Sudigadu 2 : అనిల్ రావిపూడి దర్శకత్వంలో అల్లరి నరేశ్ సుడిగాడు 2..!-director anil ravipudi movie wtih allari naresh sudigadu sequel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sudigadu 2 : అనిల్ రావిపూడి దర్శకత్వంలో అల్లరి నరేశ్ సుడిగాడు 2..!

Sudigadu 2 : అనిల్ రావిపూడి దర్శకత్వంలో అల్లరి నరేశ్ సుడిగాడు 2..!

Anand Sai HT Telugu

Allari Naresh Sudigadu Sequel : అల్లరి నరేశ్ కెరీర్లో మంచి హిట్ అందుకున్న సినిమా సుడిగాడు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిందీ చిత్రం. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. మళ్లీ ప్రేక్షుకులను నవ్వించేందుకు అల్లరి నరేశ్ వస్తాడని అంటున్నారు.

అనిల్ రావిపూడి-అల్లరి నరేశ్ (twitter)

హిట్.., ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా కామెడీ సినిమాలు(Comedy Movies) చేసుకుంటూ పోయాడు అల్లరి నరేశ్. అలాంటి రికార్డు అతడికి మాత్రమే సొంతం. జయాపజయాలతో సంబంధం లేకుండా.. ప్రేక్షకులను నవ్వించడమే పనిగా పెట్టుకుని సినిమాలు చేశాడు. ఆ తర్వాత ప్రేక్షకుల అభిరుచి మారిందని గ్రహించి.. సీరియస్ సినిమాల వైపు వచ్చాడు. నాంది సినిమాతో సీరియస్ రోల్స్ లో నటిస్తూ వస్తున్నాడు.

నాంది సినిమాతో((naandhi Cinema) సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం సినిమాతో కొత్తదనం చూపించాడు. ప్రస్తుతం నాంది దర్శకుడితోనే ఉగ్రం సినిమాతో(ugram telugu movie) ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఫుల్ మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు అల్లరి నరేశ్(Allari Naresh). ఈ చిత్రం మే 5న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్లలో చిత్రబృందం బిజీగా ఉంది. వరుస ఇంటర్వ్యూలు, ప్రమేషనల్ ఈవెంట్లతో హడావుడి చేస్తోంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లరి నరేశ్ ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు.

సీక్వెల్ సినిమాల గురించి టాపిక్ వచ్చింది. తన సినిమాల్లో సుడిగాడు(Sudigadu) సినిమాకు సీక్వెల్ తీయొచ్చు అని అన్నాడు. అప్పట్లో ఈ సినిమాకు ఇప్పటి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) పనిచేశారని గుర్తు చేశారు. తాజాగా అనిల్ రావిపూడిని కలిశానని, సుడిగాడు 2(Sudigadu 2) తీద్దామా అని అడిగాడని చెప్పాడు. తాను రూటు మార్చితే మళ్లీ కామెడీ వైపు తీసుకెళ్తారా? అని అడిగితే ఓకే అన్నాడు అని అల్లరి నరేశ్ తెలిపాడు.

ఈ విషయం విన్న ప్రేక్షకులు.. అనిల్ రావిపూడి.. నరేశ్ తో నిజంగా సుడిగాడు 2 చేస్తాడా అని చర్చించుకుంటున్నారు. ఓవైపు నరేశ్.. సీరియస్ క్యారెక్టర్లు చేస్తూ.. ఆడియన్స్ కు దగ్గరవుతున్నాడు. మళ్లీ ట్రాక్ మార్చి.. కామెడీ సినిమా చేస్తాడో లేదో చూడాలి.

అల్లరి నరేశ్ నటించిన సుడిగాడు సినిమా 2012 లో విడుదలై.. భారీ విజయం అందుకుంది. మొత్తం స్పూఫ్, కామెడీ సన్నివేశాలతోనే భీమినేని శ్రీనివాసరావు ఈ సినిమాను తీశారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి రచయితల్లో ఒకరిగా పనిచేశాడు. సుడిగాడు సినిమాను 7 కోట్లు పెట్టి తీస్తే 32 కోట్లు వసూలు చేసింది.

అల్లరి నరేశ్.. ఒకప్పుడు తన అల్లరి సినిమాలతో ప్రేక్షకులను తెగ నవ్వించాడు. సుడిగాలి లాంటి కామెడీ సినిమాలతో(Comedy Movies) ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. సుమారు 50 సినిమాలు కామెడీవే చేశాడు నరేశ్. అతడి కెరీర్లోని కామెడీ సినిమాల్లో సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. కానీ కొంతకాలం తర్వాత అల్లరి నరేశ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆలోచనల్లో పడ్డాడు. సీరియస్ సినిమాలపై ఫోకస్ చేశాడు.