IRCTC Sikkim Tour Package : నీలి పర్వతాలు, అద్భుత జలపాతాలు-6 రోజుల పాటు సిక్కింలో టూర్, ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే!
IRCTC Sikkim Tour Package : ఈ సమ్మర్ లో నగర జీవితానికి కాస్త రెస్ట్ ఇవ్వాలని భావిస్తు్న్నారా? అయితే 6 రోజుల పాటు సిక్కిం టూర్ ప్యాకేజీ అందిస్తోంది ఐఆర్సీటీసీ.
IRCTC Sikkim Tour Package : ఈశాన్య భారతదేశంలో(North East Tour) నీలి పర్వతాలు, సుందరమైన లోయలు, రెడ్ రివర్ కు నెలవు. తూర్పు హిమాలయాల్లో ఉన్న ఈ ప్రాంతం సహజ సౌందర్యం, వన్యప్రాణులు, వివిధ రకాల వృక్షాలకు పుట్టినిల్లు. దక్షిణాసియాలో అత్యంత అందమైన పర్యావరణ, పర్యాటక గమ్యస్థానంగా ఈశాన్య రాష్ట్రాలను చెప్పవచ్చు. ఈశాన్య ప్రాంతం దేశంలో సూర్యుడు మొదట ఉదయించే ప్రాంతం. పర్యాటకులకు స్వర్గధామం, నగర జీవితానికి కాస్త రెస్ట్ ఇచ్చేందుకు ఈశాన్య రాష్ట్రాలు(North Eastern States) గమ్యస్థానం. 6 రోజుల పాటు ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు ఐఆర్సీటీసీ సిక్కిం గోల్డ్ టూర్ ప్యాకేజీ(IRCTC Sikkim Package) అందిస్తుంది. సిక్కిం(Sikkim) రాజధాని గ్యాంగ్ టక్(Gangtok), లాచుంగ్(Lachung) లో పర్యటక ప్రదేశాలు వీక్షించవచ్చు.
టూర్ ప్యాకేజీ ధరలు(Tour Cost)
పీక్ సీజన్ ప్యాకేజీ ధర (ఒక వ్యక్తికి)- ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు, అక్టోబర్ 1వ తేదీ 2024 నుంచి జనవరి 4వ తేదీ 2025 వరకు
క్లాస్ | డబుల్ షేరింగ్ | ట్రిపుల్ షేరింగ్ | డబుల్-4 పాసింజర్స్ | డబుల్-6 పాసింజర్స్ | చైల్డ్ విత్ బెడ్(5-11 years) | చైల్డ్ విత్ అవుట్ బెడ్(5-11 years) |
డీలక్స్ | రూ.38050 | రూ.28225 | రూ.27585 | రూ.22600 | రూ.8600 | రూ.6325 |
అన్ సీజన్ ప్యాకేజీ ధర (వ్యక్తికి) : జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు, అలాగే జనవరి 5, 2025 నుంచి మార్చి 31, 2025 వరకు
క్లాస్ | డబుల్ షేరింగ్ | ట్రిపుల్ షేరింగ్ | డబుల్-4 పాసింజర్స్ | డబుల్-6 పాసింజర్స్ | చైల్డ్ విత్ బెడ్(5-11 years) | చైల్డ్ విత్ అవుట్ బెడ్(5-11 years) |
డీలక్స్ | రూ.31730 | రూ.24500 | రూ.22950 | రూ.19200 | రూ.9980 | రూ.6960 |
వర్గం డబుల్ షేరింగ్ ట్రిపుల్ షేరింగ్ డబుల్-4 పాసింజర్స్ డబుల్ 6 పాసింజర్స్ చైల్ విత్ బెడ్ ( 5-11 years) చైల్డ్ విత్ అవుట్ బెడ్(5-11 Years)
డీలక్స్ రూ.31,730 రూ.24,500 రూ.22,950 రూ.19,200 రూ.9,980 రూ.6,960
టూర్ వివరాలు(Tour Details)
- డే 1 : న్యూ జల్పైగురి జంక్షన్ రైల్వే స్టేషన్ / పశ్చిమ బెంగాల్ లోని బాగ్డోగ్రా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పర్యటకులను పిక్ అప్ చేసుకుని సుమారు 125 కిమీ దూరంలో ఉన్న సిక్కిం రాజధాని గ్యాంగ్ టక్ తీసుకెళ్లారు. గ్యాంగ్ టక్ లోని హోటల్ చెక్ ఇన్ చేస్తారు. మిగిలిన సమయంలో విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి బస గ్యాంగ్‌టక్‌లోనే ఉంటుంది.
