IRCTC Kerala Tour 2024 : 'కేరళ' ట్రిప్ ప్లాన్ ఉందా..! హైదరాబాద్ నుంచి బడ్జెట్ ధరలోనే 6 రోజుల ప్యాకేజీ, వివరాలివే
IRCTC Hyderabad Kerala Tour: ప్రకృతి అందాలకు కేరాఫ్ ఉండే కేరళకు వెళ్లాలని అనుకుంటున్నారా..? అలాంటి ప్లాన్ ఉంటే మీకోసం సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. టూర్ షెడ్యూల్, ప్యాకేజీ ధరల వివరాలు ఎలా ఉన్నాయో చూడండి...
IRCTC Hyderabad Kerala Tour Package 2024 : సమ్మర్ వచ్చేసింది... ఎండలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో సేద తీరేందుకు చాలా మంది టూరిజం ప్లేస్ లకు వెళ్తుంటారు. అయితే అతి తక్కువ ధరలోనే కొత్త కొత్త టూర్ ప్యాకేజీలను తీసుకువస్తోంది ఐఆర్ సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి కేరళకు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 'KERALA HILLS & WATERS ' పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది.
5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం ఫిబ్రవరి 27, 2024 తేదీలో అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం ఊ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఈ డేట్ లో కుదరకపోతే... వచ్చే తేదీలో బుకింగ్ చేసుకోవచ్చు. ఇక ఈ ట్రిప్ లో మున్నార్ , అలెప్పీతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి.
కేరళ టూర్ షెడ్యూల్ :
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Train No.17230, Sabari Express.) నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.
రెండోరోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... సాయంత్రం మున్నార్ టౌన్ లో పర్యటిస్తారు. రాత్రి మున్నార్ లోనే ఉంటారు.
నాల్గొ రోజు హోటల్ నుంచి అలెప్పీకి వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... backwater ప్రాంతానికి వెళ్తారు. రాత్రి అలెప్పీలో బస చేస్తారు.
ఇక 5వ రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.20 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. 6వ రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
కేరళ టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు:
IRCTC Kerala Tour Prices 2024: హైదరాబాద్ - కేరళ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే... సింగిల్ షేరింగ్ కు రూ. 33,480ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 19,370 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.15,580 గా ఉంది. కంఫార్ట్ క్లాస్(3A) లో ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 12,880గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 30770 గా ఉంది. పూర్తి వివరాల కోసం www.irctctourism.com వెబ్ సైట్ ను చూడొచ్చు ఇందులోకి వెళ్లి ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే.. 9701360701 / 8287932229 / 9281495843 మొబైల్ నెంబర్లను సంప్రదించవచ్చు.
సంబంధిత కథనం