Summer Special Trains : తెలుగు రాష్ట్రాల మధ్య 48 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్, జాబితా ఇదే!
- Summer Special Trains : వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 48 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది.
- Summer Special Trains : వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 48 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది.
(1 / 8)
వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 48 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది.
(2 / 8)
సికింద్రాబాద్-నాగర్‌సోల్, నాగర్‌సోల్-సికింద్రాబాద్, తిరుపతి-మచిలీపట్నం, మచిలీపట్నం-తిరుపతి, సీఎస్టీ ముంబయి-కరీంనగర్, కరీంనగర్- సీఎస్టీ ముంబయి, యశ్వంత్‌పూర్-కాలాబుర్గి, కాలాబుర్గి-యశ్వంత్ పూ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.
(3 / 8)
సికింద్రాబాద్-నాగర్‌సోల్ ( రైలు నెం.07517) ప్రత్యేక రైలు ఏప్రిల్ 17 నుంచి మే 29 వరకు ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నాగర్‌సోల్-సికింద్రాబాద్ (రైలు నెం.07518) స్పెషల్ ట్రైన్ ఏప్రిల్ 18 నుంచి మే 30 వరకు ప్రతీ గురువారం నడపనున్నారు.
(4 / 8)
తిరుపతి-మచిలీపట్నం మధ్య (రైలు నెం.07121) ప్రత్యేక రైలు ఏప్రిల్ 14 నుంచి మే 26 వరకు ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది. మచిలీపట్నం-తిరుపతి (రైలు నెం.07122) ప్రత్యేక రైలు ప్రతీ సోమవారం ఏప్రిల్ 15 నుంచి మే 27 వరకు నడపనున్నారు.
(5 / 8)
సీఎస్టీ ముంబయి-కరీంనగర్ మధ్య ప్రత్యేక రైలు(01067) ఏప్రిల్ 9 నుంచి మే 28 వరకు ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది. కరీంనగర్-సీఎస్టీ ముంబయి మధ్య ప్రత్యేక రైలు(01068) ఏప్రిల్ 10 నుంచి మే 29 వరకు నడపనున్నారు. యశ్వంత్‌పూర్-కాలాబుర్గి ప్రత్యేక రైలు(నెం.06505) ఏప్రిల్ 8వ తేదీన, కాలాబుర్గి-యశ్వంత్‌పూర్ ప్రత్యేక రైలు(06506) ఏప్రిల్ 9న నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
(6 / 8)
అదనపు రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-రామనాథపురం-సికింద్రాబాద్ స్పెషల్ రైలు (నెం. 07695/07696) పొడిగిస్తున్నట్లు తెలియజేసింది.
(7 / 8)
విజయవాడ-హుబ్లీ-విజయవాడ(07001/07002) మధ్య ఉగాది స్పెషల్ ట్రైన్స్ ఈ నెల 10, 11 తేదీల్లో నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.
(8 / 8)
ఈ నెల 9న పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు. హైదారాబాద్-లింగంపల్లి(47125), లింగంపల్లి-సికింద్రాబాద్(47193), ఫలక్ నుమా-లింగంపల్లి(47167), లింగంపల్లి-ఉమ్దానగర్(47194), లింగంపల్లి-సికింద్రాబాద్(47195) రైళ్లను రద్దు చేశారు. ఉమ్దానగర్-లింగపల్లి(47103) ఎంఎంటీఎస్ సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య రద్దు చేశారు.
ఇతర గ్యాలరీలు