OTT: ఓటీటీలోనూ కేరళ స్టోరీ సినిమా దూకుడు.. మూడు రోజుల్లోనే ఆ మార్క్ దాటేసిన కాంట్రవర్షియల్ మూవీ-ott news the kerala story movie crosses 150 million watch minutes on zee5 platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఓటీటీలోనూ కేరళ స్టోరీ సినిమా దూకుడు.. మూడు రోజుల్లోనే ఆ మార్క్ దాటేసిన కాంట్రవర్షియల్ మూవీ

OTT: ఓటీటీలోనూ కేరళ స్టోరీ సినిమా దూకుడు.. మూడు రోజుల్లోనే ఆ మార్క్ దాటేసిన కాంట్రవర్షియల్ మూవీ

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 19, 2024 10:19 PM IST

The Kerala Story OTT Streaming: ది కేరళ స్టోరీ సినిమా ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. మూడో రోజుల్లోనే భారీ వ్యూస్ దక్కించుకుంది. రికార్డులను బ్రేక్ చేస్తోందంటూ ఓటీటీ ప్లాట్‍ఫామ్ వెల్లడించింది.

The Kerala Story OTT: ఓటీటీలోనూ కేరళ స్టోరీ సినిమా దూకుడు
The Kerala Story OTT: ఓటీటీలోనూ కేరళ స్టోరీ సినిమా దూకుడు

The Kerala Story on OTT: ‘ది కేరళ స్టోరీ’ సినిమా ఎంత భారీ బ్లాక్‍బాస్టర్ అయిందో.. ఆ రేంజ్‍లోనే కాంట్రవర్షియల్ అయింది. ఈ చిత్రంపై చాలా వివాదాలు తలెత్తాయి. అలాగే, రాజకీయంగానూ ఈ చిత్రంపై దుమారం రేగింది. 2023 మేలో రిలీజ్ అయిన ది కేరళ స్టోరీ సినిమా సంచలన వసూళ్లను సాధించింది. సుమారు రూ.15 కోట్లతో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్లను సాధించి ఆశ్చర్యపరిచింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అదా శర్మ ప్రధాన పాత్ర పోషించారు. సుమారు 9 నెలల తర్వాత ఇటీవలే కేరళ స్టోరీ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది.

ది కేరళ స్టోరీ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఎంతో కాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ చిత్రం జీ5 ఓటీటీలో స్టీమింగ్ అవుతోంది. భారీగా వ్యూస్ దక్కించుకుంటూ దూసుకెళుతోంది.

ది కేరళ స్టోరీ చిత్రానికి లాంచ్ వీకెండ్‍లోనే 150 మిలియన్లకు పైగా వాచ్ మినిట్స్ వచ్చాయని జీ5 ఓటీటీ నేడు (ఫిబ్రవరి 19) వెల్లడించింది. అంటే మూడు రోజుల్లోనే ఈ చిత్రం 150 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మార్కును దాటేసింది. రికార్డులను, హద్దులను ఈ సినిమా బ్రేక్ చేస్తోందంటూ ఓ పోస్ట్ రిలీజ్ చేసింది జీ5 ఓటీటీ.

కేరళ స్టోరీ మూవీ చాలా వివాదాస్పదం కావడంతో ఓటీటీ స్ట్రీమింగ్ చాలా ఆలస్యమైంది. ఆరంభంలో ఓటీటీ హక్కులు ఏ ప్లాట్‍ఫామ్ తీసుకోవడం లేదని గతంలో దర్శకుడు సుదీప్తో సేన్ అన్నారు. అయితే, ఎట్టకేలకు జీ5 ఓటీటీ ఈ చిత్ర స్ట్రీమింగ్ రైట్స్ తీసుకొని ఇప్పుడు స్ట్రీమింగ్‍కు తెచ్చింది. థియేటర్లలో రిజైన సుమారు 9 నెలలకు ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది.

ది కేరళ స్టోరీ గురించి..

కేరళలోని హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలను కొందరు ప్రేమ పేరుతో మభ్యపెట్టి ఇస్లాంలోకి మార్చి.. వేరే దేశాల్లో ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారనే కథతో ‘ది కేరళ స్టోరీ’ చిత్రం తెరకెక్కింది. ఇవన్నీ అవాస్తవాలని, ఈ చిత్రం ద్వేషాన్ని రేకెత్తించేలా ఉందంటూ కొందరు విమర్శలు చేశారు. మరికొందరు ఈ చిత్రానికి మద్దతుగా నిలిచారు. మొత్తంగా ఈ సినిమా ఓ పెద్ద చర్చకు, వివాదాలకు గతేడాది దారి తీసింది.

కేరళ స్టోరీ చిత్రంలో షాలినీ ఉన్నికృష్ణన్ పాత్ర చేశారు అదా శర్మ. బాధితురాలిగా ఆమె నటన ఈ చిత్రానికి హైలైట్‍గా నిలిచింది. ఈ చిత్రంలో యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీ, దేవదర్శిని, విజయ్ కృష్ణ కీలకపాత్రలు పోషించారు.

సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ మూవీకి వీరేశ్ శ్రీవల్సా, బిషాక్ జ్యోతి సంగీతం అందించారు. సన్ షైన్ పిక్చర్స్ పతాకంపై విపుల్ అమృత్ లాల్ షా ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా సుమారు రూ.303 కోట్ల వసూళ్లతో భారీ బ్లాక్‍బాస్టర్ అయింది. బడ్జెట్‍తో పోలిస్తే సుమారు 20 రెట్లు అధికంగా కలెక్షన్లు సాధించింది.

Whats_app_banner