IRCTC North East Tour Package : ఈశాన్య రాష్ట్రాల్లో 7 రోజులు చక్కర్లు, సమ్మర్ లో ఐఆర్సీటీసీ కూల్ ట్రిప్-north east essence tour from guwahati irctc tour package for 7 days trip ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc North East Tour Package : ఈశాన్య రాష్ట్రాల్లో 7 రోజులు చక్కర్లు, సమ్మర్ లో ఐఆర్సీటీసీ కూల్ ట్రిప్

IRCTC North East Tour Package : ఈశాన్య రాష్ట్రాల్లో 7 రోజులు చక్కర్లు, సమ్మర్ లో ఐఆర్సీటీసీ కూల్ ట్రిప్

Bandaru Satyaprasad HT Telugu
Apr 09, 2024 01:45 PM IST

IRCTC North East Tour Package : సమ్మర్ లో ఈశాన్య రాష్ట్రాల్లో ఫేమస్ ప్లేస్ లలో ట్రిప్ కు ప్లాన్ చేస్తుంటే... మీకు అందుబాటు ఖర్చులో ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ ఉంది. ఈ టూర్ లో గౌహతి నుంచి 7 రోజుల పాటు షిల్లాంగ్, కాజీరంగాతో పాటు ఇతర ప్రదేశాలను చూడవచ్చు.

ఈశాన్య రాష్ట్రాల్లో 7 రోజుల టూర్
ఈశాన్య రాష్ట్రాల్లో 7 రోజుల టూర్

IRCTC North East Tour Package : ఈ సమ్మర్ లో కూల్ గా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో టూర్ కి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఐఆర్సీటీసీ(IRCTC Tour Package) అసోం రాజధాని గౌహతి నుంచి 7 రోజుల టూర్ ప్యాకేజీ(Essence of NorthEast-Guwahati) అందిస్తుంది. ఈ టూర్ లో చిరపుంజీ, కాజీరంగా నేషనల్ పార్క్, మావ్లిన్‌నాంగ్, షిల్లాంగ్ ను చుట్టిరావచ్చు. ఏసీ టూరిస్ట్ బస్సుల్లో గౌహతి - షిల్లాంగ్(Shillong) - చిరపుంజీ(Cherranpunjee) - డావ్కీ -మావ్లిన్నాంగ్ - కాజీరంగా(Kaziranga) - గౌహతి టూర్ ఉంటుంది. ప్రతి శనివారం ఈ టూర్ అందుబాటులో ఉంది.

ఒక్కో ప్యాసింజర్ కు ప్యాకేజీ టారిఫ్ వివరాలు(Tour Tariff Per Person)

క్లాస్ఆక్యుపెన్సీఒక్కో వ్యక్తికి ధర
కంఫర్ట్సింగిల్రూ.36450
 డబుల్రూ.28670
 ట్రిపుల్రూ.26850
 చైల్డ్ విత్ బెడ్(5-11 Years)రూ.23680
 చైల్డ్ విత్ అవుట్ బెడ్(2-4 Years)రూ.17440

టూర్ వివరాలు

  • డే 1 : గౌహతి విమానాశ్రయం/రైల్వే స్టేషన్‌ నుంచి... గౌహతిలోని హోటల్‌కు తీసుకెళ్లారు. రాత్రి బస అక్కడే ఉంటుంది.
  • డే 2 : గౌహతి విమానాశ్రయం నుంచి షిల్లాంగ్(Shillong) (130 కి.మీ)- బ్రేక్ ఫాస్ట్ తర్వాత కామాఖ్య ఆలయాన్ని సందర్శించి, షిల్లాంగ్‌కు బయలుదేరతారు. మార్గమధ్యలో ఉమియం లేక్ సందర్శిస్తారు. షిల్లాంగ్ చేరుకున్నాక హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత వార్డ్స్ లేక్, లేడీ హైదరీ పార్క్ సందర్శన ఉంటుంది. రాత్రికి షిల్లాంగ్‌లోని హోటల్‌లో బస ఉంటుంది.
  • డే 3 : షిల్లాంగ్ - చిరపుంజీ - షిల్లాంగ్ (60 కిమీలు / 2 గంటల డ్రైవ్)- బ్రేక్ ఫాస్ట్ తర్వాత చిరపుంజీకి బయలుదేరతారు. ఎలిఫెంటా జలపాతం, డ్వాన్ సియెమ్ వ్యూ పాయింట్, నోహ్ కాలికై జలపాతం, మావ్స్మై గుహలు, సెవెన్ సిస్టర్ జలపాతం సందర్శించవచ్చు. తిరిగి షిల్లాంగ్ చేరుకుని రాత్రి బస చేస్తారు.
  • డే 4 : షిల్లాంగ్ -డావ్కీ - మావ్లిన్‌నాంగ్ -షిల్లాంగ్ (85 కిమీలు / 3 గంటల డ్రైవ్)- బ్రేక్ ఫాస్ట్ తర్వాత డావ్కీ (బంగ్లాదేశ్ సరిహద్దు), ఆసియాలోని అత్యంత పరిశుభ్రమైన గ్రామమైన మావ్లిన్నాంగ్‌కి బయలుదేరతారు. ఈ ప్రాంతాల సందర్శన తర్వాత తిరిగి షిల్లాంగ్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు.
  • డే 5 : షిల్లాంగ్ -కాజీరంగా (250 కి.మీ.లు /5-6 గంటల డ్రైవ్)- హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత చెక్-అవుట్ చేసి కజిరంగాకు బయలుదేరతారు. కాజీరంగా చేరుకుని హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. రాత్రికి కాజిరంగాలోని హోటల్‌లో బస ఉంటుంది.
  • డే 6 : కాజిరంగా నేషనల్ పార్క్(Kaziranga National Park)- గౌహతి - బ్రేక్ ఫాస్ట్ తర్వాత కాజీరంగా నేషనల్ పార్క్ లో సఫారీకి వెళ్లవచ్చు (సొంత ఖర్చుతో). తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి తిరిగి గౌహతికి బస్సుల్లో బయలుదేరతారు. గౌహతికి చేరుకున్నాక హోటల్ చెక్ ఇన్ చేస్తారు. గౌహతిలో రాత్రి బస ఉంటుంది.
  • డే 7 : బ్రేక్ ఫాస్ట్ తర్వాత గౌహతి విమానాశ్రయం/ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి వదులుతారు. దీంతో టూర్ ముగుస్తుంది.

విజయవాడ, హైదరాబాద్ నుంచి గౌహతికి విమాన సర్వీసులు- ఇక్కడ క్లిక్ చేయండి

ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందించేవి

  • సౌకర్యవంతమైన హోటల్‌లో ఆరు రాత్రుల వసతి
  • MAPలో భోజనం (బ్రేక్ ఫాస్ట్, డిన్నర్)
  • రవాణా ఛార్జీలు
  • టూర్ ప్యాకేజీలని సందర్శనా స్థలాలు
  • ప్రయాణ బీమా
  • రోడ్డు టోల్ ట్యాక్స్ , పార్కింగ్ ఫీజు

గౌహతి నుంచి ఈశాన్య రాష్ట్రాల టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

Whats_app_banner

సంబంధిత కథనం