తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Lunar Eclipse 2022 : హైదరాబాద్‌లో చంద్రగ్రహణం ఎప్పుడు.. ఎంతసేపు ఉంటుంది?

Lunar Eclipse 2022 : హైదరాబాద్‌లో చంద్రగ్రహణం ఎప్పుడు.. ఎంతసేపు ఉంటుంది?

HT Telugu Desk HT Telugu

08 November 2022, 11:19 IST

    • Lunar Eclipse 2022 in Hyderabad : సంపూర్ణ చంద్రగ్రహణం మంగళవారం ఏర్పడనుంది. చాలా ప్రాంతాల్లో పాక్షిక చంద్రగ్రహణం మాత్రమే కనిపిస్తుంది. మరి హైదరాబాద్ లో ఏ సమయనికి ఏర్పడుతుంది. ఎంతసేపు ఉంటుంది?
చంద్రగ్రహణం 2022
చంద్రగ్రహణం 2022

చంద్రగ్రహణం 2022

Lunar Eclipse November 2022 : ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం(Chandra Grahanam) సాయంత్రం ఏర్పడనుంది. ఏప్రిల్ లో ఒకేసారి చంద్రగ్రహణం ఏర్పడింది. హైదరాబాద్‌(Hyderabad)లోని ప్రజలు సాయంత్రం 05:43 గంటలకు చంద్రగ్రహణాన్ని చూడొచ్చు. సుమారు 1 గంట 46 నిమిషాలు ఉంటుంది. అయితే ఈ చంద్రగ్రహణం కొన్ని నగరాల్లో సంపూర్ణంగా కనిపించనుంది. మరికొన్ని నగరాల్లో పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది. గ్రహణాన్ని చూసేందుకు ప్రత్యేక పరికరాలు ఏం ఏవసరం లేదని నిపుణులు అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Siddipet Accident : పెళ్లి రోజే విషాదం, రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Youth Cheated Producer : ఒక్క ఛాన్స్ అంటూ నిర్మాత చుట్టూ ప్రదక్షిణాలు, అవకాశం చిక్కగానే బంగారంతో జంప్

Cyber Crime : ప్రముఖ కంపెనీలో ఉద్యోగం, సిద్దిపేట యువతికి రూ.16 లక్షలు టోకరా - ఏపీలో సైబర్ కేటుగాడు అరెస్ట్

Mlc Dande Vithal : ఎమ్మెల్సీగా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు, సుప్రీంలో సవాల్ చేస్తానంటోన్న దండే విఠల్

హైదరాబాద్ లో చంద్రగ్రహణం(Hyderabad Chandra Grahanam) సాయంత్రం 5.40కి ప్రారంభవుతుంది. 7.26 గంటలకు ముగియనుంది. మొత్తంగా 1.46 నిమిషాల పాటు ఉంటుంది. సంపూర్ణ చంద్రగ్రహణంతో యాదగిరి(Yadagiri Temple) గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం తలుపు మూసివేశారు. ఉదయం ఆలయంలో నిత్య కైంకర్యాలు పూర్తి చేసి 8.15 గంటలకు ఆలయాన్ని క్లోజ్ చేశారు. రాత్రి 8 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేస్తారు. బుధవారం ఉదయం 9 నుంచి స్వామి వారి దర్శనాలతో పాటు, నిత్య కైంకర్యాలు యథావిధిగా జరుగుతాయి.

చంద్రగ్రహణం కారణంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని(Komuravelli Mallikarjuna Temple) కూడా మూసివేశారు. ఉదయం 6గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తలుపులు మూసే ఉండనున్నాయి. ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలు సైతం రద్దు చేశారు. రాత్రి 7 గంటలకు ఆలయ సంప్రోక్షణ, స్వామివారికి అభిషేకం, మంగలహారతి, నివేదన నిర్వహిస్తారు. రాష్ట్రంలోని వివిధ ఆలయాలను కూడా మూసేశారు.

చంద్రగ్రహణం(Lunar Eclipse) ముగిసిన తర్వాతే ఆలయాల తెరుచుకుంటాయి. పూజారులు దేవాలయాలను శుద్ధిచేసి పూజ చేయనున్నారు. ఇంట్లో కూడా శుద్ధి అనంతరం పూజ చేయాలని చెబుతున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి ఏదైనా వస్తువు దానం చేయాలని అంటుంటారు. ఇలా చేస్తే.. గ్రహణం ప్రతికూల ప్రభావం ఉండదని నమ్మకం.

సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే లైన్​లోకి చేరితే చంద్రగ్రహణం(Chandra Grahanam 2022) ఏర్పడుంది. భూమి నీడలోకి వెళుతుండటంతో.. చంద్రుడు కొద్దిసేపు దర్శనమివ్వడు. సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో.. భూమి నీడలోని అత్యంత చీకటి ప్రాంతంగా పిలిచే 'అంబ్రా' చోటకు చంద్రుడు చేరుకుంటాడు. అదే సమయంలో సూర్య కిరణాలు.. భూమి వాతావరణం గుండా ప్రయాణించి చంద్రుడికి చేరుతాయి. ఈ సమయంలో చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. దీనినే 'బ్లడ్​ మూన్​' అని కూడా పిలుస్తారు.