Govt Jobs 2024 : హైదరాబాద్‌ MSMEలో ఉద్యోగ ఖాళీలు - అర్హతలు, ముఖ్య తేదీలివే-msme hyderabad recruitment 2024 notifications for faculty member and director jobs ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Govt Jobs 2024 : హైదరాబాద్‌ Msmeలో ఉద్యోగ ఖాళీలు - అర్హతలు, ముఖ్య తేదీలివే

Govt Jobs 2024 : హైదరాబాద్‌ MSMEలో ఉద్యోగ ఖాళీలు - అర్హతలు, ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 09, 2024 08:02 AM IST

MSME Hyderabad Recruitment 2024:హైదరాబాద్ లోని ఎన్‌ఐఎమ్ఎస్‌ఎమ్‌ఈ(MSME) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా…ఫ్యాకల్టీ మెంబర్ తో పాటు డైరెక్టర్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు మార్చి 29వ తేదీని తుది గడువుగా ప్రకటించారు.

హైదరాబాద్ ఎన్‌ఐఎమ్ఎస్‌ఎమ్‌ఈలో  ఉద్యోగాలు
హైదరాబాద్ ఎన్‌ఐఎమ్ఎస్‌ఎమ్‌ఈలో ఉద్యోగాలు

MSME Hyderabad Recruitment 2024:హైదరాబాద్‌ ఎన్‌ఐఎమ్ఎస్‌ఎమ్‌ఈ(Ministry of Micro, Small and Medium Enterprises)లో పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇందులో డైరెక్టర్, ఫ్యాకల్టీ మెంబర్ పోస్టులతో అసోసియేట్ ఫ్యాకల్టీ మెంబర్ ఉద్యోగాలు ఉన్నాయి. అన్ని కలిపి 12 ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా… మార్చి 29వ తేదీతో గడువు ముగియనుంది. https://www.nimsme.org/careers లింక్ తో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్య వివరాలు:

ఉద్యోగ ప్రకటన - ఎన్‌ఐఎమ్ఎస్‌ఎమ్‌ఈ, హైదరాబాద్

ఉద్యోగ ఖాళీలు -12

ఖాళీల వివరాలు - డైరెక్టర్ 03,

ఫ్యాకల్టీ మెంబర్ - 06

అసోసియేట్ ఫ్యాకల్టీ మెంబర్ -02

అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 01.

అర్హతలు - మాస్టర్ డిగ్రీతో పాటు అనుభవం తప్పనిసరి. నోటిఫికేషన్ లో పూర్తి వివరాలను చూడొచ్చు.

వయోపరిమితి - 35 ఏళ్లు మించరాదు

దరఖాస్తులు - ఆన్ లైన్

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ - మార్చి 29, 2024

అధికారిక వెబ్ సైట్ - https://www.nimsme.org/

ఆన్ లైన్ దరఖాస్తుల లింక్ - https://www.nimsme.org/careers

పవర్‌ గ్రిడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

Powergrid Jobs 2024: కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మహారత్న కంపెనీగా ఉన్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో (PowergridCorporation of India) పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ (Notification) జారీ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న పవర్‌ గ్రిడ్‌ దేశ వ్యాప్తంగా అంతరాష్ట్ర విద్యుత్ సరఫరా వ్యవస్థల నియంత్రణ, నిర్వహణ కార్యకలాపాలను చేపడుతుంది.సదరన్ రీజియన్‌ 1 పరిధిలో టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం అనుభవజ్ఞులైన యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో చేపడతారు.

లక్ట్రికల్ ఫీల్డ్ ఇంజనీర్ Engineer పోస్టులు 14 ఉన్నాయి. వీటిలో అన్ రిజర్వుడు పోస్టులు 6, ఓబీసీ 4, ఎస్సీ 2, ఎస్టీ 1, ఈడబ్ల్యుఎస్ 1, దివ్యాంగులు1, ఎక్స్‌ సర్వీస్ మెన్‌ 2 ఉన్నాయి. సివిల్ విభాగంలో 7 ఫీల్డ్ ఇంజనీర్‌ పోస్టులు ఉన్నాయి. వీటిలో 4 అన్‌ రిజర్వుడు పోస్టులు, ఓబీసీ1, ఎస్సీ1, ఈడబ్ల్యుఎస్ 1 ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఫీల్డ్ సూపర్ వైజర్ క్యాటగిరీలో 12 పోస్టులు భర్తీ చేస్తారు. సివిల్ పీల్డ్ సూపర్‌వైజర్ విభాగంలో 7 పోస్టులు భర్తీ చేస్తారు. ఎక్స్‌ సర్వీస్ మెన్, దివ్యాంగుల్లో నిర్దేశిత అర్హతలు ఉన్న వారు లేకపోతే హరిజంటల్ రిజర్వేషన్‌తో భర్తీ చేస్తారు.

పూర్తి వివరాలకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు చెందిన కెరీర్స్‌ విభాగంలో పూర్తి స్థాయి నోటిఫికేషన్ చూడొచ్చు. పవర్ కార్పొరేషన్ హైదరాబాద్ రీజియన్ విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మరిన్ని వివరాలకు www.powergrid.in లో నోటిఫికేష్ అందుబాటులో ఉంటుంది. వెబ్‌సైట్‌లో Careers Sectionలో Job recruitment విభాగంలో Openingsలో Regional Openingsలో సౌత్ రీజియన్ హైదరాబాద్ విభాగంలో నోటిఫికేషన్ అందుబాటులో ఉంటుంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తులను మార్చి 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి.  మార్చి 28వ తేదీ అర్థరాత్రి వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. పవర్‌ గ్రిడ్‌కు సంబంధించిన సదరన్ రీజియన్ 1 కార్యాలయం సికింద్రాబాద్‌లో ఉంటుంది. చిరునామా.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సదరన్ రీజియన్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్ 1, రీజినల్ హెడ్ క్వార్టర్స్, నెం.6-6-8/32&395E, కవాడిగూడ మెయిన్ రోడ్, సికింద్రాబాద్-500080

Whats_app_banner