The Kerala Story Box-Office Collections: కాసుల వర్షం కురిపిస్తోన్న కేరళ స్టోరీ.. వందల కోట్లతో కలెక్షన్ల సునామీ-the kerala story movie to cross 200 crore highest gross hindi film after pathaan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Kerala Story Box-office Collections: కాసుల వర్షం కురిపిస్తోన్న కేరళ స్టోరీ.. వందల కోట్లతో కలెక్షన్ల సునామీ

The Kerala Story Box-Office Collections: కాసుల వర్షం కురిపిస్తోన్న కేరళ స్టోరీ.. వందల కోట్లతో కలెక్షన్ల సునామీ

Maragani Govardhan HT Telugu
May 22, 2023 01:08 PM IST

The Kerala Story Box-Office Collections: వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీ మూవీ వసూళ్ల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ మూవీ 200 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఆదివారం నాడు కూడా రూ.11.50 కోట్లను వసూలు చేసిన ఈ చిత్రం కాసుల సునీమా సృష్టిస్తోంది.

ది కేరళ స్టోరీ మూవీకి కాసుల వర్షం
ది కేరళ స్టోరీ మూవీకి కాసుల వర్షం (MINT_PRINT)

The Kerala Story Box-Office Collections: ఇటీవల కాలంలో విపరీతంగా వివాదంలో చిక్కుకున్న సినిమా ఏదైనా ఉందంటే అది ది కేరళ స్టోరీనే. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి మూవీపై పలు విమర్శలు తలెత్తాయి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమాను బ్యాన్ కూడా చేశారు. ఇంత వివాదాల నడుమ చిన్న సినిమాగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా..సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. అదా శర్మ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం సరికొత్త మైలురాయిని అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ 200 కోట్ల క్లబ్‌లో చేరింది.

విడుదలై మూడు వారాలు దాటినా ది కేరళ స్టోరీ వసూళ్లు మాత్రం అస్సలు తగ్గట్లేదు. మూడో ఆదివారం కూడా రూ.11.50 కోట్ల వసూలు చేసిందీ చిత్రం. మొత్తంగా రూ.198 కోట్లను రాబట్టింది. సోమవారం నాటికి 200 కోట్ల మైలురాయిని అందుకుంది. పఠాన్ చిత్రం తర్వాత అత్యధిక వసూళ్లను సాధించిన హిందీ చిత్రంగా కేరళ స్టోరీ రికార్డు సృష్టించింది. శుక్రవారం నాడు ఈ సినిమాకు 6.60 కోట్లు రాగా.. శనివారం నాడు 9.15 కోట్లను రాబట్టింది. ఆదివారం నాటికి ఈ వసూళ్లు 11.50 కోట్లకు పెరిగాయి. మొత్తంగా 198.97 కోట్లు రాబట్టినట్లు ప్రముఖ మూవీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

ఈ మూవీని దేశంలో పలు ప్రాంతాల్లో నిషేధించినప్పటికీ కమర్షియల్ సక్సెస్ సాధించడం విశేషం. బంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేపట్టారు. థియేటర్ ఓనర్లు ఈ మూవీని రిలీజ్ చేయకుండా అడ్డుకున్నారు. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చిత్రాన్ని నిషేధించారు. అయితే సుప్రీంకోర్టు ఈ నిషేధాన్ని రద్దు చేసినట్లు గురువారం నాడు తీర్పునిచ్చింది. శనివారం నాడు బంగాల్ థియేటర్ ఓనర్లు ఈ సినిమా ప్రదర్శించడానికి ఆసక్తి చూపించకపోవడంతో ది కేరళ స్టోరీ ప్రదర్శన అక్కడ కొనసాగలేదు.

విపుల్ షా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాను సుదిప్తో సేన్ తెరకెక్కించారు. అధా శర్మ, సోనియా బలానీ యోగిత బిహాని, సిద్ధి ఇద్నానీ కీలక పాత్రల్లో నటించారు. కొంతమంది కేరళ మహిళలను బలవంతంగా మత మార్పిడులు చేసి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(IS)లో చేర్పించారనే అంశంపై ఈ సినిమాపై తెరకెక్కింది.

Whats_app_banner