The Kerala Story 2 : ది కేరళ స్టోరీ 2.. ఇందులో ఏం చూపిస్తారు?-the kerala story 2 director sudipto sen getting offers to the kerala story sequel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Kerala Story 2 : ది కేరళ స్టోరీ 2.. ఇందులో ఏం చూపిస్తారు?

The Kerala Story 2 : ది కేరళ స్టోరీ 2.. ఇందులో ఏం చూపిస్తారు?

Anand Sai HT Telugu

The Kerala Story 2 : 'ది కేరళ స్టోరీ' చిత్రానికి దర్శకత్వం వహించిన తర్వాత సుదీప్తో సేన్ పాపులారిటీ పెరిగింది. ఇప్పుడు ది కేరళ స్టోరీ తీసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ది కేరళ స్టోరీ (twitter)

దేశవ్యాప్తంగా చర్చ క్రియేట్ చేసిన ‘ది కేరళ స్టోరీ’(The Kerala Story) సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా సీక్వెల్‌పై వార్తలు వినిపిస్తున్నాయి. అదా శర్మ(adah sharma) నటించిన 'ది కేరళ స్టోరీ' కేవలం మహిళల బ్రెయిన్‌వాష్ గురించి మాత్రమే. అయితే అబ్బాయిల బ్రెయిన్‌వాష్‌ను ఎందుకు చూపించలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై దర్శకుడు సుదీప్తో సేన్‌(Sudipto Sen)ను కొందరు ప్రశ్నించారు. అబ్బాయిల బ్రెయిన్‌వాష్ గురించి సీక్వెల్ చేయడానికి అతనికి ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో 'ది కేరళ స్టోరీ 2'పై అంచనాలు ఏర్పడ్డాయి.

అనేక కారణాల వల్ల 'ది కేరళ స్టోరీ' సినిమా వివాదాన్ని సృష్టించింది. ఈ చిత్రానికి హిందూ అనుకూల సంస్థలు మద్దతు తెలిపాయి. అయితే ఇది ప్రచార సినిమా అని పలువురు విమర్శిస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. చిత్రం మీద భిన్న రకాల స్పందనలు ఉన్నాయి. మరోవైపు కొల్లూరులో ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన బ్యానర్‌ను కొల్లూరు మూకాంబిక ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. పర్యాటకులను ఆకర్షిస్తూ ఆంగ్లం, మలయాళంలో రాసి బ్యానర్లు పెట్టారు. ఈ బ్యానర్లు సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారాయి.

'ది కేరళ స్టోరీ' బాక్సాఫీస్ వద్ద బంగారు పంటగా నిలిచింది. ఇంకా బాక్సాఫీస్ వేట కొనసాగుతోంది. కొన్ని చోట్ల హౌస్ ఫుల్ అవుతోంది. మే 14న ఏకంగా 23 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ చిత్రం టోటల్ కలెక్షన్ 136.74 కోట్ల రూపాయలకు పైనే ఉంది.

మరోవైపు 'ది కేరళ స్టోరీ' చిత్రానికి దర్శకత్వం వహించిన తర్వాత సుదీప్తో సేన్‌కు పాపులారిటీ పెరిగింది. ఇటీవల ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైందని సమాచారం. ఈ వార్త విన్న అభిమానులు షాక్ అయ్యారు. అయితే నటి అదా శర్మ, దర్శకుడు సుదీప్తో సేన్‌లకు తీవ్ర గాయాలు కాలేదని తెలిసింది.