- డే 2 : గ్యాంగ్‌టక్ (త్సోమ్‌గో సరస్సు పర్యటన)- గ్యాంగ్‌టక్ సిటీ నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్సోమ్‌గో సరస్సు(Tsomgo Lake), బాబా హర్భజన్ సింగ్ మెమోరియల్ సందర్శన ఉంటుంది. శీతాకాలంలో పూర్తిగా గడ్డకట్టే త్సోమ్‌గో సరస్సును స్థానికులు చాలా పవిత్రంగా భావిస్తారు. నాథు లా పాస్ ఇండియా- చైనా బోర్డర్ పాయింట్ కు టూరిస్టు సొంత ఖర్చుతో వెళ్లవచ్చు. అయితే ప్రభుత్వ అథారిటీ/ఆర్మీ అనుమతికి లోబడి ఈ పర్యటన ఉంటుంది. తిరిగి రాత్రి గ్యాంగ్‌టక్ హోటల్ కు చేరుకుంటారు.
- డే 3 : గ్యాంగ్‌టక్-లాచుంగ్ పర్యటన : బ్రేక్ ఫాస్ట్ తర్వాత గ్యాంగ్‌టక్(Gangtok)లోని హోటల్ నుంచి ఉదయం 9.00 గంటలకు పికప్ చేసి లాచుంగ్‌కు తీసుకెళ్తారు. ఈ డ్రైవ్‌లో సింఘిక్ వ్యూ పాయింట్, సెవెన్ సిస్టర్స్ వాటర్ ఫాల్, నాగా వాటర్ ఫాల్... సాయంత్రం లాచుంగ్ చేరుకుంటారు. లాచుంగ్ లోని హోటల్‌లో రాత్రి బస ఉంటుంది.
- డే 4 : లాచుంగ్-యుమ్‌తంగ్ పర్యటన : లాచుంగ్ లోని యమ్‌తంగ్ వ్యాలీని(Yumthang) పూల లోయ అని పిలుస్తారు. యమ్ తంగ్ టూర్ తర్వాత తిరుగు ప్రయాణంలో హాట్ స్ప్రింగ్‌ని సందర్శించవచ్చు. స్థానిక ప్రజలు, వారి జీవనశైలి గురించి తెలుసుకోవచ్చు. తిరిగి రాత్రి గ్యాంగ్‌టక్‌కు బయలుదేరి వెళ్తారు. .
- డే 5 : గ్యాంగ్‌టక్ స్థానిక పర్యటన : బ్రేక్ ఫాస్ట్ తర్వాత గ్యాంగ్‌టక్ స్థానిక సందర్శనా స్థలాలు ఎంచే మొనాస్టరీ, గణేష్ టోక్, హనుమాన్ టోక్, తాషి వ్యూ పాయింట్, ఫ్లవర్ షోతో చూడవచ్చు. బక్తాంగ్ వాటర్ ఫాల్స్, రోప్‌వేపై ప్రయాణించవచ్చు. విశ్రాంతి తర్వాత సాయంత్రం స్థానికంగా షాపింగ్ చేయవచ్చు. రాత్రికి హోటల్ బస ఉంటుంది.
- డే 6 : ప్యాకింగ్, వ్యక్తిగత కార్యకలాపాలకు తర్వాత గ్యాంగ్ టక్ హోటల్ నుంచి చెక్ అవుట్ చేస్తారు. మిమ్మల్ని NJP రైల్వే స్టేషన్/ బాగ్డోగ్రా విమానాశ్రయానికి తీసుకెళ్తారు. ఇక్కడితో టూర్ ముగుస్తుంది.
మీ ప్రాంతాల నుంచి బాగ్డోగ్రా అంతర్జాతీయ విమానాశ్రయానికి సర్వీసుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి