Movies In Theaters This Week: ఈ వారం బాక్సాఫీస్ బ‌రిలో డ‌బ్బింగ్ సినిమాల జోరు - థియేట‌ర్ల‌లో ఏడు సినిమాలు రిలీజ్‌-anni manchi sakunamule to bichagadu 2 tollywood movies releasing this week in theatres ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Movies In Theaters This Week: ఈ వారం బాక్సాఫీస్ బ‌రిలో డ‌బ్బింగ్ సినిమాల జోరు - థియేట‌ర్ల‌లో ఏడు సినిమాలు రిలీజ్‌

Movies In Theaters This Week: ఈ వారం బాక్సాఫీస్ బ‌రిలో డ‌బ్బింగ్ సినిమాల జోరు - థియేట‌ర్ల‌లో ఏడు సినిమాలు రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
May 15, 2023 06:49 AM IST

Movies In Theaters This Week: ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్‌ వ‌ద్ద యంగ్ హీరో సంతోష్ శోభ‌న్‌తో పాటు కోలీవుడ్ హీరో విజ‌య్ ఆంటోనీ పోటీప‌డ‌బోతున్నారు. అలాగే ఎన్టీఆర్ క‌ల్ట్ క్లాసిక్ మూవీ కూడా రీ రిలీజ్ కాబోతున్న‌ది

అన్నీ మంచి శ‌కున‌ములే
అన్నీ మంచి శ‌కున‌ములే

అన్నీ మంచి శ‌కున‌ములే (Anni Manchi Sakunamule)

స‌క్సెస్‌లు లేక‌పోయినా అవ‌కాశాల రేసులో మాత్రం ముందున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభ‌న్‌. ప్ర‌తి రెండు నెల‌ల‌కో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొస్తోన్నాడు. సంతోష్ శోభ‌న్ హీరోగా న‌టించిన తాజా చిత్రం అన్నీ మంచిశ‌కున‌ములే ఈ వారం (మే 18న‌)ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు నందినిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోంది.

మాళ‌వికానాయ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, గౌత‌మి, రావుర‌మేష్‌తో పాటు ప‌లువురు టాలీవుడ్ న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తోన్నారు. స్వ‌ప్న సినిమాస్‌పై ప‌తాకంపై ప్రియాంక‌ద‌త్‌, స్వ‌ప్నాద‌త్ నిర్మిస్తోన్న ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో స్టార్ హీరోలు ఎన్టీఆర్‌, నాని, దుల్క‌ర్ స‌ల్మాన్ పాల్గొన‌డం, సోష‌ల్ మీడియాలో అనుష్క‌తో పాటు ప‌లువురు అగ్ర నాయ‌కానాయిక‌లు స‌పోర్ట్‌గా నిల‌వ‌డంతో ఈ చిన్న సినిమాపై టాలీవుడ్ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి నెల‌కొంది.

సంతోష్ శోభ‌న్(Santosh Sobhan) కెరీర్‌కు ఈ సినిమా కీల‌కంగా మారింది. అన్నీ మంచిశ‌కున‌ములే సినిమాతోనైనా అత‌డు విజ‌యాల బాట ప‌డ‌తాడా లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

బిచ్చ‌గాడు -2(Bichagadu -2)

విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టించిన బిచ్చ‌గాడు సినిమా తెలుగులో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన త‌మిళ డ‌బ్బింగ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. విజ‌య్ ఆంటోనీ కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాకు బిచ్చ‌గాడు -2 పేరుతో సీక్వెల్ రాబోతున్న‌ది. ఈ సీక్వెల్ మే 19న రిలీజ్ కానుంది.

బిచ్చ‌గాడు -2 సినిమాతో విజ‌య్ ఆంటోనీ ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేస్తోన్నాడు. బిచ్చ‌గాడు మ్యాజిక్‌ను ఈ సీక్వెల్ రిపీట్‌ చేస్తుందా? హీరోగా, ద‌ర్శ‌కుడిగా విజ‌య్ ఆంటోనీ స‌క్సెస్ అందుకుంటాడా లేదా అన్న‌ది మ‌రో నాలుగు రోజుల్లో తేల‌నుంది.

సింహాద్రి రీ రిలీజ్‌

కొత్త సినిమాల‌తో పాటు ఎన్టీఆర్ (NTR) సింహాద్రి మే 20న రీ రిలీజ్ కానుంది. ఎన్టీఆర్‌, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో రూపొందిన ఈ సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌లో ఒక‌టిగా నిలిచింది. ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మే 20న తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్‌సీస్‌లో భారీ ఎత్తున ఈ సినిమాను రీ రిలీజ్ చేయ‌బోతున్నారు.

హాలీవుడ్ సూప‌ర్ హిట్ ఫ్రాంచైజ్‌లో ఒక‌టైన ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ సిరీస్‌లో ప‌దో మూవీ ఫాస్ట్ ఎక్స్ మే 18న హాలీవుడ్‌తో పాటు తెలుగులో రిలీజ్ కాబోతున్న‌ది. అలాగే నంద‌మూరి తార‌క‌ర‌త్న న‌టించిన చివ‌రి మూవీ మిస్ట‌ర్ తార‌క్ కూడా మే 18న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. వీటితో పాటు అమ‌లా, హ‌సీనా సినిమాలు ఈ వారం తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి.

IPL_Entry_Point

టాపిక్