IRCTC Kerala Tour Package 2024 : ప్రకృతి అందాలకు కేరాఫ్ అయిన కేరళ(Kerala Tour Package) వెళ్తే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అక్కడి వెదర్ చూస్తే… ఇట్టే నచ్చేస్తుంది. కొన్ని రోజులు అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది. అలా వెళ్లాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ టూరిజం(IRCTC Tourism) సరికొత్త ప్యాకేజీలను అందిస్తోంది. అందులోనూ తక్కువ ధరతోనే ఆపరేట్ చేస్తోంది. ప్రస్తుతం మండుతున్న వేసవిలో… కేరళను చూసి వచ్చేందుకు ‘CULTURAL KERALA’ పేరుతో ప్యాకేజీని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా… అలెప్పీ, మున్నార్, కొచ్చి, త్రివేండం వంటి ప్రాంతాలను చూసి రావొచ్చు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను ఇక్కడ చూడండి….
IRCTC Hyderabad Kerala Tour Package Prices 2024: ఈ ప్యాకేజీ ధరలు(IRCTC Hyderabad Kerala Tour) చూస్తే…కంఫార్ట్ క్లాస్ లో సింగిల్ అక్యుపెన్సీకి రూ. 53100గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 35700, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 33750గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు కూడా వేర్వురు ధరలు నిర్ణయించారు. ఈ టూర్‌లో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 నెంబర్ ను సంప్రదించవచ్చు.