tourism latest ooty tour package from tirupati city ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Ooty Tour : ఈ కొత్త ఏడాదిలో 'ఊటీ' ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? బడ్జెట్ ధరలో 6 రోజుల టూర్ ప్యాకేజీ

IRCTC Ooty Tour : ఈ కొత్త ఏడాదిలో 'ఊటీ' ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? బడ్జెట్ ధరలో 6 రోజుల టూర్ ప్యాకేజీ

Jan 13, 2024, 08:38 AM IST Maheshwaram Mahendra Chary
Jan 13, 2024, 08:38 AM , IST

  • IRCTC Tirupati Ooty Tour Package : ఈ కొత్త ఏడాదిలో ఊటీకి వెళ్లాలని ఉందా…? అయితే మీకు ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి నుంచి ఊటీకి సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్య వివరాలను ఇక్కడ చూడండి….

కొందరు అధ్యాత్మిక పర్యటనలకు వెళ్లాలని అనుకుంటే... మరికొందరూ సేద తీరే ప్రాంతాల కోసం సెర్చ్ చేస్తుంటారు. అయితే మీకోసం రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకువస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం.

(1 / 6)

కొందరు అధ్యాత్మిక పర్యటనలకు వెళ్లాలని అనుకుంటే... మరికొందరూ సేద తీరే ప్రాంతాల కోసం సెర్చ్ చేస్తుంటారు. అయితే మీకోసం రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకువస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం.(unsplash.com)

ఇందులో భాగంగా….. తిరుపతి నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'ULTIMATE OOTY EX TIRUPATI ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా… ఊటీ, కున్నూర్ వంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి.

(2 / 6)

ఇందులో భాగంగా….. తిరుపతి నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'ULTIMATE OOTY EX TIRUPATI ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా… ఊటీ, కున్నూర్ వంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి.(unsplash.com)

5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ జనవరి 23, 2024వ తేదీన అందుబాటులో ఉంది.

(3 / 6)

5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ జనవరి 23, 2024వ తేదీన అందుబాటులో ఉంది.(unsplash.com)

ఫస్ట్ డే  తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 11.50 గంటలకు ట్రైన్ బయల్దేరుతుంది. రాత్రి అంత జర్నీ ఉంటుంది. రెండో రోజు ఉదయం 08.02 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఊటీకి వెళ్తారు. హోటల్ కి చెకిన్ అయిన తర్వాత... మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్ ను సందర్శిస్తారు. ఊటీ లేక్ చూస్తారు. రాత్రి ఊటీలోనే బస చేస్తారు.

(4 / 6)

ఫస్ట్ డే  తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 11.50 గంటలకు ట్రైన్ బయల్దేరుతుంది. రాత్రి అంత జర్నీ ఉంటుంది. రెండో రోజు ఉదయం 08.02 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఊటీకి వెళ్తారు. హోటల్ కి చెకిన్ అయిన తర్వాత... మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్ ను సందర్శిస్తారు. ఊటీ లేక్ చూస్తారు. రాత్రి ఊటీలోనే బస చేస్తారు.(unsplash.com)

ఇక మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత దొడబెట్ట, టీ మ్యూజియం, పైకార ఫాల్స్ కు వెళ్తారు. రాత్రి కూడా ఊటీలోనే బస చేస్తారు. నాల్గో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత కున్నూరుకు వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి ఊటీకి చేరుకుంటారు. రాత్రి ఊటీలోనే ఉంటారు.

(5 / 6)

ఇక మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత దొడబెట్ట, టీ మ్యూజియం, పైకార ఫాల్స్ కు వెళ్తారు. రాత్రి కూడా ఊటీలోనే బస చేస్తారు. నాల్గో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత కున్నూరుకు వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి ఊటీకి చేరుకుంటారు. రాత్రి ఊటీలోనే ఉంటారు.(unsplash.com)

5వ రోజు హోటల్ నుంచి కోయంబత్తూరు వెళ్తారు. సాయంత్రం 04.35 నిమిషాలకు రైలు ప్రయాణం మొదలవుతుంది. ఆరో రోజు రాత్రి 12.05 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది ఇక ధరలు చూస్తే… .కంఫర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 30120ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 16130 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.12580 గా ఉంది.ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com/  వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

(6 / 6)

5వ రోజు హోటల్ నుంచి కోయంబత్తూరు వెళ్తారు. సాయంత్రం 04.35 నిమిషాలకు రైలు ప్రయాణం మొదలవుతుంది. ఆరో రోజు రాత్రి 12.05 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది ఇక ధరలు చూస్తే… .కంఫర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 30120ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 16130 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.12580 గా ఉంది.ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com/  వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.(unsplash.com)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు